శ్యామ్ సింగ్ రాణా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్యామ్ సింగ్ రాణా

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
17 అక్టోబర్ 2024
గవర్నరు బండారు దత్తాత్రేయ

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
8 అక్టోబర్ 2024
ముందు బిషన్ లాల్ సైనీ
నియోజకవర్గం రాదౌర్

పదవీ కాలం
2014 – 2019
ముందు బిషన్ లాల్ సైనీ
తరువాత బిషన్ లాల్ సైనీ
నియోజకవర్గం రాదౌర్

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ

శ్యామ్ సింగ్ రాణా (జననం 3 ఆగస్టు 1952) హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రాదౌర్ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై నయాబ్ సింగ్ సైనీ మంత్రివర్గంలో వ్యవసాయ & రైతుల సంక్షేమం, పశు సంవర్ధక & పాడి పరిశ్రమ, మత్స్య సంపద శాఖల మంత్రిగా 17 అక్టోబర్ 2024న భాద్యతలు చేపట్టాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

శ్యామ్ సింగ్ రాణా భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా వివిధ హోదాల్లో పని చేసి తొలిసారి 2009 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి నాల్గొవ స్థానంలో నిలిచి, 2014 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా తన సమీప ప్రత్యర్థి ఐఎన్ఎల్‌డీ అభ్యర్థి రాజ్ కుమార్ బుబ్కాపై 38,707 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికై ప్రధాన పార్లమెంటరీ కార్యదర్శిగా పని చేసి 2020లో రైతుల ఉద్యమం కారణంగా భారతీయ జనతా పార్టీని వీడి ఐఎన్ఎల్‌డీ పార్టీలో చేరాడు.[2]

శ్యామ్ సింగ్ రాణా జూన్ 2024లో ఐఎన్ఎల్‌డీ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరి,[3] 2024 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి బిషన్ లాల్ సైనీపై 13,132 ఓట్ల మెజారిటీతో గెలిచి అక్టోబర్ 17న నయాబ్ సింగ్ సైనీ మంత్రివర్గంలో వ్యవసాయ & రైతుల సంక్షేమం, పశు సంవర్ధక & పాడి పరిశ్రమ, మత్స్య సంపద శాఖల మంత్రిగా 17 అక్టోబర్ 2024న భాద్యతలు చేపట్టాడు.[4][5]

మూలాలు

[మార్చు]
  1. ETV Bharat News (17 October 2024). "श्याम सिंह राणा ने ली मंत्री पद की शपथ, जानें कौन हैं राजपूत समाज के बड़े नेताओं में शुमार". Retrieved 26 October 2024.
  2. The Times of India (17 October 2020). "Haryana BJP leader Shyam Singh Rana, who quit party over new farm laws, joins INLD". Retrieved 26 October 2024.
  3. The Times of India (2 July 2024). "Radaur Rajput leader Shyam Singh Rana set to join BJP after leaving INLD". Retrieved 26 October 2024.
  4. TimelineDaily (8 October 2024). "BJP's Shyam Singh Rana Defeats Incumbent Congress MLA In Radaur" (in ఇంగ్లీష్). Retrieved 26 October 2024.
  5. Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Radaur". Retrieved 26 October 2024.