Jump to content

శ్రీ సనాతన హిందూ మందిరం (లండన్)

వికీపీడియా నుండి
శ్రీ సనాతన హిందూ మందిరం (లండన్)
శ్రీ సనాతన హిందూ మందిరం (లండన్)
స్థానం
దేశం:యునైటెడ్ కింగ్ డమ్
జిల్లా:గ్రేటర్ లండన్
ప్రదేశం:వెంబ్లీ, లండన్
ఎత్తు:20 మీ. (66 అ.)
నిర్మాణశైలి, సంస్కృతి
నిర్మాణ శైలి:వైదిక
శాసనాలు:వాసుదేవ్ కుటుంబకం
చరిత్ర
నిర్మాత:శ్రీ వల్లభ నిధి

శ్రీ సనాతన హిందూ మందిరం, లండన్‌లోని రెండు హిందూ దేవాలయాలు. ఒకటి బ్రెంట్‌, వెంబ్లీలోని ఈలింగ్ రోడ్‌కి దూరంగా, మరొకటి వాల్‌థమ్‌టోన్‌లోని విప్స్ క్రాస్‌లో ఉన్నాయి. శ్రీ వల్లభ నిధి యుకె అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈ మందిరాలు నడుపబడుతున్నాయి.[1] ఈ దేవాలయాలు సనాతన ధర్మాన్ని ( హిందూమతం ) అనుసరిస్తాయి.[2]

లేటన్‌స్టోన్ దేవాలయం

[మార్చు]

లేటన్‌స్టోన్‌లోని దేవాలయాన్ని శ్రీనాథ్‌జీ మందిరం అని పిలుస్తారు. 1980 జూన్ లో ఈ దేవాలయం ప్రారంభించబడింది. ఇందులో శ్రీరామ్, శ్రీనాథ్‌జీ, శివ పరివారం, అంబా మాతాజీ, జలరామ్ బాపా, హనుమంతుడు దేవతామూర్తులు ఉన్నారు.[3]

లేటన్‌స్టోన్‌లోని అసలు దేవాలయం

వెంబ్లీ దేవాలయం

[మార్చు]

2010లో ప్రారంభించబడిన ఈ దేవాలయ నిర్మాణానికి 14 సంవత్సరాల కాలం పట్టింది. భారతదేశం నుండి తీసుకొచ్చిన సున్నపురాయితో ఈ దేవాలయం నిర్మించబడింది.[4] ఇది 2.4 ఎకరాల (9,700 చ.మీ.) విస్తీర్ణంలో ఉంది.[5] ఈ దేవాలయానికి సంబంధించిన అనేక భాగాలు గుజరాత్‌ రాష్ట్రం సోలా పట్టణంలో చెక్కబడ్డాయి. పాలరాతితో 41 దేవతల విగ్రహాలు తయారు చేయబడ్డాయి. ఎత్తైన ప్రదేశంలో, 66 అడుగుల (20మీ) ఎత్తులో ఈ దేవాలయం ఉంది.[6] వినాయకుడు, సహజానంద స్వామి, అంబా మాతాజీ, సిమంధర్ స్వామి, రాధా కృష్ణ, శ్రీరామ్ దర్బార్, శ్రీనాథ్‌జీ, తిరుపతి బాలాజీ, శివపరివార్, జలరామ్ బాపా, హనుమంతుడు మొదలైన దేవతలు ఇక్కడ కొలువై ఉన్నారు.

మూలాలు

[మార్చు]
  1. "Welcome to Shri Vallabh Nidhi UK". Shri Vallabh Nidhi UK. Archived from the original on 2017-10-05. Retrieved 2022-05-09.
  2. "Sanatan Dharma". Shri Vallabh Nidhi UK. Archived from the original on 2018-01-06. Retrieved 2022-05-09.
  3. "Leytonstone temple". Shri Vallabh Nidhi UK. Archived from the original on 2018-01-02. Retrieved 2022-05-09.
  4. Nye, Catrin (2010-05-31). "New £16m Hindu temple opens in Wembley". BBC News.
  5. "New syncretic temple opens in London". The Hindu.
  6. "Wembley temple". Shri Vallabh Nidhi UK.