శ్రీ సునామా జకినీ మాతా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శ్రీ సునామా జకిని అమ్మవారు ఆరెకటిక కులములో ఆరాధ్య దైవముగా కొలువబడుతున్నది.

శ్రీ సునామా జకినీ మాతా
శ్రీ సునామా జకినీ మాతా శ్రీ సునామా జకినీ మాతా ఆలయం, గుత్తి
శ్రీ సునామా జకినీ మాతా
శ్రీ సునామా జకినీ మాతా ఆలయం, గుత్తి
శ్రీ సునామా జకినీ మాతా is located in Andhra Pradesh
శ్రీ సునామా జకినీ మాతా
శ్రీ సునామా జకినీ మాతా
ఆంధ్రప్రదేశ్ లో ఉనికి
భౌగోళికాంశాలు :15°09′16″N 78°35′07″E / 15.154323°N 78.58522°E / 15.154323; 78.58522Coordinates: 15°09′16″N 78°35′07″E / 15.154323°N 78.58522°E / 15.154323; 78.58522
ప్రదేశము
దేశము:భారతదేశం
రాష్ట్రం:ఆంధ్రప్రదేశ్
జిల్లా:అనంతపురం జిల్లా
స్థానికం:గుత్తి
నిర్మాణ శైలి మరియు సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :హిందూ నిర్మాణ శైలి
ఇతిహాసం
వెబ్ సైట్:http://www.sunama-jakini.com

జీవిత చరిత్ర[మార్చు]

శ్రీ సునామా జకీనీ అమ్మవారు పిన్నేపల్లి గ్రామము, యాడికి మండలం, తాడిపత్రి తాలుకా, అనంతపురం జిల్లా లో సూర్యవంశి ఆరెకటిక కులము లోని మల్కారి గోత్రములో జన్మించినది. యుక్త వయస్సు రాగానే ఆమెను యాడికి గ్రామములో హనుమంతకారి గోత్రపు శ్రీ తాంజీరావు గారితో పెళ్ళి జరిగినది. ఆమె ఎప్పుడూ దైవ భక్తి తో ఎక్కువ సమయం ఉపవాసాలు చేస్తుండెను. ఒక పర్యాయము ఎక్కువ ఉపవాసముతో గడిపినందుచే మూర్చపోగా, ఆమె భర్త బాగా త్రాగిన మత్తులో చనిపోయినదిగా నిర్ధారణ చేసి అంత్యక్రియలకు ఉత్తర్వు ఇచ్చినాడట. అంత్యక్రియలు చేయుటకు ముందు అమ్మవారు చేయి కదిపినట్టు గ్రామస్తులు కనుగొని, అమ్మవారు బ్రతికే ఉందని చెప్పగా అందుకు ఆమె భర్త ఒప్పుకొనక పూడ్చుటకు ఉత్తర్వు ఇవ్వగా, పూడ్చటం జరిగినది. అంటే ఆమె జీవసమాధి అయ్యింది అని అర్థం. ఆమె 1803 సం|| లో సమాధి అయి ఉండవచ్చని అంచనా.

పిన్నేపల్లి గ్రామములో అమ్మవారి తల్లి, తండ్రి, మరియు సోదరులు విషయము తెలుసుకొని యడికి గ్రామమునకు వచ్చి బాధతో అల్లునిపై విరుచుకొనిపడగా, ఆమె భర్త, అందరూ సమాధి దగ్గరకు వెళ్ళి ఎడ్చండి నా దగ్గర ఎందుకు ఎడ్చుతారు అని చెప్పెను. వారు సమాధి దగ్గరకు వెళ్ళి చూడగా సమాధి పై మంచి సువాసన గల తెల్లటి పుష్పపు మొగ్గలు కనబడెనట. అమ్మవారి చెల్లెలు శ్రీ మలకుమా జకినీ మాతా ని తన భర్త కిచ్చి రెండవ వివాహము చెయమని అమ్మవారి వాక్కు వచ్చినదట. అందుకు అంగీకరించకపోగా వారందరి నాలుకలు కుక్క నాలికలు గా వ్రేలాడటం జరిగినదట. వారు తమ తప్పుని తెలుసుకొని క్షమాపణ వేడి శ్రీ మలకుమా జకినీ కిచ్చి వివాహము చేయుటకు అంగీకరించినందున వారి నాలుకలు యధాప్రకారము అయినవట. శ్రీ మలుకుమా జకిని అమ్మవారికి, తాంజీరావు గారితో రెండవ వివాహము జరిపించారు.

ఆనాటి నుండి శ్రీ సునామా జకిని అమ్మవారు ఆరెకటిక కులములో ఆరాధ్య దైవముగా కొలువబడుతున్నది.

దేవాలయ చరిత్ర[మార్చు]

గుత్తి మండలం లో 22-02-2002 వ తేదీన అమ్మవారి దేవాలయం శంకుస్థాపన జరిగినది. 14-02-2003 వ తేదీన ప్రాణ ప్రతిష్థ జరుపబడెను. రెండవ వార్షికోత్సవం అనగా 17-02-2005 నుండి 18-02-2005 వ తేదీన దేవాలయ శిఖర స్థాపన జరిగినది. ఆనాటి నుండి ప్రతి సంవత్సరం మాఘమాసము లోని రెండవ గురు మరియు శుక్రవారము రోజున ఆలయ వార్షికోత్సవం నిర్వహించబడుచున్నది.

బయటి ప్రదేశాల నుండి దర్షనానికి వచ్చిన యాత్రికులకు బసచేయటానికి వసతి సౌకర్యం కూడా కలదు.

మూలాలు[మార్చు]

  • "Sunama Jakini Maata annual celebrations 2017". Published in Sakshi daily news paper on 11-Feb-2017.