రోష్మిత హరిమూర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రోష్మిత హరిమూర్తి
అందాల పోటీల విజేత
2017లో రోష్మిత హరిమూర్తి
జననము (1994-08-13) 1994 ఆగస్టు 13 (వయసు 29)
బెంగళూరు, కర్ణాటక, భారతదేశం
విద్యమాస్టర్స్ డిగ్రీ (అంతర్జాతీయ వ్యాపారం)
పూర్వవిద్యార్థిమౌంట్ కార్మెల్ కాలేజ్, బెంగళూరు
బిరుదు (లు)మిస్ యూనివర్స్ ఇండియా 2016
ప్రధానమైన
పోటీ (లు)
  • ఫెమినా మిస్ ఇండియా బెంగుళూరు 2016
    (విజేత)
  • ఫెమినా మిస్ ఇండియా 2016
    (టాప్ 5)
  • మిస్ దివా - 2016
    (విజేత - మిస్ యూనివర్స్ ఇండియా 2016)
  • మిస్ యూనివర్స్ 2016
    (అన్ ప్లేస్డ్)

రోష్మిత హరిమూర్తి (జననం 1994 ఆగస్టు 13) ముంబైలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియంలో మిస్ యూనివర్స్ ఇండియా 2016 కిరీటాన్ని గెలుచుకున్న భారతీయ మోడల్.[1] మిస్ దివా - 2016 విజేతగా, ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో జరిగిన మిస్ యూనివర్స్ 2016లో ఆమె భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది.[2]

బాల్యం, విద్యాభ్యాసం[మార్చు]

ఆమె బెంగళూరులో పుట్టి పెరిగింది. ఆమె సోదరి, రక్షిత హరిమూర్తి కూడా అందాల పోటీ టైటిల్ హోల్డర్. ఆమె బెంగుళూరులోని సోఫియా హైస్కూల్‌లో పాఠశాల విద్యను అభ్యసించింది. అలాగే, మౌంట్ కార్మెల్ కాలేజ్ నుండి అంతర్జాతీయ వ్యాపారంలో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసింది.

ప్రస్థానం[మార్చు]

రోష్మిత హరిమూర్తి ఫెమినా మిస్ ఇండియా బెంగుళూరు టైటిల్ విజేతగా నిలిచింది. దీంతో, ఆమె ఫెమినా మిస్ ఇండియా 2016కి ఫైనలిస్ట్‌గా నేరుగా ప్రవేశించింది. అక్కడ, ఆమె టాప్ 5 ఫైనలిస్ట్‌కి చేరుకుంది.[3] ఈవెంట్‌లో "మిస్ స్పెక్టాక్యులర్ ఐస్", "మిస్ రాంప్‌వాక్" ప్రత్యేక అవార్డులను గెలుచుకుంది.

మిస్ దివా - 2016

ఆమె మిస్ దివా - 2016 పోటీలో పాల్గొంది. మిస్ దివా యూనివర్స్ 2016 టైటిల్‌ను గెలుచుకుంది, అక్కడ ఆమె అవుట్‌గోయింగ్ టైటిల్ హోల్డర్ ఊర్వశి రౌటేలా చేత కిరీటం పొందింది.

మిస్ యూనివర్స్ - 2016

ఆమె 2017 జనవరి 29న ఫిలిప్పీన్స్‌లోని మెట్రో మనీలాలోని పాసేలోని మాల్ ఆఫ్ ఆసియా అరేనా(SM Mall of Asia Arena)లో జరిగిన మిస్ యూనివర్స్ 2016లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది.[4] అయితే విజయం సాధించలేకపోయింది.[5]

మూలాలు[మార్చు]

  1. "Bangalore's Roshmitha Harimurthy Crowned Miss Diva 2016". IndiaWest. 12 September 2016. Archived from the original on 22 డిసెంబర్ 2019. Retrieved 22 December 2019. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  2. "Miss Diva 2016: Roshmitha Harimurthy to represent India at Miss Universe 2017". The Indian Express. 12 September 2016. Retrieved 22 December 2019.
  3. Jyothi, Team Mangalorean (25 December 2015). "Roshmitha Harimurthy Wins Femina Miss India Bengaluru 2016". Mangalorean. Retrieved 22 December 2019.
  4. "Miss Diva 2016: Roshmitha Harimurthy to represent India at Miss Universe 2017". The Indian Express. 12 September 2016. Retrieved 22 December 2019.
  5. "Miss Universe 2016: India's Roshmitha Harimurthy Fails To Advance To Top 13". News 18. 30 January 2017. Retrieved 22 December 2019.