శ్రీ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీ రెడ్డి
Sri reddy in a photo shoot.jpg
జననం
కొంకుదురు(తూర్పుగోదావరి జిల్లా)
ఇతర పేర్లువిమల మల్లిడి
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2011–ప్రస్తుతం
తల్లిదండ్రులు
 • వెంకటరెడ్డి (తండ్రి)
 • పుష్పవతి (తల్లి)

శ్రీ రెడ్డి (Sri Reddy) తెలుగు సినిమా నటీమణి.[1] ఆమె అరవింద్ 2, "నేను నాన్న అబద్దం" సినిమాలలో నటించింది.[2]

జీవిత విశేషాలు[మార్చు]

శ్రీరెడ్డి గా పరిచయం ఉన్న ఆమె అసలు పేరు విమల మల్లిడి. ఆమె కృష్ణా జిల్లా విజయవాడ లోని కంకిపాడుకు చెందిన ఓ సాంప్రదాయ కుటుంబంలో పుష్పవతి, వెంకటరెడ్డి దంపతులకు జన్మించింది. ఆమెకు తాను అనుకున్నదే జరగాలని భావించే స్వభావం చిన్నప్పటి నుండే ఉన్నది. ఆమె మొదట్లో బ్యూటీ పార్లర్ నిర్వహించేది. [3] 2008లో మంచి ఉద్యోగం చూసుకుని తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని విజయవాడ నుంచి భాగ్యనగరానికి చేరింది. అక్కడికి వచ్చాక రంగుల ప్రపంచం ఆకట్టుకోవడంతో యాంకర్ గా చేయడం ఆరంభించింది. సాక్షి టీవీలో యాంకర్ గా పనిచేసింది. [4] గీతామాధురి భర్త నందు హీరోగా నటించిన "నేను నాన్న అబద్ధం" చిత్రంతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అయింది. 2011లో విడుదలైన ఆ సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో మరో సినిమాలో ఛాన్స్ కోసం శ్రీరెడ్డి రెండేళ్లు ఆగాల్సి వచ్చింది. 2013లో అరవింద్ 2 చిత్రానికి ఎంపికైంది. ఆ సినిమాలో శ్రీరెడ్డికి మంచి పేరే వచ్చింది. జిందగీ అనే మరొ సినిమాలో హీరో యిన్ గా ఛాన్స్ వచ్చింది. కాని అది రిలీజ్ కు నోచుకోలేదు. [5] తరువాత ఆమెకు సినిమా అవకాశాలు రాకపోవడంతో ఇండస్ట్రీకి దూరంగా ఉంది.[6][7]

న్యాయ పోరాటం[మార్చు]

టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై తనదైన శైలిలో పోరాడుతోంది శ్రీరెడ్డి. ఆమె తెలుగు సినిమా నటులు, దర్శకులు, టెక్నీషియన్లు అనుకునే అందరిపైనా అత్యంత వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసింది. తెలుగు సినీ ఇండస్ట్రీని ఈ వ్యాఖ్యలు ఓ కుదుపు కుదిపేస్తున్నాయి. కాస్టింగ్ కౌచ్ పేరుతో సినీ ఇండస్ట్రీలో మహిళలపై వేధింపులు జరుగుతున్నాయంటూ గత కొద్దిరోజులుగా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది శ్రీ రెడ్డి. టాలీవుడ్‌లో అవకాశాల పేరుతో లొంగదీసుకుని తెలుగు అమ్మాయిలకు అన్యాయం చేస్తున్నారంటూ తీవ్రంగా ఆరోపణలు చేసింది. తనతో సెలబ్రెటీలు జరిపిన ఛాట్ లిస్ట్‌లను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి టాలీవుడ్‌ని షేక్ చేస్తోన్న శ్రీరెడ్డి ఇటీవలే ఫిలిం చాంబర్ ఎదుట అర్థనగ్న ప్రదర్శన చేసింది. అయితే ఈ ఉదంతంతో ఆమెకు ‘మా’ (మువీ ఆర్టిస్ట్ అసోసియేషన్) సభ్యత్వం నిరాకరించడంతో పాటు ఆమెపై దీర్ఘకాలిక నిషేధం విధించారు. ‘మా’లో ఉన్న 900 మంది ఆమెతో నటించరంటూ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్.

