Jump to content

శ్రీ సరస్వతి క్షేత్రం (అనంతసాగర్)

అక్షాంశ రేఖాంశాలు: 18°12′21″N 78°59′17″E / 18.20583°N 78.98806°E / 18.20583; 78.98806
వికీపీడియా నుండి
(శ్రీ సరస్వతి క్షేత్రము,అనంతసాగర్ నుండి దారిమార్పు చెందింది)
శ్రీ సరస్వతీ క్షేత్రము,అనంతసాగర్
శ్రీ సరస్వతీ క్షేత్రము,అనంతసాగర్ is located in Telangana
శ్రీ సరస్వతీ క్షేత్రము,అనంతసాగర్
శ్రీ సరస్వతీ క్షేత్రము,అనంతసాగర్
భౌగోళికాంశాలు:18°12′21″N 78°59′17″E / 18.20583°N 78.98806°E / 18.20583; 78.98806
పేరు
స్థానిక పేరు:శ్రీ సరస్వతీ క్షేత్రము,అనంతసాగర్, మెదక్ జిల్లా
స్థానం
దేశం:భారత దేశము
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:సిద్దిపేట జిల్లా
ప్రదేశం:అనంతసాగర్, సిద్దిపేట డివిజన్
నిర్మాణశైలి, సంస్కృతి
ప్రధానదైవం:సరస్వతి
చరిత్ర
కట్టిన తేదీ:
(ప్రస్తుత నిర్మాణం)
మే 2,1980
నిర్మాత:శ్రీ అష్టకాల నరసింహ రామ శర్మ (అష్టావధాని)

శ్రీ సరస్వతీ క్షేత్రం, తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట డివిజనుకు చెందిన చిన్న కోడూర్ సమీపంలోని "అనంతసాగర్" వద్ద గల దేవాలయం.[1]

ఇచటి ప్రధాన దైవం సరస్వతి. ఈ ఆలయ శంకుష్టాపన (1980 మే 2న) రౌద్రినామ సంవత్సరం వైశాఖ మాసంలో ప్రముఖ అష్టావధాని అష్టకాల నరసింహరామశర్మచే, 1990 జనవరి 31న మాఘశుద్ధ పంచమి రోజున ప్రతిష్ట జరిగింది. ఈ దేవాలయం సిద్దిపేట నుండి కరీంనగర్ మధ్యలో కొలువై ఉంది. ఇది హైదరాబాదు నుండి 125 కి.మీ దూరంలోనూ, మెదక్ నుండి 63 కి.మీ దూరం లోనూ ఉంది.

ఆలయ ముఖ దృశ్యం

ఆలయ చరిత్ర

[మార్చు]

ఈ దేవాలయం అష్టావధాని అష్టకళ నరసింహ రామ శర్మ చే నిర్మింపబడింది.అతను ఉపాధ్యాయినిగా పనిచేసారు.అతను ఈ ఆలయ నిర్మాణానికి విరాళాలు సేకరించి, వాస్తుశాస్త్ర, జ్యోతిష నిపుణులు అయినందున అతని జీతభత్యాల కూడా వెచ్చించి ఈ ఆలయం నిర్మాణం చేశారు. భారత దేశంలో సరస్వతి ఆలయాలు అరుదుగా ఉంటాయి. మొదటి సరస్వతి దేవాలయం భారత దేశంలోని వైష్ణవి దేవాలయం. ఇది జమ్మూ, కాశ్మీరు రాష్ట్రంలో ఉంది. రెండవ ఆలయం బాసరలో ఉంది. ఈ దేవాలయం మూడవ దేవాలయంగా ప్రసిద్ధి పొందింది. ఈ దేవాలయం అనంతసాగర్ గ్రామంలో శివారు కొండలపై ఉంది. ఈ దేవాలయం సరస్వతి విగ్రహం సరస్వతి దేవి నిలుచున్న భంగిమలో గల ప్రసిద్ధ దేవాలయం.

పండుగలు

[మార్చు]

సరస్వతి పూజ వైదిక కాలెండరు ప్రకారం మాఘ మాసంలో ఐదవ రోజున జరుపుతారు. (ఈ రోజును వసంత పంచమి అని కూడా అంటారు.)

భారతదేశంలో అనేక ప్రాంతాలలో ప్రత్యేకంగా దక్షిణాదిన సరస్వతీ పూజలను నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జరుపుతారు. సరస్వతి దేవిని శక్తి రూపంగా నవరాత్రి ఉత్సవాలలో 9 వ రోజున జరుపుతారు. నవరాత్రిలో ఆఖరి మూడురోజులు దేవతకు అంకితం చేస్తారు. నవరాత్రులలో పదవ రోజు మహార్నవమి. ఈ రోజును శరత్ నవరాత్రి అంటారు. ఈ రోజున పుస్తకాలు, సంగీత వాద్యాలు సరస్వతి దేవి ముందు ఉంచి సరస్వతి దేవిని కొలుస్తారు. ఈ నవరాత్రి ఉత్సవం పదవరోజు జరిగే విజయదశమి రోజుతో ముగుస్తుంది.

సరస్వతి దేవాలయాలు

[మార్చు]

సరస్వతి ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి. వాటిలోకొన్ని,

*దక్షిణ కాశి, త్రిలింగ క్షేత్రం కాళేశ్వరం లో వ్యాసుడు ప్రతిష్ఠించిన పురాతన మహాసరస్వతీ దేవి కొలువై ఉంది. కాశ్మీరు, బాసర, కాళేశ్వరంలోని సరస్వతీ మూర్తులు అత్యంత ప్రాచీనమైనవి.[2]

  • సరళ దేవాలయం, జంఖడ్, కటక్ జిల్లా, ఒడిషా
  • సరస్వతి దేవాలయం, బాసర, తెలంగాణ
  • వర్గల్ సరస్వతి దేవి ఆలయం.
  • శృంగేరి సరస్వతి దేవాలయం, చిక్‌మగళూర్ జిల్లా, కర్ణాటక.
  • పుష్కర్, ఆజ్మీర్ జిల్లా, రాజస్థాన్.
  • తిరువారూర్, తిరువారూర్ జిల్లా, కేరళ,
  • సరస్వతి అమ్మన్, తిరునెల్వెల్లి, తమిళనాడు.
  • శారదా పీఠం, జమ్మూ, కాశ్మీర్.
  • భద్రకాళి దేవాలయం, నేపాల్,

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-04-25. Retrieved 2018-10-21.
  2. "Gmail". accounts.google.com. Retrieved 2025-04-09.

వెలుపలి లంకెలు

[మార్చు]