శివాలా తేజ్ సింగ్ దేవాలయం (పాకిస్థాన్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శివాల తేజ సింగ్ ఆలయం
شیوالا تیجا سنگھ مندر
పునర్నిర్మాణం తర్వాత షావాలా తేజ సింగ్ ఆలయం
పునర్నిర్మాణం తర్వాత షావాలా తేజ సింగ్ ఆలయం
భౌగోళికం
దేశంపాకిస్థాన్ పాకిస్తాన్
రాష్ట్రంపంజాబ్ ప్రావిన్స్
జిల్లాశియల్ కోట్
సంస్కృతి
దైవంశివుడు
వాస్తుశైలి
దేవాలయాల సంఖ్య1
చరిత్ర, నిర్వహణ
సృష్టికర్తసర్దార్ తేజ సింగ్
నిర్వహకులు/ధర్మకర్తపాకిస్థాన్ హిందూ కౌన్సిల్
వెబ్‌సైట్https://pakistanhinducouncil.org.pk/

శివాల తేజ సింగ్ దేవాలయం పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌ లో గల సియాల్‌కోట్ నగరంలో ఉన్న ఒక చారిత్రాత్మక హిందూ దేవాలయం. ఈ ఆలయం శివునికి అంకితం చేయబడింది. ఈ ఆలయాన్ని తేజా సింగ్ నిర్మించాడు.[1][2][3]

చరిత్ర[మార్చు]

ఈ ఆలయాన్ని సర్దార్ తేజా సింగ్ నిర్మించాడు. 1947లో విభజన సమయంలో ఆలయానికి సీలు వేశారు. 1992లో, ఈ ఆలయాన్ని దుండగులు పాక్షికంగా కూల్చివేశారు. 2015లో, స్థానిక హిందూ నాయకులు షావాలా తేజా సింగ్ ఆలయ శిథిలమైన భవనాన్ని త్వరగా మరమ్మతులు చేయాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరారు.

పునఃప్రారంభం, పునర్నిర్మాణం[మార్చు]

72 సంవత్సరాల తర్వాత, ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్, హిందువులకు ఆలయాన్ని తిరిగి తెరిచాడు. పాకిస్తాన్ ప్రభుత్వం ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డ్ (ETPB) లాహోర్‌కు చెందిన సర్ గంగా రామ్ హెరిటేజ్ ఫౌండేషన్ సహాయంతో ఆలయ పునరుద్ధరణ, సంరక్షణ కోసం ఒక ప్రణాళికను రూపొందించింది.

2019లో, పాకిస్తాన్ ప్రభుత్వం శతాబ్దాల నాటి శవాలా తేజ సింగ్ ఆలయాన్ని పునరుద్ధరించింది, అధికారికంగా యాత్రికుల సందర్శనలు, ఇతర ఆచారాలను సులభతరం చేయడానికి పాకిస్తాన్ హిందూ కౌన్సిల్‌కు అప్పగించింది.[4]

మూలాలు[మార్చు]

  1. "Ancient Hindu temple in Pakistan's Sialkot reopens after 72 years". The New Indian Express. ANI. 3 July 2019. Retrieved 1 September 2020.
  2. Rana, Yudhvir (4 July 2019). "Pakistan opens heritage temple to devotees; to undertake renovation". The Times of India. Retrieved 12 November 2020.
  3. "Ancient Hindu temple in Pakistan's Sialkot re-opens after 72 years; Shawala Teja Singh was shut down during Partition". Retrieved 29 October 2020.
  4. "Pakistan govt renovates centuries-old Shawala Teja Singh temple in Sialkot". Retrieved 2 April 2021.