దీంతో షాకైన శ్రీ రెడ్డి ఏమాత్రం జంకకుండా నేషనల్ మీడియాకు ఎక్కుతానంటూ సవాలు విసిరి తన పోరాటాన్ని మరింత తీవ్రతరం చేసింది.[8][9] ఆమెను సినీ పరిశ్రమ నుంచి బహిష్కరించడాన్నితెలంగాణ యూత్ ఫోర్స్ ఖండించింది. శ్రీ రెడ్డి కి సినిమాలో అవకాశాలు ఇవ్వకుండా, మా సభ్యత్వాన్ని సైతం ఇవ్వకుండా అన్యాయం చేసిన మా అసోసియేషన్ ప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని.. యూత్ ఫోర్స్ ప్రతినిధులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేశారు.[10] శ్రీరెడ్డి వ్యవహారాన్ని త్వరితగతిన ముగించి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడాలని యూత్ ఫోర్స్ కోరింది. సినీ ఆర్టిస్ట్‌ల హక్కులను కాల రాసే అధికారం ‘మా’ అసోసియేషన్‌కు లేదని వెల్లడించింది. స్త్రీలను గౌరవించే దేశంలో వారికి అన్యాయం జరిగితే వెంటనే పరిష్కరించాలని సూచించింది. ‘మా’ అసోసియేషన్ వినకుంటే వారి కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని తెలంగాణ యూత్ ఫోర్స్ హెచ్చరించింది.[11]

ఆమె చేస్తున్న నిరసన ప్రజా సంఘాల నుండి ఊహించని స్థాయి మద్దతు లభించడంతో పాటు ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో నటి శ్రీరెడ్డి విషయంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) వెనక్కి తగ్గుతూ ఏప్రిల్ 11, 2018 న శ్రీరెడ్డిపై బ్యాన్‌ను ఎత్తివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.[12]

శ్రీరెడ్డి లీక్స్[మార్చు]

శ్రీ రెడ్డి దగ్గుబాటి సురేష్ బాబు తనయుడు అభిరామ్ తో అత్యంత సన్నిహితంగా ఉన్న  ఫోటోలను విడుదల చేసింది. ఇవి సినీ పరిశ్రమలో కలకలం రేపాయి. ఆమె పదికిపైన ఉన్న ఫోటోలను బహిర్గతం చేసింది. అంతే కాకుండా టాలీవుడ్ క‌మ‌ర్షియ‌ల్ రైట‌ర్ కోన వెంక‌ట్ త‌న‌ను బంజారాహిల్స్ శ్మ‌శానం వెనుక ఉన్న గెస్ట్‌హౌస్‌కు పిలిచి లైంగిక దాడి చేశాడ‌ని శ్రీరెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది.[13][14] టాలీవుడ్ కు చెందిన ప్రముఖ మాటల రచయితకు సంబంధించిన వాట్సప్ చాటింగ్ హిస్టరీని కూడా బయటపెట్టింది. సంచలన చిత్రాల దర్శకుడి వాట్సప్ చాటింగ్ హిస్టరీని కూడా శ్రీ రెడ్డి బహిర్గతం  చేసింది.[15]

సినిమా నటుడు చిరంజీవి పేరు చెప్పుకుని టాలీవుడ్‌లో కొందరు వ్యక్తులు ఎంతో మంది ఆడవాళ్ల జీవితాలు నాశనం చేస్తున్నారని శ్రీరెడ్డి తెలిపింది. పలు చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించిన వాకాడ అప్పారావును లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా ద్వారా ఆమె ఆరోపణలు గుప్పించింది[16].

తెలుగు అమ్మాయిల భవిష్యత్ కోసమైనా ఇలాంటి అక్రమాలకు ముగింపు పలుకాలని, మహిళా సంఘాలు ఈ వ్యవహారంపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని, మరో అమ్మాయికి ఇలాంటి అన్యాయం జరుగకుండా చూడాల్సిన అవసరంఉందని ఆమె తెలియజేసారు.[17]

శ్రీరెడ్డి లీక్స్‌తో టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించిన శ్రీరెడ్డి అనూహ్య రీతిలో మద్దతును కూడగడుతోంది. పలు మహిళా సంఘాలు, ఐక్యవేదికలు శ్రీరెడ్డికి బాసటగా నిలిచారు.

