Jump to content

శిమ్మ ప్రభాకరరావు

వికీపీడియా నుండి
శిమ్మ ప్రభాకరరావు

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1983 - 1989
ముందు డోల సీతారాములు
తరువాత ధర్మాన ప్రసాదరావు
నియోజకవర్గం నరసన్నపేట నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ జనతా పార్టీ
తల్లిదండ్రులు శిమ్మ జగన్నాధం

శిమ్మ ప్రభాకరరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నరసన్నపేట నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

శిమ్మ ప్రభాకరరావు 1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నరసన్నపేట నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత తెలుగుదేశం పార్టీలో చేరి 1985లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి వరుసగా రెండుసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. శిమ్మ ప్రభాకరరావు 1989లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (21 April 2014). "నరసన్నపేట... నాలుగు స్తంభాలాట". Archived from the original on 21 May 2022. Retrieved 21 May 2022.
  2. Sakshi (2019). "నరసన్నపేట నియోజకవర్గం ముఖచిత్రం". Archived from the original on 11 December 2021. Retrieved 11 December 2021.