శ్రద్ధా శశిధర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రద్ధా శశిధర్
అందాల పోటీల విజేత
జననము (1996-09-03) 1996 సెప్టెంబరు 3 (వయసు 27)
చెన్నై, తమిళనాడు, భారతదేశం
విద్యబ్యాచిలర్ డిగ్రీ (మాస్ మీడియా)
పూర్వవిద్యార్థిసోఫియా కాలేజ్ ఫర్ ఉమెన్, ముంబై
ఆర్మీ పబ్లిక్ స్కూల్, డియోలాలి, నాసిక్
సెయింట్ జేవియర్స్ స్కూల్, భటిండా
బిరుదు (లు)మిస్ దివా యూనివర్స్ 2017
ప్రధానమైన
పోటీ (లు)
  • మిస్ దివా - 2017
    (విజేత - మిస్ దివా యూనివర్స్ 2017)
  • మిస్ యూనివర్స్ 2017
    (అన్‌ప్లేస్డ్)

శ్రద్ధా శశిధర్ (జననం 1996 సెప్టెంబరు 3) భారతీయ అందాల పోటీ టైటిల్ హోల్డర్, ఆమె మిస్ దివా యూనివర్స్ 2017 కిరీటం పొందింది.[1] మిస్ యూనివర్స్ 2017లో ఆమె భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది.[2]

ఆమె నైక్, యమహా ఫాసినో మొదలైన బ్రాండ్‌లకు మోడల్‌గా వ్యవహరించింది. మిస్ యూనివర్స్ ఇండియా 2017లో పాల్గొన్న సమయంలో, ఆమె ఘనా, థాయిలాండ్, ఫిలిప్పీన్స్ మొదలైన దేశాల్లో టెక్స్‌టైల్, టూరిజం, రియల్ ఎస్టేట్‌ మొదలైన రంగాలలో ఈవెంట్‌లను నిర్వహించడానికి భారతీయ ప్రతినిధిగా అంతర్జాతీయ ప్రయాణాలు చేసింది.

బాల్యం, విద్యాభ్యాసం[మార్చు]

శ్రద్ధా శశిధర్ చెన్నైలో జన్మించింది. ఆమె ఆర్మీ పబ్లిక్ స్కూల్, డియోలాలి, నాసిక్ నుండి పాఠశాల విద్యను అభ్యసించింది. ఆ తరువాత కాలంలో ముంబైలోని సోఫియా కాలేజ్ ఫర్ ఉమెన్‌లో చేరింది. అక్కడ ఆమె మాస్ మీడియాలో డిగ్రీని పొందింది.[3]

ప్రస్థానం[మార్చు]

మిస్ దివా - 2017

ఆమె యమహా ఫాసినో మిస్ దివా యూనివర్స్ 2017 కిరీటాన్ని అవుట్‌గోయింగ్ టైటిల్ హోల్డర్ యమహా ఫాసినో మిస్ దివా యూనివర్స్ 2016, రోష్మిత హరిమూర్తిచే అందుకుంది.[4][5]

మిస్ యూనివర్స్ 2017

ఆమె 2017 నవంబరు 26న యునైటెడ్ స్టేట్స్‌లోని లాస్ వెగాస్, నెవాడాలోని యాక్సిస్ లో జరిగిన మిస్ యూనివర్స్ 2017లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది, కానీ ఏ స్థానంలోనూ నిలువలేదు.[6]

మూలాలు[మార్చు]

  1. "Viral". India News, Breaking News, Entertainment News | India.com.
  2. "Shraddha Shashidhar To Represent India At Miss Universe". News18.
  3. "Shraddha Shashidhar to represent India at Miss Universe". dhinkachikatadka.com. Archived from the original on 2017-10-18. Retrieved 2024-01-30.
  4. "IN PHOTOS: Iris Mittenaere basks in 'magical' beauty of India". GMA News Online.
  5. "Chennai-based Miss Diva 2017 Shraddha Shashidhar to represent India at Miss Universe pageant". 12 October 2017.
  6. "Miss Universe 2017: India's Shraddha Shashidhar went unplaced". The Indian Express. 27 November 2017. Archived from the original on 28 November 2017. Retrieved 8 December 2017.