శ్రీ శ్రీనివాసన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీ శ్రీనివాసన్
శ్రీ శ్రీనివాసన్


కొలంబియా సర్క్యూట్ జిల్లా అప్పీల్స్ యునైటెడ్ స్టేట్స్ కోర్టు జడ్జి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
మే 24, 2013
నియమించిన వారు బరాక్ ఒబామా
ముందు రేమండ్ రాండోల్ఫ్

పదవీ కాలం
ఆగష్టు 26, 2011 – మే 24, 2013
అధ్యక్షుడు బరాక్ ఒబామా
ముందు నీల్ కట్‌యల్
తరువాత ఇయాన్ గీర్‌షెన్‌గోర్న్

వ్యక్తిగత వివరాలు

జననం (1967-02-23) 1967 ఫిబ్రవరి 23 (వయస్సు 55)
చండీగఢ్, భారత దేశము
పూర్వ విద్యార్థి స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం
మతం హిందూ[1]

పద్మనాభన్ శ్రీకాంత్ "శ్రీ" శ్రీనివాసన్ (జననం: 1967 ఫిబ్రవరి 23) ఒక అమెరికన్ న్యాయవేత్త. శ్రీనివాసన్ చండీగఢ్లో జన్మించాడు. తమిళనాడు చెందిన ఈయన తల్లిదండ్రులు 1960లో అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు. ఈయన మే 2013 నుంచి కొలంబియా సర్క్యూట్ జిల్లా అప్పీల్స్ యునైటెడ్ స్టేట్స్ కోర్ట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ సర్క్యూట్ న్యాయమూర్తి.[2][3] ఈయన 2013 మే 23 న 97-0 ఓట్లతో యునైటెడ్ స్టేట్స్ సెనేట్ చే ధ్రువీకరించబడ్డాడు. న్యాయమూర్తిగా నిర్ధారణకు ముందు ఇతను యునైటెడ్ స్టేట్స్ ప్రిన్సిపాల్ డిప్యూటీ సొలిసిటర్ జనరల్, ఇతను యుఎస్ సుప్రీం కోర్ట్ ముందు 25 కేసులు వాదించారు, హార్వర్డ్ లా స్కూల్ లో ఒక లెక్చరర్ గా ఉన్నారు.

జీవితం[మార్చు]

శ్రీనివాసన్ 1967 ఫిబ్రవరి 23 న భారతదేశంలోని చండీఘర్లో జన్మించాడు. ఇతను అమెరికాలో కాన్సాస్ రాష్ట్రంలోని లారెన్స్ నగరంలో పెరిగాడు. ఈయన స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు.ఆయన తండ్రి కన్సాస్ విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్రంలో ప్రొఫెసర్. శ్రీనివాసన్ తల్లి సరోజ కన్సాస్ సిటీ ఆర్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో బోధకురాలు. శ్రీనివాసన్ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేశారు. స్టాన్‌ఫోర్డ్ లా స్కూల్, స్టాన్‌ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి లా, బిజినెస్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు[4]. జార్జి బుష్‌ హయాంలో సొలిసిటర్‌ జనరల్‌కు అసిస్టెంట్‌గా వ్యవహరించారు. సుప్రీం కోర్టు రిటైర్డ్‌ జడ్జి శాండ్రా డే ఒకానర్‌కు క్లర్క్‌గా కూడా పనిచేశారు. ఈ రంగంలోకి 1995లో అడుగుపెట్టిన శ్రీనివాసన్‌ వివిధ స్థాయిల్లో విధులు నిర్వహించారు[5].

పదవి స్వీకారం[మార్చు]

జన్మత: భారతీయుడైన 46 ఏళ్ల వ్యక్తి అయిన శ్రీ శ్రీనివాసన్ అమెరికాలో రెండవ అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా కొలువుదీరారు. శ్రీ శ్రీనివాసన్ భగవద్గీత సాక్షిగా కొలంబియా జిల్లా అప్పీల్ కోర్టు జడ్జిగా ప్రమాణస్వీకారం చేశారు. అమెరికాలో ఉన్నత న్యాయస్థానాలను అధిరోహించిన భారత సంతతి వ్యక్తులు ఇప్పటికే పలువురు ఉన్న విషయం తెలిసిందే. అయితే, శ్రీనివాసన్ అమెరికాలో రెండవ అత్యున్నత న్యాయస్థానంగా భావించే సర్క్యూట్ కోర్టు జడ్జిగా నియమితులైన తొలి భారతీయ అమెరికన్ గా చరిత్ర సృష్టించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత ప్రధాని మన్మోహన్ సింగ్ భార్య శ్రీమతి గురుశరణ్ కౌర్, పలువురు న్యాయమూర్తులు హాజరయ్యారు. శ్రీనివాసన్ చండీగఢ్లో జన్మించారు. 1970లలో ఆయన తల్లిదండ్రులు అమెరికా వలసవెళ్లారు[6].

మూలాలు[మార్చు]

  1. "Sri Srinivasan sworn in as judge of top US court". The Hindu. September 27, 2013. Retrieved February 14, 2016.
  2. Huisman, Matthew (August 26, 2011). "Srinivasan Leaving O'Melveny to Become Deputy Solicitor General". The Blog of Legal Times. Archived from the original on 2016-01-31. Retrieved August 27, 2011.
  3. President Obama Nominates Two to Serve on the U.S. Court of Appeals for the District of Columbia Circuit. Office of the White House Press Secretary. June 11, 2012.
  4. "అమెరికా సుప్రీంకోర్టు జడ్జి రేసులో ఎన్ఆర్ఐ ముందంజ". apdunia.com. Archived from the original on 2016-02-15. Retrieved 2016-02-15.
  5. "అమెరికా సుప్రీం కోర్టు జడ్జిగా శ్రీనివాసన్‌!". andhrajyothy.com. Archived from the original on 2016-02-15. Retrieved 2016-02-15.
  6. "అమెరికా న్యాయపీఠంపై భారతీయుడు". lokahitham.net. Archived from the original on 2016-02-15. Retrieved 2016-02-15.
  • సాక్షి దినపత్రిక - 15-02-2016 (అమెరికా 'సుప్రీం' జడ్జిగా శ్రీనివాసన్! - అవకాశం లభిస్తే తొలి ఇండో-అమెరికన్‌గా గుర్తింపు)