Jump to content

శారదా సిన్హా

వికీపీడియా నుండి
శారదా సిన్హా
జననం(1952-10-01)1952 అక్టోబరు 1
హులాస్, రాఘోపూర్, సుపాల్ జిల్లా, మిథిలా ప్రాంతం, బీహార్[1]
మరణం2024 నవంబరు 5(2024-11-05) (వయసు: 72)
వృత్తిగాయని
క్రియాశీలక సంవత్సరాలు1980–2024
భాగస్వామి
బ్రజ్‌కిషోర్ సిన్హా
(m. 1970; died 2024)
న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో డాక్టర్ శారదా సిన్హాకు పద్మభూషణ్ అవార్డును ప్రదానం చేస్తున్న భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్

శారదా సిన్హా (1952 అక్టోబరు 1 - 2024 నవంబరు 5) భారతదేశంలోని బీహార్ కు చెందిన ఫోక్ గాయకురాలు. ఆమె బీహార్ లోని మిథిల ప్రాంతానికి చెందిన సుపాల్ జిల్లాలోని రఘోపూర్ లో జన్మించింది.[1] ఆమె మైథిలీ, భోజ్‌పురి, మగాహి భాషలలో పాడుతున్న విశేష గాయని. ఆమె పాడిన "పహెలె పహిల్ హం కయెని చత్" పాట ప్రసిద్ధమైనది. ఆమెకు 2018 భారత రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా పద్మభూషణ్ పురస్కారం లభించింది.[2] [3]

జీవిత విశేషాలు

[మార్చు]

శారదా సిన్హా తన ప్రస్థానాన్ని మైధిలి ఫోక్ పాటలతో ప్రారంభించింది.[1] ఆమె మైథిలీ, భోజ్ పురి, మగాహి భాషలలో పాటలను పాడింది. తాను చేస్తున్న సంగీత కృషికి పద్మశ్రీ పురస్కారాన్ని పొందింది. [4] వసంత ఋతువు శైలిలోని అద్భుత పాటలను ఆమె ప్రయాగలో ప్రయాగ్ సంగీత సమితి నిర్వహించిన బసంత్ మహోత్సవ్ లో పాడింది.[5] ఆ పాటలలో వసంతకాలం ఆగమనం జానపద పాటల ద్వారా వ్యాఖ్యానించబడింది[5]. దుర్గా పూజ పండుగలలో ఆమె తరచూ తన పదర్శనలనిస్తుంది.[6] [7] ఆమె మార్షియస్ ప్రధాని నవీన్ రాంగూలం బీహార్ వచ్చిన సందర్భంలో తన ప్రదర్శననిచ్చింది.[8] [9] 2010లో న్యూఢిల్లీ లో జరిగిన బిహార్ మహోత్సవం లో భాగంగా ప్రగతి మైదానంలో ప్రదర్శననిచ్చింది.[10]

మరణం

[మార్చు]

ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ శారదా సిన్హా 2024 నవంబరు 5న తుదిశ్వాస విడిచింది. ఆమె 2017 నుంచి  మల్టిపుల్‌ మైలోమాతో బాధపడుతున్నది.[11][12] ఆమె భర్త బ్రజ్‌కిషోర్ సిన్హా కూడా ఇదే సంవత్సరంలో కన్నుమూసాడు..[13]

మూలాలు

[మార్చు]
  1. 1 2 3 "Padmashri Sharda Sinha interviewed by Lalit Narayan Jha". Mithila Mirror (Interview).
  2. "Government announces recipients of 2018 Padma awards". The Times of India. 26 January 2018. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 January 2018.
  3. "This Chhath Puja song is making people so nostalgic, they want to go home". The Indian Express. 2016-11-04. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2016-11-28.
  4. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. the original (PDF) నుండి 15 నవంబరు 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 21 July 2015.
  5. 1 2 "of spring narrated through folk songs". The Times of India. 2009-03-22. the original నుండి 2012-10-23 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2009-04-25.
  6. Manisha Prakash (2003-10-04). "Music maestros add to Puja festivities". The Times of India. the original నుండి 2012-10-23 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2009-04-25.
  7. "Puja euphoria reaches a crescendo". The Times of India. 2003-10-04. the original నుండి 2012-10-23 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2009-04-25.
  8. Faizan Ahmad & Dipak Mishra (2008-02-19). "Mauritius scholarship for two". The Times of India. the original నుండి 2012-10-23 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2009-04-25.
  9. "A new brand of music in Gangs Of Wasseypur series". the original నుండి 2013-12-03 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2018-01-29.
  10. "Sharda Sinha's performance at Bihar Utsav an instant hit". The Times of India. 2010-03-28. the original నుండి 2011-08-11 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2010-03-29.
  11. "Renowned Singer Sharda Sinha On Ventilator Support, PM Assures Help". NDTV. 5 November 2024. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 5 November 2024.
  12. भास्कर, ज्योति (5 November 2024). "Sharda Sinha: शारदा सिन्हा का 72 साल की आयु में निधन, दिल्ली के एम्स में ली अंतिम सांस". Amar Ujala (in హిందీ). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 5 November 2024.
  13. Mishra, Pallav; Bose, Saikat Kumar (27 October 2024). "Renowned Singer Sharda Sinha On Life Support. She Lost Husband Weeks Back". NDTV. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 October 2024.