వట్టికూటి వెంకటసుబ్బయ్య

వికీపీడియా నుండి
(శ్రీ వట్టికూటి వెంకటసుబ్బయ్య నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

వట్టికూటి వెంకటసుబ్బయ్య (1916 -1992) గాంధేయవాది, గుంటూరు గాంధీగా ప్రసిద్ది పొందిన సమాజసేవకుడు, సర్వోదయ కార్యకర్త.

వట్టికూటి వెంకటసుబ్బయ్య
దస్త్రం:Vattikuti Venkata Subbaiah.jpg
గుంటూరు గాంధీ వెంకట సుబ్బయ్య
జననం1916 అక్టోబరు 26
గుంటూరు జిల్లా పొన్నూరు మండలం దొప్పలపూడి గ్రామం
మరణం1992
ప్రసిద్ధిసమాజ సేవకుడు
మతంహిందువు

జననం

[మార్చు]

వట్టికూటి వెంకటసుబ్బయ్య గారు గుంటూరు జిల్లా పొన్నూరు మండలం దొప్పలపూడి గ్రామాంలో ఒక వ్యవసాయ కుతుంభంలో 1916 అక్టోబరు 26 న జన్మించారు. మహాత్మా గాంధీ ప్రభోధనలతో స్పూర్తి పొందారు. గాంధీ ప్రారంభించిన గ్రామ పారిశుద్ద్యం కార్యక్రమాన్ని వీరు త్రికరణ శుద్దిగా చేపట్టారు. వీరు వ్యవసాయ పనులు చేసుకుంటూ, ప్రజాసేవా కార్యక్రమాలలో పునీతులయ్యారు. వీరు నిద్రించే సమయంలో తప్ప, తన చేతిలో ప్రతి క్షణం, పలుగు పారతో గ్రామాలలో పర్యటించేవారు. పారిశుద్యం మెరుగుదల, మురుగు కాలువలకు మరమ్మత్తులు, సాగు భూములకు వెళ్ళే డొంకల మరమ్మత్తులు నిర్వహించడం ఒక దైనందిక విధిగా మార్చుకున్నారు[1].

సమాజ సేవ

[మార్చు]

గ్రామంలో పర్యటిస్తూ రహదారి వెంట పారిశుధ్యం మెరుగు పరిచేవారు. మురుగు నీరు పారుదల లేని పక్షంలో మురుగు కాలువలకు మరమ్మత్తులు చేసేవారు. పొలాలకు వెళ్ళే డొంకలు, బళ్ళు, రైతుల రాకపోకలకు వీలుగా శుభ్రం చేసేవారు. ఇలా నిత్యం ఇవే విధులుగా, ప్రజా సంరక్షక కార్యక్రమాలు నిర్వహిస్తుండేవారు. ఆయనకు మొక్కలు పెంచటం ఎంతో ఇష్టం.మాటలు చెప్పడం, తన స్వగ్రామం దొప్పలపూడి నుండి పొన్నూరు వరకు వందలకొలది చెట్లను నాటారు. నీతులు బోధించడం,సందేశాలు ఇవ్వడం ఈ గాంధేయవాదికిఇష్టం ఉండేది కాదు. కాలక్రమేణా దొప్పలపూడి గ్రామం నుండి జిల్లా ప్రధాన కేంద్రమైన గుంటూరు నగరంలోనూ పారిశుద్య పనులు చేయటం మొదలుపెట్టారు. అంటు రోగాలు ప్రభలకుండా మురుగు కాలువలకు మరమ్మత్తులు చేపట్టేవారు.

గుంటూరు గాంధీ

[మార్చు]

మహాత్మా గాంధీ గారి సిద్ధాంతాలను ఆచరించాలనే ఆలోచనతో వెంకట సుబ్బయ్య చొక్కాను విడిచిపెట్టినారు.ఆయన భుజాన పలుగు, పార ఉంచుకునే ఒక కార్మికునిగా వీధిలోకి అడుగు పెడుతుండేవారు. నిరాడంబరగా ఒక కర్మయోగిలా ఫలితం ఆశించకుండా తన పని తాను చేసుకుంటూ సమాజానికి మార్గదర్శిగా నిలిచారు. గాంధీజీ అనుచరుడిగా వారివలే ఏక వస్త్రధారిగా సమాజసేవలో నిరంతరం తపిస్తున్న వీరిని ప్రజలు అపర గాంధీలా భావించేవారు. అలా వట్టికూటి వెంకటసుబ్బయ్య కాస్తా "గుంటూరు గాంధీ"గా పేరుపొందినారు.[2]

నేడు మనం జరుపుకుంటున్న స్వచ్చభారత్ నినాదాన్ని వీరు ఆనాడే విసృతంగా ప్రచారం చేసారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటేనే ఆరోగ్యంగా జీవించుతామని చెప్పటమే కాకుండా ఆచరణలో పెట్టి ఆదర్శంగా నిలిచారు. స్వచ్ఛభారత్ కు ఆనాటి గాంధేయవాదులు ఆదర్శ ప్రాయులు. తరువాత వీరు గుంటూరు నుండి హైదరాబాదు వెళ్ళి అక్కడ గూడా సేవాకార్యక్రమాలు చేపట్టినారు.

మరణం

[మార్చు]

వెంకట సుబ్బయ్య గారు 1992 లో తన 76వ ఏట కన్నుమూసారు. వీరు జీవితమంతా చేసినది ప్రజాసేవ కార్యక్రమాలే కావడంతో ఆయన మరణించినా అందరి మదిలో గుంటూరు గాంధీ గా చిరస్థాయిగా నిలిచి పోయారు.

గుంటూరులో వారు చేసిన సేవాకార్యక్రమాలకు గుర్తింపుగా, గుంటూరు నగర కార్పొరేషను వారు లక్ష్మీపురం ప్రధాన రహదారిలో గుంటూరు గాంధీ విగ్రహాన్ని ఏర్పాటుచేసినారు. దొప్పలపూడి గ్రామస్థులు గూడా, ఆయన స్పూర్తితో గ్రామంలో, రుద్రభూమిని అభివృద్ధి పరచడమే గాకుండా, ఆ ప్రాంతంలో ఆయన విగ్రహాన్ని గూడా ఏర్పాటుచేసినారు.గుంటూరు స్ధంభాలగరువు మహాప్రస్థానంలో ఆయన విగ్రహం నిర్మించారు. అది మనకు మన కర్తవ్యాన్ని గుర్తుచేస్తూ ఉంటాయి.

మూలాలు

[మార్చు]
  1. "Should Announce Awards on the Name of Vattikuti Venkata Subbaiah". ETV, Andhra pradesh. Retrieved 23 August 2021. {{cite web}}: |archive-date= requires |archive-url= (help)CS1 maint: url-status (link)
  2. "గుంటూరు గాంధీ". ఈనాడు గుంటూరు రూరల్,8వ పేజీ. 19 జూలై 2013.