శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు
పుస్తక ముఖచిత్రం
కృతికర్త:
దేశం: భారతదేశం
భాష: తెలుగు
సీరీస్: ఎనిమిదవ సంపుటము
ప్రక్రియ: నిఘంటువు
ప్రచురణ: ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి
విడుదల: 1982
దీనికి ముందు: ఏడవ సంపుటము


శ్రీ సూర్యారాయాంధ్ర నిఘంటువు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి, హైదరాబాదు వారి విశిష్ట ప్రచురణ. ఇది ఎనిమిది సంపుటములు కలిగిన ఒక పెద్ద నిఘంటువు. తెలుగు భాషలో ఇప్పటికీ ఇదే నిండైన నిఘంటువు ఇదే. ఇందులో దాదాపు ఒక లక్షా పదివేల మాటలున్నాయి.

దీని మొదటి నాలుగు సంపుటాలు స్వర్గీయ రావు వేంకట కుమార మహీపతి సూర్యారావు బహద్దరుగారి అండదండలతో, సంపూర్ణ ఆర్థిక సహకారముతో, స్వర్గీయ జయంతి రామయ్య పంతులు గారి పర్యవేక్షణలో సిద్ధమై 1939 సంవత్సరములో కాకినాడ ఆంధ్ర సాహిత్య పరిషత్తు పక్షాన ప్రకటితమైనది. తర్వాత 5, 6, 7 సంపుటాలు 1957 సంవత్సరములో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయముతో ముద్రితమైనవి. ఏడవ సంపుటము అనుబంధము మాత్రము 1965 సంవత్సరములొ ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి, ఆర్థిక సహాయము గావించి దీని ముద్రణకు తోడ్పడినది. ఇది 1974 సంవత్సరము హైదరాబాదు నగరములో, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వేదికపై ఆవిష్కృతమైనది.

దీని ఐదవ, ఆరవ సంపుటములను 1958 జూన్ 12 తేదీన ఆంధ్ర సాహిత్య పరిషత్తు వారి వార్షిక సమావేశములో భారత ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆవిష్కరించారు.

అయిదవ, ఆరవ సంపుటాలు

[మార్చు]

వీనిని పీఠికాపురాధీశుల కోరిక మేరకు గిడుగు వేంకట సీతాపతి గారు 1944-48 లో ఈ నిఘంటు నిర్మాణ పర్యవేక్షణము సాగించి గ్రంథము యొక్క ముద్రణ కావించినారు. వీటి నిర్మాణములో పాల్గొన్న పండితులు.

 1. కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి
 2. దర్భా సర్వేశ్వరశాస్త్రి
 3. ప్రయాగ వేంకటరామశాస్త్రి
 4. ఆకుండి వేంకటశాస్త్రి
 5. బులుసు వేంకటేశ్వరులు
 6. చిలుకూరి పాపయ్యశాస్త్రి
 7. దువ్వూరి సూర్యనారాయణశాస్త్రి
 8. చిలుకూరి వీరభద్రశాస్త్రి
 9. చెఱుకుపల్లి అప్పారాయశాస్త్రి
 10. సామవేదం శ్రీరామమూర్తిశాస్త్రి
 11. పన్నాల వెంకటాద్రిభట్టశర్మ
 12. ఇంద్రకంటి సూర్యనారాయణశాస్త్రి

https://archive.org/details/ShriiSuuryaraayaandhraNighantuvu6