శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం, శ్రీకాకుళం

వికీపీడియా నుండి
(శ్రీ. కోదండ రామ స్వామి వారి ఆలయం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

శ్రీ కోదండరామ ఆలయం, శ్రీకాకుళం పట్టణం లోని దర్శనీయ ప్రదేశాలలో ఒకటి. ఇది నాగావళి నదీతీరాన ప్రస్తుత కృష్ణాపార్కు సమీపంలో పాలకొండ రోడ్డు ప్రక్కన నిర్మించబడింది[1]. ఈ దేవాలయం 1826 లో నిర్మింపబడింది.

దేవాలయ వ్యవస్థాపకులు

[మార్చు]

స్వర్గీయ అద్దమనుగుల వెంకన్న పంతులు, ఆయన సతీమణి వెంకాయమ్మ, కుమార్తె రత్నాయమ్మ నిర్మించినట్లు ఆలయంలో గల వివరములను బట్టి తెలుస్తున్నది. ఈ ఆలయానికి నాలుగు వందల ఎకరాల భూమి నరసన్నపేట మండలం పోతయ్యవలసలో ఉంది.[2]

స్థానిక ప్రాశస్త్యం

[మార్చు]

ఈ దేవాలయమును చాలా మహిమ గలది గా స్థానికులు భావిస్తారు. శ్రీకాకుళం పట్టణంలో నిర్మించిన మొట్ట మొదటి రామాలయం ఇది.

ఉపనిషన్మందిరం

[మార్చు]

ఈ దేవాలయం నకు అనుబంధంగా ఉపనిషన్మందిరం అనే ధార్మిక సంస్థ సుమారు వంద సంవత్సరములు పైబడి కొనసాగుతున్నది. సనాతన ధర్మాన్ని ప్రచారం చేయటం, పురాణ, వేద విజ్ఞానాన్ని పెంపొందించటం ఈ సంస్థ లక్ష్యం. ఈ లక్ష్యానికి అనుగుణంగా ఏర్పాటు చేసిన గ్రంధాలయంలో తెలుగు, సంస్కృతం, హిందీ, ఆంగ్ల భాషలో సుమారు 5000 పుస్తకాలు ఉన్నాయి. నేటికి ప్రతీ ఆదివారం సాయంత్రం ధార్మిక ప్రవచనాలు, గోష్టులు కొనసాగుతూ ఉన్నాయి.

మూలాలు

[మార్చు]
  1. "ప్రాచీన దేవుళ్ళపై సర్వే! Published Friday, 18 March 2016". Archived from the original on 4 జూలై 2019. Retrieved 4 జూలై 2019.
  2. "శ్రీకాకుళం: దేవుడికే కష్టం.. ఎవరికి చెప్పుకుంటాడో!".[permanent dead link]