శిరీష్ పాయ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శిరీష్ పాయ్ (शिरीष पै) (1929 నవంబరు 15 [1] – 2017 సెప్టెంబరు 2) మరాఠీ సామాజిక కార్యకర్త, రచయిత్రి. ఆమె ఓషో శిష్యురాలు.[2]

జననం, విద్యాభ్యాసం

[మార్చు]

శిరీష్ ఆచార్య ఆత్రే పెద్ద కుమార్తె. ఇంట్లో చిన్న వయసులోనే అభ్యుదయ, సామ్యవాదం భావజాలంతో ఆమె బాగా ప్రభావితమయ్యారు.[3] ఆమె తొమ్మిది సంవత్సరాల వయస్సులో కథలు రాయడం ప్రారంభించింది.[4] ప్రభుత్వ న్యాయ కళాశాల నుండి న్యాయశాస్త్రం పూర్తి చేశారు.[2] శిరీష్ సోవియట్ యూనియన్, తూర్పు ఐరోపా దేశాలను సందర్శించారు. ఆమె సమైక్య మహారాష్ట్ర ఉద్యమంలో చేరారు.[3] ఆమె పిల్లల పుస్తకాలు, నాటకాలు, కథలు, కవితలు కుాడా రాశారు.

పాత్రికేయురాలిగా

[మార్చు]

ఆమె తన తండ్రి వార్తాపత్రిక మరాఠాలో పాత్రికేయురాలిగా చేరింది. 1953లో నవాయుగ్ సంపాదకీయ విభాగంలొ పనిచేయడం ప్రారంభించారు. 1962లో ఆమె మరాఠా యొక్క ఆదివారం ప్రత్యేక సంచికను పర్యవేక్షించడం ప్రారంభించింది, తర్వాత మరాఠా వార్తాపత్రిక ప్రధాన సంపాదకురాలు అయింది. 1969 జూన్ నుండి 1976 నవంబరు వరకు ఆమె దైనిక్ పత్రికకు ముఖ్య సంపాదకురాలుగా ఉన్నారు. ఆమె మహారాష్ట్ర టైమ్స్ (సై (सय्)), నవశక్తి (ఖైచ్య గోష్తి (खायच्या गोष्टी)), చిత్రలేఖ (మార్ంబంద్ (मर्मन्ध्)) పత్రికలకు వ్యాసకర్త గా పనిచేశారు.[4]

ఆమె కొత్త ప్రతిభావంతులను ప్రోత్సహించింది. విజయ్ టెండూల్కర్, సురేష్ భట్, సిటి ఖనోల్కర్ వంటి ప్రతిభగల వ్యక్తులకు ప్రారంభ మద్దతును అందించింది‌.[5]

హైకూ రచయిత్రిగ

[మార్చు]

విజయ్ టెండూల్కర్ శిరీష్ కు ఇంగ్లిష్ హైకూ పుస్తకాన్ని ఇచ్చింది. ఆమె దాన్ని చాలాసార్లు చదివి, ఆ తర్వాత మరాఠీ హైకూ 1975 నుండి రాయడం ప్రారంభించింది.[6][7][8] ఆమె జపనీస్ హైకూ, దాని మూలం, స్వభావాన్ని అధ్యయనం చేసి ఐదు మరాఠీ హైకూ పుస్తకాలను ప్రచురించింది.[9]

1978లో ఆమె రచించిన హైకూ మరాఠీ సాహిత్య పత్రిక రిచా ప్రత్యేక సంచికలో వివరణాత్మక వివరణతో పాటు ప్రచురించబడింది. 1981 జూలై 5న శిరీష్ సహా పలువురు మరాఠీ రచయితల 17 జపనీస్ హైకూ అనువాదాలతో లోక్‌సత్తా ప్రత్యేక సంచికను ప్రచురించింది.[8][10][11] ఆమె రాసిన హైకూ కవితల సంపుటి ధృవ (ध्रुवा).[11] ఆమె ఇతర హైకూ కవుల పుస్తకాలకు ముందుమాటలలో హైకూ రూపురేఖలు వ్రాసింది.[8] మరాఠీ సాహిత్యంలో హైకూ ఉద్యమానికి పూర్వగామిగ ఆమె నిలిచిపోయింది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

