శ్రద్దా శర్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శ్రద్ధా శర్మ (Shradha Sharma)పత్రికా విలేకరి, భారతదేశంలో స్టార్టప్ లకు అతిపెద్ద మీడియా టెక్నాలజీ ప్లాట్ ఫాం అయిన యువర్ స్టోరీ వ్యవస్థాపకురాలు, ముఖ్య కార్య నిర్వహణాధికారిణి. భారతదేశంలో ఉన్న ఒక మహిళా పారిశ్రామిక వేత్త. ప్రస్తుతం యువర్ స్టోరీ సంస్థ 90 మంది సిబ్బంది, యువ, చిన్న వ్యాపారుల 72,000 కథలను ప్రచురించి, జర్మనీతో సహా ఇతర దేశాలకు విస్తరించుచున్న భారతదేశంలో స్టార్టప్ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల గళంగా యువర్ స్టోరీ తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నది[1].

జీవితం

[మార్చు]

శ్రద్ధా శర్మ బీహార్ రాష్ట్రంలోని పాట్నా నగరంలో జన్మించింది, న్యూ ఢిల్లీ 1997 సంవత్సరంలో వచ్చి, సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి చరిత్రలో బ్యాచిలర్, మాస్టర్స్ డిగ్రీలు పూర్తి చేసింది[2][3].

శ్రద్దా శర్మ
జననం
పాట్నా, బీహార్, భారతదేశం
పౌరసత్వంభారతీయత
విద్యఎం.ఏ (చరిత్ర)
విద్యాసంస్థసెయింట్ స్టీఫెన్స్ కాలేజ్, ఢిల్లీ
ఎం ఐ సి ఏ (శిక్షణాసంస్ధ)
వృత్తిపత్రికావిలేఖరి
సుపరిచితుడు/
సుపరిచితురాలు
వ్యవస్థాపకురాలు, ముఖ్య కార్య నిర్వాహుకురాలు యువర్ స్టోరీ
గుర్తించదగిన సేవలు
యువర్ స్టోరీ

వృత్తి

[మార్చు]

యువర్ స్టోరీని ప్రారంభించడానికి ముందు, ఆమె 2006 నుండి 2007 వరకు టైమ్స్ ఆఫ్ ఇండియా లో బ్రాండ్ సలహాదారుగా పనిచేసింది. 2007 నుంచి 2009 వరకు సీఎన్ బీసీ టీవీలో అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. శ్రద్దా 2008 లో యువర్ స్టోరీని స్థాపించి, సంవత్సరం తరువాత ఈ సంస్థ అభివృద్ధికి ఉద్యోగాన్ని వదులుకున్నది. ఈ రోజు యువర్ స్టోరీకి 1,00,000 మందికి పైగా చందాదారులతో ఒక యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది, అక్కడ వారు వేలాది మంది స్వయం-ఆధారిత పారిశ్రామికవేత్తలను ఇంటర్వ్యూ చేస్తూ చాలా మంచి వారి జీవితంలో వారు పరిశ్రమలను స్థాపించడంలో వారు ఎదుర్కొన్న సమస్యలను, విజయాలను వివరంగా పొందుపరుస్తారు.

నాస్కామ్ ఎకోసిస్టమ్ ఎవాంజెలిస్ట్ అవార్డు, 2010లో విల్గ్రో జర్నలిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు, లోరియల్ పారిస్ ఫెమినా అవార్డు, 2015లో ఈటీ ప్రామిసింగ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా అవార్డు వంటి అనేక అవార్డులు, గుర్తింపులు అందుకున్నారు.

శ్రద్ధా శర్మ 2016 లో ఫార్చ్యూన్ 40 అండర్ 40 లో స్థానం పొందినది[4].

అభివృద్ధి

[మార్చు]

శ్రద్దా శర్మ స్థాపించిన యువర్ స్టోరీ స్టార్టప్ పారిశ్రామిక వేత్తల కథల (స్టోరీస్) కోసం భారతదేశపు ప్రముఖ ఆన్లైన్ మీడియా వెంచర్గా ప్రసిద్ధి చెందింది, 12 వేర్వేరు భాషల్లో కథలను అందిస్తుంది. యువర్ స్టోరీ సంస్థలో ప్రసిద్ధ వ్యాపారులైన రతన్ టాటా, వాణి కోలా, కార్తీ మాడసామి, టివి మోహన్ దాస్ పాయ్ వంటి వారి నుండి యువర్ స్టోరీకి పెట్టుబడులు వచ్చాయి. శర్మ ఒక మహిళాపారిశ్రామిక వేత్తనే గాక రచయిత్రిగా,ఆమె కట్ ది క్రాప్ అండ్ జార్గాన్: లెసన్స్ ఫ్రమ్ ది స్టార్టప్ ట్రెంచ్స్ అనే పుస్తకాన్ని రాసారు[5].

మూలాలు

[మార్చు]
  1. "Start-ups in India: Interview with Shradha Sharma from YourStory". akzente.giz.de (in ఇంగ్లీష్). Retrieved 2023-12-09.
  2. "Her story with 'YourStory'". The New Indian Express. Retrieved 2023-12-09.
  3. "Shradha Sharma - Forbes India Magazine". Forbes India (in ఇంగ్లీష్). Retrieved 2023-12-09.
  4. Deshpande, Ritika (2022-11-28). "Inspiring Story of Shradha Sharma and YourStory". MetaStory (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-12-09.
  5. "Shradha Sharma". Black Hat (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-12-09.