వేదిక:శిలాజ ఇంధనం

వికీపీడియా నుండి
(శిలాజ ఇంధనాలు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
బొగ్గు, శిలాజ ఇంధనాలలో ఒకటి

శిలాజ ఇంధనం అనగా పురాతన వృక్షాల, జీవుల సమూహం చాలా కాలం కుళ్ళగా ఏర్పడిన ఇంధనం. బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు అనేవి మూడు ముఖ్యమైన శిలాజ ఇంధనాలు. చమురు, వాయువు అనేవి హైడ్రోకార్బన్లు (వీటిలో హైడ్రోజన్, కార్బన్ అణువులు మాత్రమే ఉంటాయి). బొగ్గు అనేది ఎక్కువగా కార్బన్. ఈ ఇంధనాలను భూగర్భం నుండి తవ్వితీసినందున శిలాజ ఇంధనాలు అని పిలుస్తారు. బొగ్గు గనులు త్రవ్వి ఘన ఇంధనాన్ని తీస్తారు, గ్యాస్, చమురు బావుల నుండి ద్రవ ఇంధనాన్ని తీస్తారు. మధ్య యుగం వరకు శిలాజ ఇంధనం ఎక్కువగా ఉపయోగించబడలేదు. పారిశ్రామిక విప్లవంతో బొగ్గు ప్రధాన రకమైన ఇంధనంగా మారింది.

ఉపయోగాలు

[మార్చు]

ప్రజలు కాల్చే ఇంధనాలలో ఎక్కువ భాగం శిలాజ ఇంధనాలు. విద్యుత్తును తయారు చేయడంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. విద్యుత్ ప్లాంట్లలో శిలాజ ఇంధనాలు, సాధారణంగా బొగ్గు, నీటిని వేడి చేసి ఆవిరిలోకి మార్చడానికి కాల్చబడుతుంది, ఆవిరైన నీరు టర్బైన్ అని పిలువబడే ఫ్యాన్ లాంటి వస్తువును నెట్టివేస్తుంది. అలా టర్బైన్ చుట్టూ తిరుగుతున్నప్పుడు, టర్బైన్ లోపల అయస్కాంతాలు విద్యుత్తును తయారు చేస్తాయి. ముడి చమురును వేరుచేసి ఎల్‌పిజి, గ్యాసోలిన్, కిరోసిన్, జెట్ ఇంధనం, డీజిల్ ఇంధనం వంటి వివిధ ఇంధనాలను తయారు చేయవచ్చు. ఈ పదార్థాలు చమురు శుద్ధి కర్మాగారంలో పాక్షిక స్వేదనం ద్వారా తయారవుతాయి. రవాణాలో ఇవి ప్రధాన ఇంధనాలు. అంటే మోటార్ బైక్‌లు, కార్లు, ట్రక్కులు, ఓడలు, విమానాలు, రైళ్లు, అంతరిక్ష నౌకలు వంటి మోటారు వాహనాలను తరలించడానికి అవి దహనమవుతాయి. శిలాజ ఇంధనాల ద్వారానే నేడు ఎక్కువ రవాణా జరుగుతుంది, ఇవి లేకుండా, ఎక్కువ రవాణా జరగదు. ప్రజలు తమ ఇళ్లలో వేడి చేయడానికి శిలాజ ఇంధనాలను కూడా మంట కొరకు ఉపయోగిస్తారు. వంటలు చేయడానికి కట్టెలు ఉపయోగించవచ్చు, కాని వంట పాత్రలు మసిబారతాయి, అందువలన చాలా ఇళ్లలో, ప్రజలు సహజ వాయువును వంట కోసం గ్యాస్ స్టవ్‌ ద్వారా ఉపయోగిస్తున్నారు. శిలాజ ఇంధనాలను తారు రోడ్డు నిర్మాణంలో విస్తృతంగా ఉపయోగిస్తారు.