సినీ ఇండస్ట్రీలో మహిళల లైంగిక వేధింపులపై శ్రీరెడ్డి పోరాటానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ ఉందంటూ గ‌ళ‌మెత్తిన న‌టి శ్రీ‌రెడ్డిని సినిమాల నుంచి బ‌హిష్క‌రిస్తూ 'మా' తీసుకున్న నిర్ణ‌యాన్ని త‌ప్పు ప‌ట్టింది జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్.. సినిమాల్లో నటించకుండా శ్రీరెడ్డిని అడ్డుకోవడం ముమ్మాటికీ ఆమె హక్కులకు భంగం కలిగించడమేనని మానవ హక్కుల కమిషన్ స్పష్టం చేసింది.[18]

ఈ నేపథ్యంలో తెలంగాణ, కేంద్ర సమాచార ప్రసారశాఖలకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని నోటీసులో ఆదేశించింది. కాగా, కేంద్ర మానవ హక్కుల కమిషన్ ను శ్రీరెడ్డి ఆశ్రయించకపోయినప్పటికీ జాతీయ మీడియాలో వ‌చ్చిన వార్త‌లు ఆధారంగా కమిషనే ఆమె కేసును సుమాటోగానే స్వీకరించింది.[19]

పనిచేసేచోట లైంగిక వేధింపుల్ని నిరోధించేందుకు తీసుకొచ్చిన చట్టాన్ని ఎందుకు అమలు  చేయడంలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ప్రశ్నించింది జాతీయ మానవ హక్కుల కమిషన్. లైంగిక వేధింపులు ఎదురైన పక్షంలో ఎవరికి ఫిర్యాదు చేయాలి?, ఎటువంటి చర్య తీసుకున్నారు?, అన్న అంశాలపై సరైన యంత్రాంగం లేకపోవడాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ తప్పుబట్టింది.[20]

క్యాష్ కమిటీ[మార్చు]

తెలుగు పరిశ్రమలో స్త్రీల పట్ల లైంగిక వేదింపుల చర్యలు పునరావృతం కాకుండా "కమిటీ అగైనెస్ట్ సెక్యువల్ హెరాస్‌మెంట్" (క్యాష్) కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు శివాజీరాజా ఏప్రిల్ 11, 2018 న జరిగిన ప్రెస్ మీట్ లో తెలిపారు. మ‌హిళా న‌టులు తాము ప‌డుతున్న ఇబ్బందుల‌ను చెప్పుకునేందుకు వీలుగా క్యాష్ క‌మిటీ ఏర్పాటు చేయాల‌ని "మా" నిర్ణయం తీసుకుంది.[21] చలన చిత్ర పరిశ్రమలో పనిచేసేవారిని సగం మందిని, ఎన్జీఓలు, ప్రభుత్వోద్యోగులను సగం మందిని కలిపి ఈ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీ ద్వారా పరిశ్రమలో పనిచేసే మహిళలకు భద్రతను కల్పించడానికి వీలవుతుంది. పరిశ్రమలో పనిచేసే మహిళ లకు ఇక్కడి వారి వల్ల లైంగిక ఇబ్బందులు ఎదురైనా, పరిశ్రమలో ఉన్నవారి వల్ల బయటి మహిళలకు వేధింపులు ఎదురైనా ఈ కమిటీకి తెలియజేయవచ్చు’’ [22]

ప్రముఖుల స్పందనలు[మార్చు]

 • శ్రీరెడ్డి అంశంపై దర్శకుడు రాంగోపాల్‌ వర్మ స్పందించారు. "వందేళ్ల కిందట సినిమా పరిశ్రమ ఆవిర్భవించిన నాటినుంచి క్యాస్టింగ్‌ కౌచ్‌ మనుగడలో ఉంది. వ్యక్తిగతంగా పలువురిపై ఆమె చేసిన ఆరోపణల జోలికి వెళ్లను కానీ.. గత వందేళ్లలో క్యాస్టింగ్‌ కౌచ్‌ దుర్మార్గాలను ఎవరూ వెలుగులోకి తీసుకురానంతగా శ్రీరెడ్డి తీసుకొచ్చింది. అందుకు ఆమెకు నా సెల్యూట్‌ సమర్పిస్తున్నా" అని వర్మ ట్వీట్‌ చేశారు. [23]

మూలాలు[మార్చు]