శిరీష్ న్యాయవాది, పాత్రికేయుడు వ్యంకటేష్ పైని వివాహం చేసుకున్నది. వారికి ఇద్దరు కుమారులు, రాజేంద్ర పాయ్, విక్రమాదిత్య పాయ్ [2], ఇద్దరూ న్యాయవాదులు. 2017 సెప్టెంబరు 2న ముంబైలో మరణించింది.[12]

పురస్కారాలు

[మార్చు]
 • 2013: ప్రభత్ ఫిల్మ్ కంపెనీ ప్రత్యేక పురస్కారం (Prabhat Film Company Special Award) [13]
 • 2014: విద్యాధర్ గోఖలే: లలిత రచన (विद्याधर गोखले: ललित लेखन) [14]
 • 2017: 'ఏకా పవ్సాస్లయాత్' (एका पावसाळ्यात) కవితా సంపుటకి మహారాష్ట్ర ప్రభుత్వ 'కేశవసుత్' (केशवसुत) పురస్కరాము, 'హైకూ' (हायकू) కవితా సంపుటకి మహారాష్ట్ర సాహిత్య పరిషత్ పురస్కరాము.[15]
 • 2021: జుజే పీదాడే క్వాడ్రోస్ స్మారక కార్యకర్త అవార్డు (Juje Piedade Quadros memorial activist award) [16]

మూలాలు

[మార్చు]
 1. "लेखिका आणि सामाजिक कार्यकर्त्या शिरीष पै यांचे निधन". Loksatta (in మరాఠీ). 2017-09-02. Retrieved 2024-01-24.
 2. 2.0 2.1 2.2 "Marathi poet Shirish Pai passes away". Mumbai Mirror (in ఇంగ్లీష్). Retrieved 2024-01-24.
 3. 3.0 3.1 "Poet and writer Shirish Pai dies". DNA India (in ఇంగ్లీష్). Retrieved 2024-01-25.
 4. 4.0 4.1 "Shirish Vyankatesh Pai". map.sahapedia.org (in ఇంగ్లీష్). Retrieved 2024-01-24.
 5. "Shirish Pai, noted Marathi poet, passes away at 88". The Times of India. 2017-09-03. ISSN 0971-8257. Retrieved 2024-01-25.
 6. "Shirish Pai - An Introduction". www.boloji.com (in ఇంగ్లీష్). Retrieved 2024-01-26.
 7. "Poet, activist Shirish Pai, who introduced haiku in Marathi, dies at 88". The New Indian Express (in ఇంగ్లీష్). 2017-09-02. Retrieved 2024-01-26.
 8. 8.0 8.1 8.2 Puja, Malushte (ed.). "A History Of Indian Haiku" (PDF). thehaikufoundation (in ఇంగ్లీష్). p. 14. Archived (PDF) from the original on 2015-10-10. Retrieved 2024-01-26.
 9. "Marathi poet, activist Shirish Pai passes away". The Asian Age (in ఇంగ్లీష్). 2017-09-03. Retrieved 2024-01-25.
 10. Pravat Kumar, Padhy. "Haiku: The Shortest Poetic Form and Its Development in India" (PDF). thehaikufoundation (in ఇంగ్లీష్). p. 11. Archived (PDF) from the original on 2022-08-09. Retrieved 2024-01-26.
 11. 11.0 11.1 Verma, Satya Bhushan (1992-01-01). "Haiku in India". Nichibunken Japan review : bulletin of the International Research Center for Japanese Studies (in ఇంగ్లీష్). 3: 15–24. doi:10.15055/00000388. Retrieved 2024-01-26.
 12. "Marathi poet, activist Shirish Pai passes away". The Asian Age (in ఇంగ్లీష్). 2017-09-03. Retrieved 2024-01-24.
 13. "Dhag wins big at inaugural Prabhat awards". The Indian Express (in ఇంగ్లీష్). 2013-06-03. Retrieved 2024-01-26.
 14. "पत्रकार संघाचे पुरस्कार जाहीर". Maharashtra Times (in మరాఠీ). Retrieved 2024-01-26.
 15. सकाळवृत्तसेवा (2017-09-02). "शिरीष पै यांचे मुंबईत निधन". सकाळ (in మరాఠీ). Retrieved 2024-01-26.
 16. Desk, G. T. (2021-09-21). "Konkani Bhasha Mandal announces 2021 awards". Gomantak Times (in ఇంగ్లీష్). Retrieved 2024-01-26.