శింఖేపర చెట్టు
Jump to navigation
Jump to search
శింఖేపర చెట్టును శింఖివేపర, చిటిక వేప అని కూడా అంటారు. ఆంధ్రప్రదేశ్‍లోని అన్ని ప్రాంతాలలో ఈ చెట్లు విరివిగా పెరుగుతాయి. ఈ చెట్టు దాదాపు 40 అడుగుల ఎత్తు పెరుగుతుంది.
పచ్చిరొట్ట
[మార్చు]నారుమడులలో విత్తనాలు చల్లే ముందు, నారు నాటే ముందు ఈ చెట్ల చిన్న చిన్న కొమ్మలను, ఆకులను కోసి భూమిలోకి తొక్కుతారు. ఈ చెట్టు ఆకు వేసి పెంచిన నారు ఏపుగా పెరుగుతుంది, పంట బాగా వస్తుంది.
ప్రత్యుత్పత్తి
[మార్చు]ఈ చెట్టు కొమ్మను నాటితే బతుకుతుంది.
కాళ్ల నొప్పులు తగ్గుతాయి
[మార్చు]ఈ చెట్ల ఆకులను తాలింపు చేసుకొని తినటం ద్వారా, లేదా ఆకును వేడి చేసి కాపటం పట్టడం ద్వారా కాళ్ళ వాపు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి.
మలబద్ధకానికి విరుగుడు
[మార్చు]ఈ చెట్టు ఆకులను తాలింపు చేసుకొని తినటం ద్వారా విరోచనాలవుతాయి.
ఈ వ్యాసం వృక్షశాస్త్రానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |