శీలం జేసుదాస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శీలం జేసుదాస్
శీలం జేసుదాస్


పదవీ కాలం
2009- 2014

వ్యక్తిగత వివరాలు

జననం (1953-08-13) 1953 ఆగస్టు 13 (వయసు 70)
భారతదేశం పుసులూరు గ్రామం, పెదనందిపాడు మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
రాజకీయ పార్టీ కాంగ్రెస్
సంతానం ఇద్దరు
నివాసం హైదరాబాదు, ఢిల్లీ
మతం క్రిస్టియన్

జే.డీ.శీలం రాజ్యసభ సభ్యుడు.కేంద్ర మంత్రి.దళిత క్రిస్టియన్.పెదనందిపాడు మండలం, పుసులూరు గ్రామంలో 1953 ఆగస్టు 13న అబ్రహాం శీలం, అన్నపూర్ణమ్మ దంపతులకు జన్మించారు. గుంటూరు ఏసీ కళాశాలలో బీఎస్సీ. విశాఖ ఆంధ్రాయూనివర్శిటీలో ఎంఎస్సీ ( కెమిస్ట్రీ) పూర్తిచేశారు. కర్ణాటక క్యాడర్‌లో ఐఏఎస్ అధికారిగా పనిచేస్తూ రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. 1999 లోక్‌సభ ఎన్నికల్లో బాపట్ల నుంచి పోటీచేసి ఓటమి చవిచూశారు. కర్ణాటక ముఖ్యమంత్రి ఎస్.ఎం.కృష్ణకు రాజకీయ కార్యదర్శిగా పనిచేశారు.