Jump to content

శాంతి భూషణ్

వికీపీడియా నుండి
శాంతి భూషణ్
శాంతి భూషణ్


కేంద్ర న్యాయశాఖ మంత్రి
పదవీ కాలం
1977–1979

వ్యక్తిగత వివరాలు

జననం (1925-11-11)1925 నవంబరు 11
బిజ్నౌర్,ఉత్తర్ ప్రదేశ్, భారతదేశం [1]
మరణం 2023 జనవరి 31(2023-01-31) (వయసు 97)
ఢిల్లీ, భారతదేశం
జాతీయత  భారతీయుడు
సంతానం ప్రశాంత్ భూషణ్, సహా 4
నివాసం నోయిడా, ఉత్తర్ ప్రదేశ్[2]
పూర్వ విద్యార్థి ఈవింగ్ క్రిస్టియన్ కాలేజీ, అలాహాబాద్, ఉత్తర్ ప్రదేశ్

శాంతి భూషణ్‌ (11 నవంబర్ 1925 – 31 జనవరి 2023) భారతదేశానికి చెందిన న్యాయవాది, రాజకీయ నాయకుడు. ఆయన 1977 నుండి 79 వరకు ప్రధాని మొరార్జీ దేశాయ్‌ మంత్రివర్గంలో కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పని చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

శాంతి భూషణ్ సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా పని చేస్తూ కాంగ్రెస్ (ఓ) పార్టీలో పని చేసి, ఆ తర్వాత జనతా పార్టీలో చేరాడు. ఆయన 1974లో ప్రధాని ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా అలహాబాద్‌ హైకోర్టులో వాదనలు వినిపించిన ఆయన ఇందిరా గాంధీ ప్రధానిగా తొలగింపునకు కారణమై, న్యాయవాదిగా వార్తల్లో ప్రముఖంగా నిలిచాడు. శాంతి భూషణ్1977 నుండి 1980 వరకు రాజ్యసభ సభ్యుడిగా పని చేసి మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో 1977 నుండి1979 వరకు కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పని చేశాడు.

శాంతి భూషణ్ 1980లో ‘సెంటర్‌ ఫర్‌ పబ్లిక్‌ ఇంట్రస్ట్‌ లిటిగేషన్‌’ స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఈ సంస్థ ద్వారా సుప్రీంకోర్టులో వివిధ అంశాలపై ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను దాఖలు చేసి అవినీతికి వ్యతిరేకంగా అనేక కేసులు వాదించాడు. ఆయన 1980లో బీజేపీలో చేరగా 1986లో తన నిర్ణయానికి వ్యతిరేకంగా బీజేపీ వ్యవహరించినందుకుగాను ఆ పార్టీకి రాజీనామా చేశాడు. శాంతి భూషణ్ 2012 నవంబర్‌లో ‘ఆమ్‌ ఆద్మీ పార్టీ’ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. Bhushan, Shanti (2008). Courting Destiny : A Memoir (in English). Penguin Books Limited. p. 9. ISBN 9789385990533.{{cite book}}: CS1 maint: unrecognized language (link)
  2. Krishnan, Murali. "The Namesake: Shanti Bhushan meets Shanti Bhushan". Bar and Bench - Indian Legal news (in ఇంగ్లీష్). Retrieved 17 October 2020.
  3. Namasthe Telangana, NT News (31 January 2023). "కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి శాంతి భూషణ్‌ కన్నుమూత". Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.