అక్షాంశ రేఖాంశాలు: 13°25′05″N 75°15′07″E / 13.418°N 75.252°E / 13.418; 75.252

శృంగేరి శారదాంబ దేవాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శృంగేరి శారదాంబ దేవాలయం
భౌగోళికాంశాలు:13°25′05″N 75°15′07″E / 13.418°N 75.252°E / 13.418; 75.252
పేరు
స్థానిక పేరు:శృంగేరి శారదాంబ దేవాలయం
స్థానం
దేశం:భారత దేశము
రాష్ట్రం:కర్ణాటక
ప్రదేశం:శృంగేరి
నిర్మాణశైలి, సంస్కృతి
ప్రధానదైవం:శారద (సరస్వతి)
నిర్మాణ శైలి:దక్షిణ భారత దేశము, కోవిల్

శృంగేరి శారదాంబ దేవాలయం (ಶೃಂಗೇರಿ ಶಾರದಾಂಬೆ) భారత దేశము లోని కర్ణాటక రాష్ట్రంలోని శృంగేరిలో గల ప్రసిద్ధ హిందూ దేవాలయం. ఇక్కడి ప్రధాన దైవం శారదాంబ. ఈ శారదాంబ దేవాలయం శృంగేరి (సంస్కృతంలో శృంగ గరి) వద్ద సా.శ. 8 వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు చే స్థాపించబడింది. ఈ దేవాలయంలో గంధపు చెక్కతో శారదాంబ విగ్రహం నిలబడే భంగిమలో ఉంటుంది. ఆదిశంకరాచార్యులచే స్థాపింపబడిన ఈ విగ్రహం విజయనగరం రాజుల అధీనంలో ఉండే వరకు ఉండేది. 14 వ శతాబ్దంలో శ్రీ విద్యారణ్యుడు (12వ జగద్గురు) బంగారు విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు.

శృంగేరి శారద సుప్రభాతం

[మార్చు]

జగద్గురు శ్రీ అభినవ విద్యాతీర్థ స్వామీనీ చే శృంగేరి శారద సుప్రభాతం 1970లో శృంగేరి మఠం స్వీకరించింది. ఈ ప్రసిద్ధ శృఈ శారదా సుప్రభాతం శృంగేరి శారదా మఠానికి చెందిన వేదబ్రహ్మ తురువెకెరె సుబ్రహ్మణ్య విశ్వేశ్వర దీక్షితులు (శ్రీ టి.ఎస్.విశ్వేశ్వర దీక్షుతులు) చే రూపొందించబడింది.

వేదబ్రహ్మ శ్రీ టి.ఎస్.విశ్వేశ్వర దీక్షుతులు తుమ్‌కూర్ జిల్లాలోని తురువెకెరె అనే చిన్న పట్టణంలో జన్మించారు. ఆయన మైసూర్ రాజ్యం లోని మహారాజా కళాశాలలో ప్రొఫెసర్ గా పనిచేసేవారు. మైసూరులో నివాసముండేవారు. ఆయన జయచామరాజ వొడెయార్ బహదూర్ రాజు రాజ్యంలో అలంకార శాస్త్రంలో అస్థాన విద్వాంసులుగా ఉండేవారు. దీక్షుతులు సంస్కృతాన్ని అభ్యసించారు. ఆయన వేదాలలో విద్వాంసుడు. ముఖ్యంగా యజుర్వేదాన్ని ఔపాసన పట్టారు. ఆయన నంజగుడ్ లోని శ్రీకంఠేశ్వరుడు, మైసూర్ లోని శ్రీ చంద్రమౌళేశ్వరుని దేవాలయాలకు "శ్రీ శ్రీకంఠేశ్వర సుప్రభాతం", "శ్రీ చంద్రమౌళేశ్వర సుప్రభాతం" లను రూపొందించారు.

ఆయన "అలంకార శాస్త్రం", "జ్యోతిష శాస్త్రము", "తర్కము", "వ్యాకరణం" వంటి శాస్త్రాలలో ఘనాపాటి.ఆయన అనేక అవార్డులను అందుకున్నారు.

మూలాలు

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.