శ్రీనివాస్ రామడుగుల
Jump to navigation
Jump to search
శ్రీనివాస్ రామడుగుల | |
---|---|
![]() శ్రీనివాస్ రామడుగుల | |
జననం | శ్రీనివాస్ జనవరి 11, 1968 రంగాపురం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ![]() |
నివాస ప్రాంతం | భోపాల్ |
వృత్తి | దూరదర్శన్ కేంద్రం లో ఇంజినీర్, రచయిత |
మతం | హిందూ |
భార్య / భర్త | సత్యలక్ష్మి |
పిల్లలు | సింధూజ |
తండ్రి | సూర్య గంగాధరం |
తల్లి | సీతారామం, |
శ్రీనివాస్ రామడుగుల పూర్తిపేరు రామడుగుల వెంకట సత్య సూర్య శ్రీనివాస్. తెలుగు యువకవులలో ఒకరు. వీరి కలం పేరు "శ్రీ". కవి సంగమంలో కవిత్వం వ్రాస్తుంటారు.
జీవిత విశేషాలు[మార్చు]
రామడుగుల సీతారామం, సూర్య గంగాధరం దంపతులకు జనవరి 11 1968న తూర్పు గోదావరి జిల్లా రంగాపురంలో జన్మించారు.
ప్రస్తుత నివాసం - వృత్తి/ఉద్యోగం[మార్చు]
ప్రస్తుతం భోపాల్లో నివసిస్తున్నారు. దూరదర్శన్ కేంద్రంలో ఇంజినీర్ గా పనిచేస్తున్నారు.
వివాహం - పిల్లలు[మార్చు]
వీరికి సత్యలక్ష్మితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె (సింధూజ).
ప్రచురితమయిన మొదటి కవిత[మార్చు]
కవితల జాబితా[మార్చు]
ప్రచురితమయిన పుస్తకాల జాబితా[మార్చు]
- "శ్రీ వాక్యం" ( ఏక వాక్య కవితల సహస్రం ) సెప్టెంబరు 1వ తేదీ 2013 విశాఖపట్టణంలో రోజా డాన్స్ అండ్ ఆర్ట్ అకాడమీ వారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది.
- "మనసంతా నువ్వే" ( దీర్ఘ కవితల సంపుటి) జనవరి 11వ తేదీ 2014 హైదరాబాద్లో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది.
బహుమానాలు - బిరుదులు - గుర్తింపులు[మార్చు]
బహుమానాలు
- 2013 సెప్టెంబరులో విడుదల చేసిన శ్రీవాక్యానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారి అవార్డు 2014 సెప్టెంబరు ఒకటవ తేదీన హైదరాబాద్ లో.
- "ప్రేమను ప్రేమించు ప్రేమకై" గ్రూప్ లో కవితలకి ప్రథమ బహుమతి ఒకసారి, ద్వితీయ బహుమతి మరోసారి.
- తిరుపతి దేవస్థానం వారు నిర్వచించిన పురాణ ప్రబోధ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో వెండిపతకం (1982లో )
బిరుదులు[మార్చు]
- "ఏకవాక్య కవితా విశారద" విశాఖపట్టణంలో రోజా డాన్స్ అండ్ ఆర్ట్ అకాడమీ వారిచే. 2013 సెప్టెంబరు 1న బహూకరించబడింది.
గుర్తింపులు[మార్చు]
- తెలుగు వన్.కాంలో ప్రత్యేకమైన రోజులలో కవితలు చాలా ప్రచురించబడ్డాయి.
- సేవ పత్రికలో కొన్ని ప్రచురించబడినవి.
- NATA వారు ఇప్పటివరకు ప్రచురించబడిన రెండు సంచికల లోను కవితలు ప్రచురించబడినవి.
- తెలుగు వెలుగులు పత్రికలో బెంగళూరు తెలుగు పత్రికలో ఆస్ట్రేలియా వారి పత్రికలో కవితలు ప్రచురించబడినవి
- ఏక వాక్య కవితలు 3500 ఇప్పటికి వ్రాయడం జరిగింది.ఇదొక రికార్డు తెలుగు సాహితీ చరిత్రలో.
- దీర్ఘ కవితలు సుమారుగా 250 వరకు రచించారు
- ద్విపాద కవితామాలికలు సుమారు 1500 దాకా రచించారు.