శతక కవుల చరిత్రము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శతక కవుల చరిత్రము
కృతికర్త: వంగూరి సుబ్బారావు
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: జీవితచరిత్ర
ప్రచురణ: ఆంధ్రపత్రిక, మద్రాసు
విడుదల: 1924, 1957


శతక కవుల చరిత్రము ఒక ప్రత్యేకమైన తెలుగు గ్రంథము.[1] శతకములను రచించిన కవుల జీవితచరిత్రలకే ఇది ప్రత్యేకం. ఇది పండిత వంగూరు సుబ్బారావు గారిచే రచియించబడింది. దీని తొలిప్రతి 1924 లో ఆంధ్రపత్రికా ముద్రణాలయంలో ముద్రించబడింది. కాశీనాథుని నాగేశ్వరరావు గారు విపులమైన పీఠికను రచించారు.

ఇందు ప్రథమభాగములో సా.శ. 1150 - 1500 మధ్య జీవించిన 114 మంది శతక కవుల జీవితసంగ్రహాలను చిత్రించారు. ద్వితీయభాగములో సా.శ. 1500 - 1700 మధ్య జీవించిన 110 మంది కవులను, తృతీయభాగములో సా.శ. 1700 - 1800 మధ్య జీవించిన 130 కవులను, చతుర్థభాగములో సా.శ. 1800 - 1900 మధ్యకాలపు 130 మంది జీవితాల గురించి వివరించారు.

ఈ గ్రంథం యొక్క రెండవ కూర్పులో చాలా విస్తృతమై 1957 సుమారు 1000 పేజీల గ్రంథంగా మారింది.[2] దీనికి నిడుదవోలు వెంకటరావు గారు పీఠినకు రచించారు.

విషయసూచిక[మార్చు]

ప్రథమభాగము[మార్చు]

సా.శ. 1150 - 1500 మధ్యకవులు[మార్చు]

1. పండితారాధ్యులు, 2. పాలుకురికి సోమనాథుడు, 3. బద్దెన, 4. యథావాక్కుల అన్నమయ్య, 5. శివదేవమంత్రి, 6. రావిపాటి త్రిపురాంతకుడు, 7. వెన్నెలకంటి జన్నయ, 8. వేమన్న, 9. బమ్మెర పోతనామాత్యుడు, 10. అయ్యలరాజు త్రిపురాంతకుడు

ద్వితీయభాగము[మార్చు]

సా.శ. 1500-1600 మధ్యకవులు[మార్చు]

11 ధూర్జటికవి, 12 తాళ్ళపాక చినన్న, 13 వెలగపూడి వెంగనార్యుఁడు, 14 తిరువేంగళప్ప, 15 తాళ్లపాక అన్నమయ్య, 16 అన్నమాచార్యుఁడు, 17 శ్రీనివాసుడు, 18 తిమ్మనార్యుడు, 19 కంసాలి రుద్రకవి, 20 కవి చౌడప్ప, 21 పరమానందయతి, 22. మారవికవి, 23 బొడ్డపాటి పేరయ, 24 బొడ్డపాటి కొండయ, 25 ఎలకుర్తి రామరాజు, 26 తేళ్ళపూడి కసవరాజు, 27 పట్టాభిరామకవి, 28 గణపవరపు వేంకటకవి

సా.శ. 1600-1700 మధ్యకవులు[మార్చు]

29 ఎలకూచి బాలసరస్వతి, 30 పైడిపాటి వేంకట నృసింహకవి, 31 అయ్యలరాజు నారాయణకవి, 32 కంచర్ల గోపన్న, 33 గద్దె రామలింగకవి, 34 శ్రీగిరి విరూపాక్షుడు, 35 కాకునూరి అప్పకవి.

తృతీయభాగము[మార్చు]

సా.శ. 1700-1800 మధ్యకవులు[మార్చు]

