శ్రీ యఱ్ఱమిల్లి నారాయణ మూర్తి కళాశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీ యఱ్ఱమిల్లి నారాయణ మూర్తి కళాశాల
పూర్వపు నామములు
ది నరసాపూర్ కాలేజ్
నినాదంతమసోమా జ్యోతిర్గమయ
ఆంగ్లంలో నినాదం
from dark to light
రకంసార్వత్రిక (ఎయిడెడ్)
స్థాపితం1948
అనుబంధ సంస్థస్వతంత్ర (అటానమస్) పూర్వం ఆంధ్ర విశ్వవిద్యాలయంతో
అధ్యక్షుడుడా. చినమిల్లి సత్యనారాయణ రావు
ప్రధానాధ్యాపకుడుడా. యంవిఆర్‌కె నరసింహాచార్యులు
స్థానంనరసాపురం, ఆంధ్ర ప్రదేశ్
అథ్లెటిక్ మారుపేరువైయన్ కాలేజ్
జాలగూడుsriyncollege.com www.sriyncollege.com]

శ్రీ వై యన్ కళాశాల గా ప్రఖ్యాతి వహించిన శ్రీ యఱ్ఱమిల్లి నారాయణ మూర్తి కళాశాల పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలో ఉంది. 1949 వ సంవత్సరంలో స్థాపించిన ఈ కళాశాల వసిష్ఠ గోదావరి ఒడ్డున విద్యా కుసుమాలను వెదజల్లుతోంది. ప్రస్తుతం ఈ సంస్థ 9 ఇంటిర్, డిగ్రీ, పిజి కోర్సులతో పాటూ బిఇడి, యంబిఎ, యంసిఎ వంటి ప్రొఫెషనల్ కోర్సులనూ అందిస్తోంది. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాక్ (NAAC) చేత ఎ గ్రేడ్‌లో గుర్తింపు పొందిన తొలి కళాశాల ఇదే. ఇది ఆంధ్ర విశ్వవిద్యాలయ పరిధిలోని ప్రభుత్వ ఎయిడెడ్ కళాశాల.[1]

చరిత్ర[మార్చు]

పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రముఖ న్యాయవాది, విద్యావేత్త అయిన యఱ్ఱమిల్లి నారాయణ మూర్తి స్థానికుల సహాయ సహకారాలతో ఈ కళాశాలను ప్రారంభించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో విద్యా వ్యాప్తికి ప్రముఖ పాత్ర వహించిన విద్యా సంస్థల్లో ఇది ఒకటి. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి విద్యార్థులు ఇక్కడ పెద్ద సంఖ్యలో చదువుకుంటున్నారు. ముందుగా ఈ కళాశాలను నరసాపురంలో మరో ప్రముఖ విద్యా సంస్థ అయిన టేలర్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ప్రారంభించారు. తరువాత అప్పటి వరకూ నరసాపురం కలెక్టర్ బంగ్లాను ఈ కళాశాలకు కేటాయించారు. అప్పటి నుంచీ కాలేజీ ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతూ వచ్చింది.

1956లో దీనికి పూర్తి స్థాయి కళాశాల హోదా వచ్చింది. 1989-90 విద్యా సంవత్సరంలో పిజి విభాగం ప్రారంభం అయింది. ఈ కళాశాలను ది నరసాపూర్ కాలేజ్ అనే పేరుతో ప్రారంభించారు. 1967లో కళాశాల వ్యవస్థాపకులు యఱ్ఱమిల్లి నారాయణ మూర్తి పంతులు పేరు ఈ సంస్థకు పెట్టారు. ఈ భవంతి డచ్‌ పాలనలో నిర్మితమైంది. దీనిని డచ్ బిల్డింగ్‌గా స్థానికులు పిలుస్తారు. 200కు పైగా సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ భవంతి గోదావరి నదీ తీరంలో 14 ఎకరాల విశాల ప్రాంగణంలో ఉంది. ఇప్పుడు ఈ భవంతి చుట్టూ అనేక కాలేజీ విభాగాల బిల్డింగులు వచ్చి చేరాయి. ఈ చారిత్రక భవంతిలో ప్రస్తుతం కళాశాల ప్రధాన పరిపాలన విభాగం, ప్రిన్సిపల్‌ కార్యాలయాలు ఉన్నాయి. ఈ కళాశాలకు భాగవతుల జినేంద్రనాథ్ చాలాకాలం ప్రిన్సిపల్‌గా పనిచేసి ఇక్కడే రిటైరయ్యారు.

50వ వార్షికోత్సవం[మార్చు]

2000వ సంవత్సరంలో వైయన్ కళాశాల స్వర్ణోత్సవాలు జరుపుకుంది. 2007-2008 విద్యా సంవత్సరంలో ‍యుజిసి నుంచి అటానమస్ హోదా పొందింది.[2]

పూర్వ విద్యార్థులు[మార్చు]

కేంద్ర మంత్రి, మెగా స్టార్ చిరంజీవి పూర్వ విద్యార్థులు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రఖ్యాతి వహించిన కళాకారులు మెగాస్టార్ చిరంజీవి, దాసరి నారాయణ రావు, యు వి కృష్ణంరాజు, గజల్ శ్రీనివాస్ వంటి అనేక మంది ప్రముఖులు ఈ కళాశాలలో చదివారు.

సూచనలు[మార్చు]

  1. "Andhra University - Affiliated Colleges". Archived from the original on 2012-10-09. Retrieved 2012-10-08.
  2. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2016-10-18. Retrieved 2012-10-08.

బయటి లింకులు[మార్చు]