శ్రీ లంకమల్లేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీ లంకమల్లేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
లంకమల వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
IUCN category IV (habitat/species management area)
అంతరించిపోతున్న కలివికోడి (జెర్డాన్స్ కోర్సర్) నెలవు, శ్రీ లంకమల్లేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
అంతరించిపోతున్న కలివికోడి (జెర్డాన్స్ కోర్సర్) నెలవు, శ్రీ లంకమల్లేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
Locationవైఎస్‌ఆర్ జిల్లా, ఆంధ్ర ప్రదేశ్, భారత దేశం
Nearest cityకడప
Area464.42 కి.మీ2 (179.31 చ. మై.)

శ్రీ లంకమల్లేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఆంధ్రప్రదేశ్, వైఎస్‌ఆర్ జిల్లాలో కడప నగరానికి దగ్గరలోగల ఒక వన్యప్రాణుల అభయారణ్యం. కలివికోడి అనే అరుదైన, అంతరిస్తున్న పక్షి ప్రపంచంలో కేవలం ఈ అడవుల్లోనే కనిపిస్తుంది. దీన్ని తొలిసారి గుర్తించిన జెర్డాన్ అనే పక్షిశాస్త్రవేత్త పేరు మీదుగా దీన్ని వ్యావహారిక ఇంగ్లీషులో జెర్డాన్స్ కోర్సర్ అంటారు. సుమారు 176 జాతుల వృక్షాలు, జంతువులు ఈ సంరక్షణ కేంద్రంలో ఉన్నాయి.[1]

భౌగోళికం

[మార్చు]
  • కడప రైల్వే స్టేషన్ నుండి రహదారి మార్గంలో 60 కి.మీ. ప్రయాణించి చేరుకోవచ్చు.

వృక్షజాలం

[మార్చు]

అభయారణ్యంలో 1400 మొక్కల జాతులు, 176 చెట్ల కుటుంబాలు ఉన్నాయి. అభయారణ్య ప్రాంతంలో లోతైన లోయలు, నిటారైన కొండలు, ఆకురాల్చు అరణ్యం ఉంది. ఇక్కడ ఎర్రచందనం, స్థానిక జాతి చెట్లు ఉన్నాయి.[2]

జంతుజాలం

[మార్చు]

అభయారణ్యం కలివికోడి లేదా "జెర్డాన్స్ కోర్సర్" పక్షులకు ప్రసిద్ధిచెందింది. దీన్ని స్థానికంగా జత పట్టీల చిటానా అనికూడా పిలుస్తారు. ఇది తీవ్రంగా అంతరించిపోతున్న పక్షిజాతికి చెందినదిగా భావిస్తున్నారు. ఈ పక్షిని మొదటిసారిగా 1848లో థామస్ సి. జెర్డాన్ చేత కనుగొనబడింది. దీనిని తిరిగి 1996లో తిరిగి ఈ ప్రాంతంలో కనుగొన్నారు.[3] ఈ పక్షి ఇప్పుడు అరుదుగా కొన్ని అరణ్య ప్రాంతాలలో, శ్రీలంక మల్లేశ్వర అభయారణ్యంలో కనిపిస్తుంది.

దీనిలో చిరుతపులి, స్లాత్ బీర్, జింక, సాంబార్, చౌసింగా, చొంకారా, నీల్గాయ్, అడవిపంది మొదలగు ప్రాణులు కూడా ఉన్నాయి.

యాత్రికులకు సమాచారం

[మార్చు]
  • వసతి సౌకర్యం: సిద్ధవటం, కడప వద్ద అటవీ శాఖ అతిథి గృహాలలో వసతి సౌకర్యం లభిస్తుంది.
  • సీజన్ : అక్టోబరు నుండి మార్చి వరకు.[4]

మూలాలు

[మార్చు]
  1. "Lankamalleswaram Wildlife Sanctuary". discoveredindia. Archived from the original on 2014-05-18.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-04. Retrieved 2016-10-24.
  3. http://zeenews.india.com/news/eco-news/endangered-jerdons-courser-on-centres-priority-list_686915.html
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-01-25. Retrieved 2016-10-24.