శరత్ జ్యోత్స్నారాణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎస్. శరత్ జ్యోత్స్నారాణి
Sarat Jyotsna Rani.jpg
జననంశరత్ జ్యోత్స్నారాణి
కాకినాడ, ఆంధ్రప్రదేశ్ India
వృత్తితెలుగు ప్రొఫెసర్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ
మతంహిందూ మతం
తండ్రిఎస్. టి. జ్ఞానానంద కవి
తల్లిసుగుణమణి

శరత్ జ్యోత్స్నారాణి ప్రఖ్యాత తెలుగు రచయిత్రి, పరిశోధకురాలు.

విశేషాలు[మార్చు]

ఈమె ప్రఖ్యాత కవి ఎస్. టి. జ్ఞానానంద కవి, సుగుణమణి దంపతులకు కాకినాడలో జన్మించింది[1]. ఈమె బి.ఎ. అన్నవరం సత్యాదేవి కళాశాలలో తెలుగు ప్రత్యేక అంశంగా చదివింది. ఈమె తెలుగు సాహిత్యంలో నాగార్జున విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎ, హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం నుండి ఎం.ఫిల్, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ‘ఎల్లోరా రచనలు సమగ్ర పరిశీలన’ అనే అంశంపై పరిశోధించి పి.హెచ్.డి చేసింది. ఈమె మొదట కొంతకాలం తెలుగు విశ్వవిద్యాలయంలో ప్రాజెక్ట్ అసిస్టెంటుగా పనిచేసి 1991లో హైదరాబాదులోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో అధ్యాపకురాలిగా చేరింది. 2012లో అదే తెలుగు విభాగానికి అధిపతియై ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నది. ఈమె పర్యవేక్షణలో 34 పరిశోధకులకు ఎం.పిల్ పట్టాలు, 10 మంది విద్యార్థులకు డాక్టరేటు పట్టాలు లభించాయి[2]. ఈమె ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యురాలిగా కూడా పనిచేసింది.

సాహిత్యసేవ[మార్చు]

ఈమె జ్యోత్స్న కళాపీఠం అనే సంస్థను ఏర్పాటు చేసి దానికి వ్యవస్థాపక కార్యదర్శిగా పనిచేస్తున్నది. తన తల్లి పేరుమీద సుగుణమణి లిటరరీ అవార్డులను, హాస్యనటులకు జంద్యాల మెమొరియల్ అవార్డును ప్రతియేటా ప్రదానం చేస్తున్నది. కథాకేళి పేరుతో 50 మంది కథకుల సంకలనాన్ని ప్రచురించింది. ఈమె పుస్తకాలు వలస కోకిల ఆంగ్లంలోను, కవనమందాకిని హిందీలోను అనువదించబడ్డాయి. ఈమె 22 పుస్తకాలను వెలువరించింది. ఈమె రచనలపై తెలుగు విశ్వవిద్యాలయంలోను, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోను పరిశోధనలు జరిగాయి.

రచనలు[మార్చు]

 • ఎల్లోరా రచనలు సమగ్ర పరిశీలన
 • డా.జ్ఞానానందకవి జీవితం వాజ్మయసూచి
 • సాహితీ సౌరభం (వ్యాస సంపుటి)
 • కొత్త పాట (కవితా సంపుటి)
 • సాహితీమూర్తుల ప్రశస్తి
 • నీకూ నాకూ నడుమ (కథల సంపుటి)
 • కవనమందాకిని (కవితా సంపుటి)
 • రంగారెడ్డి, హైదరాబాదు జిల్లా బతుకమ్మ పాటలు - సామాజికాంశాలు పరిశీలన
 • వ్యాస జ్యోత్స్న (వ్యాస సంపుటి)
 • స్వాతంత్ర్ర్యానంతర తెలుగు కవిత - వస్తువు, రూపం, శిల్పం
 • వెండి కిరీటం (కథల సంపుటి)
 • అక్షర వసంతం (కవితా సంపుటి)
 • వలస కోకిల

పురస్కారాలు[మార్చు]

 • 2001లో ఈమె రచన "స్వాతంత్ర్యానంతర కవిత్వం - వస్తువు, రూపం, శిల్పం"కు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఉత్తమ గ్రంథ పురస్కారం.
 • 2001లో ఆంధ్రప్రదేశ్ ఫిలిమ్‌ సర్కిల్ వారి ఉగాది పురస్కారం.
 • 2002లో వేదుల గోపాలకృష్ణ స్మారక సాహితీ అవార్డు.
 • 2002లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చే ఉగాది పురస్కారం.
 • 2004లో సులభ సాహితీ అకాడమీ అవార్డు.
 • 2005లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఉత్తమ రచయిత్రి పురస్కారం.
 • 2005లో రాగఝరి సాహితీ అవార్డు.
 • 2006లో యద్దనపూడి మహాలక్ష్మి సాహితీ అవార్డు.
 • 2007లో నండూరి ఆనందమ్మ సాహితీ అవార్డు.
 • 2013లో శ్రీలంకలో సంఘమిత్ర అవార్డు.

బిరుదులు[మార్చు]

 • సాహితీ యువరత్న
 • భారత భాషా భూషణ్

మూలాలు[మార్చు]

 1. నవ్య, డెస్క్ (28 November 2015). "తెలుగుతోనే ఎదిగాను ఎస్.శరత్ జ్యోత్స్నారాణి". ఆంధ్రజ్యోతి. Retrieved 28 March 2017.
 2. హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం వారి వెబ్‌సైటులో శరత్ జ్యోత్స్నారాణి ప్రొఫైల్[permanent dead link]