శివరాజు సుబ్బలక్ష్మి
స్వరూపం
శివరాజు సుబ్బలక్ష్మి | |
|---|---|
శివరాజు సుబ్బలక్ష్మి గారి చిత్రపటం | |
| జననం | ద్రోణంరాజు సుబ్బలక్ష్మి 17 సెప్టెంబరు 1925 |
| మరణం | 6 ఫిబ్రవరి 2021 |
| వృత్తి | రచయిత్రి |
| భాగస్వామి | బుచ్చిబాబు |
| తల్లిదండ్రులు |
|
ప్రముఖ రచయిత్రి, చిత్రకారిణి శివరాజు సుబ్బలక్ష్మి జననం సెప్టెంబరు 17, 1925. ద్రోణంరాజు సూర్యప్రకాశరావు, సత్యవతి దంపతులకు రెండవపుత్రిక. అమెకు ముగ్గురన్నదమ్ములూ, ముగ్గురప్పచెల్లెళ్ళు. తండ్రివద్ద కావ్యాలు చదువుకున్నారు. తమ పన్నెండవ యేట ప్రముఖ కవి, రచయిత బుచ్చిబాబు (శివరావు వెంకట సుబ్బారావు)తో వివాహమయింది. సుబ్బలక్ష్మి గారి తమ్ముడు కొడుకుని పెంచుకున్నారు. ప్రస్తుతం బెంగుళూరులో ఉంటున్నారు. ఆమె రచనలకీ, చిత్రలేఖనకీ భర్త బుచ్చిబాబు స్ఫూర్తినిచ్చేరు అన్నారు. ఈమెకథలు అనేక సంకలనాలలో వెలువడ్డాయి.
నవలలు
[మార్చు]- అదృష్టరేఖ
- నీలంగేటు అయ్యగారు
- తీర్పు (తరుణ మాసపత్రికలో సీరియలుగా ప్రచురణ అయింది.)
కథాసంకలనాలు
[మార్చు]- [కావ్యసుందరి కథ]
- [ఒడ్డుకు చేరిన కెరటం]
- [మనోవ్యాధికి మందుంది]
- [మగతజీవి చివరిచూపు]
- [శివరాజు సుబ్బలక్ష్మి కథలు]
పురస్కారాలు
[మార్చు]- గృహలక్ష్మి స్వర్ణకంకణం.
- ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం.
- ప్రతిభా పురస్కారం - తెలుగు విశ్వవిద్యాలయం, 2013[1][2]
రిఫెరెన్సులు
[మార్చు]- శివరాజు సుబ్బలక్ష్మిని గురించి ఒక వ్యాసం. Archived 2013-09-14 at the Wayback Machine
- శివరాజు సుబ్బలక్ష్మిగురించి పి.సత్యవతి వ్యాసం.
ఇతర లింకులు
[మార్చు]- Sivaraju Subbalakshmi, (review) by Nidadavolu Malathi. Archived 2013-09-14 at the Wayback Machine
మూలాలు
[మార్చు]- ↑ తెలుగు విశ్వవిద్యాలయం, పురస్కారాలు. "ప్రతిభా పురస్కారాలు" (PDF). www.teluguuniversity.ac.in. Archived from the original (PDF) on 9 సెప్టెంబరు 2017. Retrieved 7 జూన్ 2020.
- ↑ సాక్షి, హైదరాబాదు (18 December 2013). "తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారాలు". Sakshi. Archived from the original on 20 September 2021. Retrieved 20 September 2021.