శ్రీ కృష్ణ కర్ణామృతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శ్రీకృష్ణ కర్ణామృతం (ఆంగ్లం: Sri Krishna Karnamrutam) సంగీత సాహిత్య రంగాల్లో ప్రఖ్యాతి పొందిన సంస్కృత కావ్యం. దీన్ని వాగ్గేయకారుడు లీలాశుకుడు రచించారు.

ప్రాచుర్యం[మార్చు]

లీలాశుకుడు రచించిన శ్రీకృష్ణ కర్ణామృతం శ్లోకాలు అటు ఉత్తర భారతదేశంలోనూ, ఇటు దక్షిణ భారతదేశంలోనూ సంగీత సభలలో, భజన కార్యక్రమాల్లో విరివిగా ఆలపిస్తూంటారు. సభలలో రాగమాలికలుగా విద్వాంసులు గానం చేసే శ్లోకాలు మాత్రమే కాకుండా తాళలయాన్వితాలై మృదంగాది వాద్యాలతో సహా పాడతగినవీ, నృత్యాభినయం చేయదగినవీ, నిబద్ధ గేయాలు అనదగిన వృత్తచ్ఛందస్సులు ఈ కృష్ణకర్ణామృతంలో సగానికి మించి ఉన్నాయి. దీనివల్ల సంగీత సభల్లోనే కాక నృత్య ప్రదర్శనల్లో కూడా శ్రీకృష్ణ కర్ణామృత శ్లోకాలు సుప్రసిద్ధి పొందాయి.

కావ్య సరళి[మార్చు]

శ్రీకృష్ణ కర్ణామృతం 3 ఆశ్వాశాలుగా విభజింపబడింది.