శ్రీకట్నలీలలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీకట్నలీలలు
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం పరుచూరి బ్రదర్స్
నిర్మాణం డి.రామానాయుడు
తారాగణం చంద్రమోహన్ ,
తులసి,
జ్యోతి
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

నటీనటులు[మార్చు]

 • తులసి
 • చంద్రమోహన్
 • నూతన్ ప్రసాద్
 • గొల్లపూడి మారుతీరావు
 • రాళ్ళపల్లి
 • పి.ఎల్.నారాయణ
 • పరుచూరి వెంకటేశ్వరరావు
 • పరుచూరి గోపాలకృష్ణ
 • రాజా
 • రాజేష్
 • జ్యోతి
 • సంగీత
 • నిర్మలమ్మ
 • నగేష్
 • అహల్య (కొత్తనటి)

తెర వెనుక[మార్చు]

 • దర్శకత్వం: పరుచూరి బ్రదర్స్
 • కథ, మాటలు : పరుచూరి బ్రదర్స్
 • పాటలు: వేటూరి సుందరరామమూర్తి
 • సంగీతం: కె.చక్రవర్తి
 • ఛాయాగ్రహణం: సుందరం
 • కళ:కృష్ణమూర్తి
 • కూర్పు:కె.ఎ.మార్తాండ్
 • నిర్మాత: డి.రామానాయుడు

కథ[మార్చు]

నీలకంఠం వడ్డీ వ్యాపారి. అతడి పెద్ద కూతురు పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళినా ఎక్కువ కట్నం తెచ్చాననే అహంతో వ్యవహరిస్తూ భర్తను చిన్నచూపు చూస్తూవుంటుంది. చిన్న కూతురు జ్యోతి కళాశాల విద్యార్థిని. ఆదర్శవాది. నీలకంఠం మూలంగా రామయ్య అనే రైతు కూతురు పెళ్ళి పీటలమీద ఆగిపోవడం, పెళ్ళికూతురు అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది. నీలకంఠం బావమరిది తన అల్లుడికి కట్నం ఇవ్వలేక మస్కా కొట్టడానికి ఎత్తులు వేస్తూవుంటాడు. తాను కులాంతరవివాహం చేసుకుంటానని, వరకట్న దురాచారాన్ని నిర్మూలిస్తానని జ్యోతి కళాశాలలో శపథం చేస్తుంది. సాంబశివరావు అనే విద్యార్థి ఆమెను సవాలు చేస్తాడు. నీలకంఠం అక్రమాల మూలంగా పాముల నర్సయ్య కూతురు పెళ్ళి కూడా ఆగిపోతుంది. ఇవన్నీ తెలుసుకున్న జ్యోతి వరకట్నం పేరిట అక్రమాలు చేసేవారికి బుద్ధిచెప్పాలని నిశ్చయించుకొని సాంబశివరావు సాయం కోరుతుంది[1].

పాటలు[మార్చు]

 1. మందారపూవు
 2. ఇది నిన్నటి నిజాలకు సమాధానాలు

మూలాలు[మార్చు]

 1. వి (8 February 1985). "చిత్రసమీక్ష శ్రీకట్నలీలలు". ఆంధ్రపత్రిక దినపత్రిక. Retrieved 22 January 2020.[permanent dead link]

బయటి లంకెలు[మార్చు]