లీలాశుకుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

లీలాశుకుడు ఒక గొప్ప వాగ్గేయకారుడు, శ్రీ కృష్ణ కర్ణామృతం రచనచేసిన మహాకవి. ఇతడు జయదేవుడు తర్వాత 13వ శతాబ్ద కాలంలో శ్రీకృష్ణ భక్తిని అత్యున్నత స్థాయికి తీసుకొనిపోయాడు.

ఇతడు ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా శ్రీకాకుళం ప్రాంతంలో నివసించేవాడని ప్రతీతి. ఇతడు రచించిన కృష్ణ కర్ణామృతంలోని శ్లోకాలు గానానికి, నృత్యానికి, అభినయానికి, చిత్రలేఖనానికి, శిల్పానికి ఉపయోగపడే రచనలుగా చెప్పవచ్చును.

శ్రీ కృష్ణ కర్ణామృతం[మార్చు]

శ్రీ కృష్ణ కర్ణామృతం మూడు ఆశ్వాసాల భక్తి కావ్యం. మూడింటిలోను 110 చొప్పున శ్లోకాలున్నాయి. మొదటి ఆశ్వాసంలో శ్రీకృష్ణుని సాక్షాత్కారం, రెండవ ఆశ్వాసంలో శ్రీకృష్ణుని వివిధ లీలా విశేషాలు, మూడవ ఆశ్వాసంలో శ్రీకృష్ణుని జీవితంలోని అనేక ఘట్టాలు వర్ణించబడ్డాయి. దీనిలోని శ్లోకాలను సంగీత సభలలో రాగమాలికలుగా గానం చేయడం పరిపాటి.

బయటి లింకులు[మార్చు]