36 కూచిమంచి తిమ్మకవి, 37 ఏనుగు లక్ష్మణకవి, 38 వైదర్సు అప్పయకవి, 39 గోగులపాటి కూర్మనాథకవి, 40 వెలగపూడి కృష్ణయ, 41 అడిదము సూరకవి, 42 రావూరి సంజీవకవి, 43 పుసులూరి సోమరాజకవి, 44 మఱింగంటి సింగరాచారి, 45 పత్రి రమణప్ప, 46 శంకర శంకరకవి, 47 మదిన సుభద్రయ్యమ్మ, 48 పుష్పగిరి తిమ్మకవి, 49 పోచిరాజు వీరన్న, 50 దేవగుప్తాపు రామభద్రకవి, 51 పరశురామపంతుల రామమూర్తి, 52 చట్రానికి లక్ష్మినరుసు, 53 గంగాధరకవి, 54 సిద్దరామకవి (చెన్నయ), 55 సోమేశ్వరారాధ్యులు, 56 నిమ్మల లక్ష్మణాచార్యుఁడు, 57 చెన్నాప్రగడ నాగరాజు, 58 శ్రీపతి భాస్కరకవి, 59 ఆణివెళ్ళ సీతారాముఁడు, 60 శేషప్పకవి, 61 మల్లనయోగి, 62 రాచవేటికవి, 63 పావులూరి మల్లన, 64 రాయభట్టు వీరరాఘవకవి (వాడ్రేవు కామరాజు), 65 బాణాల వీరశరభేంద్రుఁడు, 66 తాడేపల్లి పానకాలరాయడు, 67 రామభద్రకవి, 68 వరహగిరి కొండ్రాజు, 69 నృసింహకవి, 70 కొమరగిరి సంజీవకవి, 71 ఉన్నవ యోగానందుఁడు, 72 కర్లపాలెము సింగనామాత్యుఁడు, 73 తిరుక్కడయూరి కృష్ణదాసు, 74 కాండూరి వేంకటదాసు, 75 కాసుల పురుషోత్తమకవి

చతుర్థ భాగము[మార్చు]

సా.శ. 1800-1900 మధ్యకవులు[మార్చు]

76 సదానంద వరదరాజయోగి, 77 వంగూరి నరసకవి, 78 ఎఱ్ఱమిల్లి సూర్యప్రకాశకవి 79 వంకాయలపాటి వేంకటకవి, 80 జూలూరి అప్పయ, 81 తరిగొండ వెంకమ్మ, 82 మాత్తూరి అప్పావు మొదలి, 83 పారసంది సర్వేశ్వరశాస్త్రి, 84 బహుజనపల్లి సీతొ రామాచారి, 85 శాంతానందయోగి, 86 ఫక్కి వేంకటనరసయ్య, 87 మంత్రిప్రెగడ సూర్యప్రకాశకవి, 88 శ్రీనివాసకవి, 89 ఝంఝామారుతము వేంకటసుబ్బకవి, 90 సాహేబురాణ రామన్న, 91 బండి బాపసమ్మ, 92 వెండిగంటము గురునాథము, 93 ఊడుమూడి సూరపరాజు, 94 చేకూరి సిద్దయ, 95 చీదెళ్ళ రామకవి, 96 పాటూరి లక్ష్మీనృసింహకవి, 97 మోదుకూరి శంకరకవి, 98 అమలాపురపు సన్యాసికవి, 99 కూచిమంచి సోమసుందరుఁడు, 100 బాలకృష్ణకవి, 101 అడిదము బుచ్చి వేంకట్రాయుఁడు, 102 బుద్ధిరాజు కనకరాజు, 103 తోట విజయరాఘవకవి, 104 కొమజ్ఞాజు రామలింగకవి, 105 అల్లమరాజు సుబ్రహ్మణ్యకవి, 106 పరిమి వేంకటాచలకవి, 107 వేల్పూరి వేంకటకవి, 108 మంచెళ్ళ కృష్ణకవి, 109 తిరువాయిపాటి రామానుజయ్య, 110 శిష్టు సర్వశాస్త్రి, 111 దూపాటి తిరుమలాచారి, 112 మేకా బాపన్న, 113 మిక్కిలి మల్లికార్జునకవి, 114 పూసపాటి వీరపరాజు, 115 కోటశ్వర దీక్షితుఁడు, 116 ఘటికాద్రికవి, 117 చిలకమఱ్ఱి నారాయణాచార్యులు, 118 ఇంద్రకంటి వేంకటకవి, 119 పల్లి పార్వతీశము, 120 చామర్తి శేషగిరిరాయకవి, 121 విజయనగరపు చెంగల్వరాయకవి, 122 మద్దాలి సుబ్బయ్య, 123 కొల్లము నీతారామకవి, 124 గుఱ్ఱంకొండ భక్తవత్సలుడు, 125 పాలెపు వేంకటసూర్యగోపాలకవి

మూలాలు[మార్చు]