Jump to content

శ్రీనివాస్ వరదన్

వికీపీడియా నుండి
శ్రీనివాస్ వరదన్
FRS
సెప్టెంబర్ 2013లో 1వ హైడెల్‌బర్గ్ గ్రహీత ఫోరమ్‌లో శ్రీనివాస వరదన్
జననం (1940-01-02) 1940 జనవరి 2 (వయసు 84)
మద్రాస్, మద్రాస్ ప్రెసిడెన్సీ, బ్రిటీష్ రాజ్
(చెన్నై, తమిళనాడు, భారతదేశం)
నివాసంఅమెరికా సంయుక్త రాష్ట్రాలు
రంగములుగణితం
వృత్తిసంస్థలుకోరెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్ (న్యూయార్క్ యూనివర్సిటీ)
చదువుకున్న సంస్థలుప్రెసిడెన్సీ కాలేజ్, చెన్నై
మద్రాస్ విశ్వవిద్యాలయం
ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్
పరిశోధనా సలహాదారుడు(లు)సి ఆర్ రావు
డాక్టొరల్ విద్యార్థులుపీటర్ ఫ్రిజ్
జెరెమీ క్వాస్టెల్
ప్రసిద్ధిMartingale problems; Large deviation theory
ముఖ్యమైన పురస్కారాలుపద్మవిభూషణ్ (2023)
నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ (2010)
పద్మ భూషణ్ (2008)
అబెల్ ప్రైజ్ (2007)
స్టీల్ ప్రైజ్ (1996)
బిర్కాఫ్ ప్రైజ్ (1994)

శతమంగళం రంగ అయ్యంగార్ శ్రీనివాస వరదన్ (ఆంగ్లం: S. R. Srinivasa Varadhan; 1940 జనవరి 2) భారతీయ అమెరికన్ గణిత శాస్త్రజ్ఞుడు. 20వ శతాబ్దపు అత్యంత ప్రభావవంతమైన గణిత శాస్త్రజ్ఞులలో ఒకరిగా విస్తృతంగా గుర్తింపు పొందాడు.

ఆయన సంభావ్యత సిద్ధాంతానికి తన ప్రాథమిక సహకారానికి ప్రసిద్ధి చెందాడు. నార్వేజియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అండ్ లెటర్స్ 2007 ఆయనకు అబెల్ ప్రైజ్ని అందజేసాయి. దీంతో ఆసియా ఖండంలోనే ఈ ప్రైజ్ గెలుచుకున్న మొదటి వ్యక్తిగా శ్రీనివాస్ వరదన్ గుర్తింపుపొందాడు.

గణిత శాస్త్రవేత్త ఎస్.ఆర్. శ్రీనివాస్ వరదన్‌ను పద్మవిభూషణ్‌తో 2023లో భారత ప్రభుత్వం సత్కరించింది.[1]

బాల్యం, విద్య

[మార్చు]

చెన్నైలో (అప్పటి మద్రాసు) హిందూ తమిళ బ్రాహ్మణ అయ్యంగార్ కుటుంబంలో శ్రీనివాస్ వరదన్ 1940 జనవరి 2న జన్మించాడు. మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి 1960లో మాస్టర్స్ డిగ్రీని పొందిన శ్రీనివాస్ వరదన్ కలకత్తాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ (ISI) నుండి 1963లో సి ఆర్ రావు ఆధ్వర్యంలో డాక్టరేట్ పొందాడు. 1956–1963 మధ్యకాలంలో ISI లోని ప్రసిద్ధ నలుగురిలో ఆయన ఒకడు కాగా ఇతరులు ఆర్. రంగారావు, కె. ఆర్. పార్థసారథి, వీరవల్లి ఎస్. వరదరాజన్.

కెరీర్

[మార్చు]

1963లో శ్రీనివాస్ వరదన్ భారతదేశం నుండి న్యూయార్క్‌లోని కొరెంట్ ఇన్‌స్టిట్యూట్‌కు పోస్ట్‌డాక్టోరల్ ఫెలోగా వెళ్ళాడు. అతను ప్రస్తుతం గణితశాస్త్ర ప్రొఫెసర్, ఫ్రాంక్ జె గౌల్డ్ కౌరెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్‌లో సైన్స్ ప్రొఫెసర్‌గా ఉన్నాడు.

గుర్తింపు

[మార్చు]
  • 1994లో బిర్‌ఖోఫ్ ప్రైజ్
  • 1995లో మార్గరెట్, హెర్మన్ సోకోల్ అవార్డు, న్యూయార్క్ యూనివర్శిటీ
  • 1996లో లెరోయ్ పి స్టీల్ ప్రైజ్‌, అమెరికన్ మ్యాథమెటికల్ సొసైటీ
  • 2007లో అబెల్ బహుమతి
  • 2008లో పద్మభూషణ్‌, భారత ప్రభుత్వం
  • 2010లో నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్, యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వం
  • 2023లో భారతదేశపు రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్

మూలాలు

[మార్చు]
  1. "Wayback Machine". web.archive.org. 2023-01-27. Archived from the original on 2023-01-27. Retrieved 2023-01-27.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)