శకుంతలా నరసింహన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శకుంతలా నరసింహన్
జననం1940 [1]
ప్రసిద్ధిప్రసిద్ధ రచయిత, సంగీతకారులు

శకుంతలా నరసింహన్ ప్రసిద్ధ రచయిత, సంగీతకారులు.[2]

జీవిత విశేషాలు[మార్చు]

ఈమె సంగీత శాస్త్ర పరిశోధనావేత్త. తండ్రిది కర్ణాటక, తల్లిది తమిళనాదు. తండ్రి ఉద్యోగరీత్యా ఢిల్లీ బదిలీ అవడంతో ఈమె ప్రాథమిక విద్య అంతా అక్కడే జరిగింది. పదవతరగతి పరీక్షలు రాయడానికి వయసు సరిపోక అర్హత లభించకపోవడంతో ఖాళీగా ఉన్న రెండేళ్ళ సమయంలో చెన్నై వెళ్ళీ సంగీత సాధన చేశారు. పదేళ్ళ వయసుకే పది స్పర్ణపతకాలను అందుకున్నారు.

ఈమె తండ్రికి ఢిల్లీ నుండి విశాఖపట్టణానికి బదిలీ కావడంతో ఆంధ్రా యూనివర్శిటీ లో "హిందూస్థానీ , కర్ణాటక సంగీతాల నడుమ సారూప్యం" అంశం మీద చేసిన పరిశోధనకు డాక్టరేట్ పట్టాను అందుకున్నారు. సోషియాలజీలో మహిళలకు సంబంధించి ఈమె చేసిన మరో పరిశోధనకు కూడ డాక్టరేట్ లభించింది.

డాక్టర్ శకుంతల గారు హిందూస్థానీ సంగీతంలో కఠోర సాధన చేశారు. ఆకాశవాడి నిర్వహించిన పోటీలో పాల్గొని అప్పటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ చేతులమీదుగా స్వర్ణవీణను అందుకున్న ఘనాపాఠీ. ఈమె తొలి జుగుల్బందీ రీతి ఈమెను ఒక ప్రత్యేక స్థానంలో నిలబెట్టింది. అనేకనేక గౌరవ పురస్కారాలు, అవార్డులు అందుకున్న ఈమె ఈనాటికీ సంగీత సామ్రాజ్యంలో పరిశోధనలు చేస్తూనే ఉన్నారు.

డాక్టర్ శకుంతల గారు 1979 నాటికి కర్ణాటక, హిందూస్థానీ సంగీతాలు రెండింటిలోనూ "ఏ" శ్రేణి విధ్వాంసురాలుగా ఉన్న ఏకైక వ్యక్తిగా ప్రసిద్ధి చెందారు. ఒకే గళంలో రెండు సంగీత రీతులను అధ్భుతంగా ఆలపించి శ్రోతలను సంగీత ప్రపంచంలో ఓలలాడించడం ఈమె ప్రత్యేకత.

2006 లో డాక్టర్ శకుంతల నరసింహన్,(ఉస్తాద్ హఫీజ్ అహ్మద్ ఖాన్ యొక్క ఆరాధకురాలు) రాంపూర్-సహస్వాన్ ఘరానా కోసం "ద స్ప్లెండర్ ఆఫ్ రాంపూర్-సహస్వాన్ ఘరానా" పేరుతో ఒక పుస్తకాన్ని ప్రచురించారు.[3][4]

ముఖ్య రచనలు[మార్చు]

  • Lucky days & other stories
  • Invitation to Indian music
  • Sati, a study of widow burning in India

మూలాలు[మార్చు]

  1. "జనన వివరాలు". Archived from the original on 2016-03-05. Retrieved 2014-03-08.
  2. "హిందూ పత్రికలో వ్యాసం". Archived from the original on 2010-11-28. Retrieved 2014-03-08.
  3. "Notes from another time: Sakuntala Narasimhan's book on the Rampur-Sahaswan gharana captures the cultural history of a period". The Hindu. Sep 16, 2006. Archived from the original on 2013-06-29. Retrieved June 4, 2013.
  4. S. Kashif Ali (May 29, 2009). "Quietly fading into oblivion". The Hindu. Archived from the original on 2009-08-29. Retrieved June 4, 2013.

ఇతర లింకులు[మార్చు]