 1. "Who is Sri Reddy?". The Indian Express. 2018-04-07. Retrieved 2018-04-11. Cite has empty unknown parameter: |1= (help)
 2. "Exclusive biography of #SriReddy and on her life". FilmiBeat. Retrieved 2018-04-11. Cite has empty unknown parameter: |1= (help)
 3. "Sri Reddy Latest: ఏ తల్లీ చూడకూడనిది చూశా.. వినకూడనది విన్నా: శ్రీరెడ్డి తల్లి భావోద్వేగం - Samayam Telugu". samayam Telugu. 2018-04-11. Retrieved 2018-04-12.
 4. "పవన్ కళ్యాణ్ నీకు దమ్ముంటే అలా చేయి.. సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీ రెడ్డి - Social Post Telugu | DailyHunt". DailyHunt. Retrieved 2018-04-11. Cite has empty unknown parameter: |1= (help)
 5. "ఎవరు ఈ శ్రీరెడ్డి? ఎక్కడి నుంచి వచ్చింది.? ఎందుకిలా సంచలనమైంది.? చాలామందికి తెలియని ఆమె బ్యాక్ గ్రౌండ్ ఇదే..!". Ap2tg Telugu. 2018-03-28. Retrieved 2018-04-12. Cite has empty unknown parameter: |1= (help)
 6. "పడుకోకపోతే సినిమాల్లో ఛాన్సు రాదు'.. టాలీవుడ్ లో ప్రముఖులపై సంచలన ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి!! - Telugu SKY". Telugu SKY. 2018-03-13. Archived from the original on 2018-04-17. Retrieved 2018-04-11. Cite has empty unknown parameter: |5= (help)
 7. Hooli, Shekhar H. "Sri Reddy asks Pawan Kalyan to encourage Telugu heroines, discusses casting couch". International Business Times, India Edition. Retrieved 2018-04-11.
 8. "సేఫ్టీ క్రియేట్ చేయండి అంటూ ఓయూ విద్యార్థులను వేడుకున్న శ్రీ రెడ్డి".
 9. admin (2018-04-07). "Sri Reddy protests, strips at the Film Chamber". telugucinema.com. Retrieved 2018-04-11. Cite has empty unknown parameter: |1= (help)
 10. "'మా' ప్రతినిధులపై మానవ హక్కుల కమీషన్ కు ఫిర్యాదు". JANAMMANAM TELUGU. 2018-04-09. Archived from the original on 2018-04-11. Retrieved 2018-04-12. Cite has empty unknown parameter: |5= (help)
 11. "'శ్రీరెడ్డి వ్యవహారాన్ని తేల్చకుంటే 'మా'ను ముట్టడిస్తాం' -". www.andhrajyothy.com. Retrieved 2018-04-12.
 12. "MAA lifts ban against Sri Reddy". The Hindu. Special Correspondent. 2018-04-12. ISSN 0971-751X. Retrieved 2018-04-13.CS1 maint: others (link)
 13. "Sri Reddy accuses Kona Venkat of sexual harassment; writer threatens legal action - Times of India". The Times of India. Retrieved 2018-04-12.
 14. "కోన వెంకట్ నన్ను శ్మశానం వెనక్కి రమ్మన్నాడు: శ్రీరెడ్డి -". www.andhrajyothy.com. Retrieved 2018-04-12.
 15. "దగ్గుబాటి అభిరామ్ ఫోటోలు విడుదల చేసిన శ్రీరెడ్డి – Telugu Gateway". telugugateway.com. Retrieved 2018-04-12.
 16. "మరో బాంబు పేల్చిన శ్రీరెడ్డి". Sakshi. 2018-04-13. Retrieved 2018-04-13.
 17. "శ్రీరెడ్డి ప్రకంపనలు.. ప్రముఖ సినీ నిర్మాత కొడుకు ఫొటోలు లీక్.. అభిరామ్ సిగ్గుందా?". https://telugu.filmibeat.com. 2018-04-11. Retrieved 2018-04-12. Cite has empty unknown parameter: |1= (help); External link in |work= (help)
 18. "శ్రీరెడ్డి దీనిని అస్సలు ఊహించి ఉండదు.. -". www.andhrajyothy.com. Retrieved 2018-04-12.
 19. "NHRC issues notice to TS Government, I&B Ministry following Sri Reddy's protest". The Hans India. Retrieved 2018-04-12.
 20. "శ్రీరెడ్డి ఇష్యూపై NHRC : లైంగిక వేధింపులపై నోటీసులు". V6 Telugu News. 2018-04-12. Archived from the original on 2018-04-15. Retrieved 2018-04-12. Cite has empty unknown parameter: |5= (help)
 21. "శ్రీ‌రెడ్డిపై 'మా' బ్యాన్ ఎత్తివేత‌- క్యాష్ క‌మిటీ ఏర్పాటున‌కు నిర్ణ‌యం – Andhra Prabha Telugu Daily". prabhanews.com. Retrieved 2018-04-13.[permanent dead link]
 22. "చాంబర్‌ తరఫున 'క్యాష్‌' ఏర్పాటు చేస్తాం -". www.andhrajyothy.com. Retrieved 2018-04-13. line feed character in |title= at position 40 (help)
 23. "శ్రీరెడ్డి.. ఐ సెల్యూట్‌..!". Sakshi. 2018-04-12. Retrieved 2018-04-12. Cite has empty unknown parameter: |1= (help)

బయటి లింకులు[మార్చు]