శ్యాంచి ఆయ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్యాంచి ఆయ్
శ్యాంచి ఆయ్ డివిడి కవర్
దర్శకత్వంప్రహ్లాద్ కేశవ్ ఆత్రే
రచనఆచార్య ఆత్రే
స్క్రీన్ ప్లేఆచార్య ఆత్రే
కథసానే గురూజీ
దీనిపై ఆధారితంసానే గురూజీ రాసిన శ్యాంచి ఆయ్
నిర్మాతఆచార్య ఆత్రే
తారాగణందమువన్నా జోషి
వనమాల
మాధవ్ వాజ్
ఛాయాగ్రహణంసియం రేలే
కూర్పునారాయణ్ రావు
సంగీతంవసంత్ దేశాయ్
నిర్మాణ
సంస్థ
ఆత్రే పిక్చర్స్
విడుదల తేదీ
1953
సినిమా నిడివి
152 నిముషాలు
దేశంభారతదేశం
భాషమరాఠీ

శ్యాంచి ఆయ్, 1953లో విడుదలైన మరాఠీ సినిమా. మరాఠీలో సానే గురూజీ రాసిన శ్యాంచి ఆయ్ పుస్తకం ఆధారంగా ఇది రూపొందించబడిన ఈ సినిమాకు ప్రహ్లాద్ కేశవ్ ఆత్రే దర్శకత్వం వహించాడు. ఇందులో దమువన్నా జోషి, వనమాల, మాధవ్ వాజ్ తదితరులు నటించారు.[1] 1954లో జరిగిన మొదటి జాతీయ చలన చిత్ర అవార్డులలో ఈ సినిమాకు ఉత్తమ చిత్రంగా గోల్డెన్ లోటస్ అవార్డు వచ్చింది. జాతీయ ఉత్తమ చిత్రంగా గోల్డెన్ లోటస్ అవార్డు (స్వర్ణ కమలం) గెలుచుకున్న మొదటి సినిమా ఇది.[2]

కథా సారాంశం

[మార్చు]

శ్యామ్ అనే అబ్బాయి, అతని తల్లి చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఇందులో శ్యామ్ తల్లి శ్యామ్ ని పెంచే విధానం గురించి చూపబడింది. రచయిత సానే గురూజీ రాసిన శ్యాంచి ఆయ్ నవల విడుదలైన తరువాత ప్రశంసలు అందుకుంది. శ్యామ్ తల్లి అనారోగ్యం, మరణంతో ఈ చిత్రం ముగుస్తుంది.

నటవర్గం

[మార్చు]
 • దామువన్నా జోషి
 • వనమాల
 • మాధవ్ వాజ్
 • అరవింద్ రిలే
 • శంకర్ కులకర్ణి
 • ఉమేష్
 • బాబూరావ్ పెంధార్కర్
 • సుమతి గుప్తే
 • సరస్వతి బోడాస్
 • వసంత బాపట్
 • ప్రబోధంకర్ ఠాక్రే
 • నాగేష్ జోషి
 • బాపురావ్ మానే
 • పాండురాంగ్ జోషి
 • విమల్ గంద్రాస్
 • బాబా ఫటక్
 • అరవింద్ రిలే
 • అశోక్ భట్

ఇతర సాంకేతికవర్గం

[మార్చు]
 • అసిస్టెంట్ డైరెక్టర్: దమువన్నా జోషి, సీతాకాంత్ చవాన్
 • సౌండ్ రికార్డింగ్: ఎన్. ఎస్. నాయర్
 • అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్: సదానంద్ అజ్గావ్కర్, జహంగీర్ ఒటివాలా
 • ఆర్ట్ డైరెక్టర్: మునవర్ మిస్త్రీ
 • కాస్ట్యూమ్ డిజైన్: దగ్డు పాటిల్
 • సహ సంపాదకుడు: రాజ్ తల్వార్
 • మేకప్: కె. లక్ష్మణారావు, వినాయక్ మోఘే

అవార్డులు

[మార్చు]
1వ జాతీయ చలన చిత్ర పురస్కారాలు (భారతదేశం)

మూలాలు

[మార్చు]
 1. "Shyamchi Aai (1953)". Indiancine.ma. Retrieved 2021-06-10.
 2. 2.0 2.1 "1st National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 10 June 2021.

బయటి లింకులు

[మార్చు]