శ్రీపాద లక్ష్మీపతిశాస్త్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శ్రీపాద లక్ష్మీపతిశాస్త్రి (1887-1944) సంస్కృత పండితుడు[1]. అతను వావిళ్ల నిఘంటువు నిర్మాణంలోను[2], శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు నిర్మాణంలోను పాలుపంచుకున్నాడు.

వావిళ్ల నిఘంటువు

[మార్చు]

వావిళ్ల నిఘంటువు అనే సంస్కృతాంధ్ర నిఘంటువును 1931-33 ప్రాంతములో వావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రి తమ సంస్థ పేర ప్రకటించితిరి. అందుకు అతను బ్రహ్మశ్రీ శ్రీపాద లక్ష్మీపతిశాస్త్రి ని నియమించిరి. అతను నిఘంటు నిర్మాణానుభవము, విశేష పాండిత్యము, భాషాభిరుచి కలవారగుట చేత 1933 లో అనగా శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు కాని యాంధ్ర వాచస్పత్యము కాని తొలి సంపుటము ప్రకటించబడక పూర్వమే "వావిళ్ల నిఘంటు" రచనమునకు ప్రారంభించిరి. 1934 లో అకారాదిగా "ఇంచు" వరకు రచించిరి. అది వెంటనే 188 పుటలలో ప్రకటించబడినది. లక్ష్మీపతి శాస్త్రి ఈ నిఘంటువులో అకారాదిగా "ఇంచు" అను పదము మూడవ అర్థమువరకు మాత్రమే రచించిరి. కానీ ఈ పని పూర్తి కాకుండానే శాస్త్రిగారు పరమపదించడం వల్ల నిఘంటు నిర్మాణం ఆగిపోయినది. మిగిలిన నిఘంటు భాగాన్ని పూర్తి చేయుటకు శ్రీశాస్త్రులు గారు ఈ కార్యమును కాకినాడకు చెందిన బులుసు వేంకటేశర్లు కు అప్పగించిరి. ఈ నిఘంటువు మిగిలిన భాగాన్ని అతను పూర్తిచేసాడు.[3]

రచనలు

[మార్చు]
  1. మరుత్తరాట్చరిత్ర (నాటకము)
  2. దశకుమారచరిత్ర (అనువాదం)
  3. బాణ గద్యకావ్య కథలు[4]
  4. కుమారసంభవ విమర్శనము[5]
  5. మహానుభావులు[6] - 1931
  6. దాస్యవిమోచనము[7]
  7. వావిళ్ల నిఘంటువు (188 పుటల వరకు) - 1949
  8. పాణిగ్రహణం - వివాహ మంత్రార్థము[8] - 1939

మూలాలు

[మార్చు]
  1. "Lakṣmīpatiśāstri, Śrīpāda 1887-1944".{{cite web}}: CS1 maint: url-status (link)
  2. Datta, Amaresh (1988). Encyclopaedia of Indian Literature: Devraj to Jyoti (in ఇంగ్లీష్). Sahitya Akademi. ISBN 978-81-260-1194-0.
  3. "వావిళ్ళ నిఘంటువు(మొదటి సంపుటం) : శ్రీపాద లక్ష్మీపతిశాస్త్రి, బులుసు వెంకటేశ్వరులు : Free Download, Borrow, and Streaming". Internet Archive (in ఇంగ్లీష్). Retrieved 2020-07-14.
  4. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో బాణ గద్యకావ్యకథలు పుస్తకప్రతి
  5. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో కుమారసంభవ విమర్శనము పుస్తకప్రతి
  6. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో మహానుభావులు రెండవభాగము పుస్తకప్రతి
  7. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో దాస్యవిమోచనము పుస్తకప్రతి
  8. "పాణిగ్రహణము : శ్రీపాద లక్ష్మీపతిశాస్త్రి : Free Download, Borrow, and Streaming". Internet Archive (in ఇంగ్లీష్). Retrieved 2020-07-14.