షంసుద్దీన్ అల్తమష్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
షంసుద్దీన్ అల్తమష్
ఢిల్లీ సుల్తాను
Tomb of Iltutmish, Qutb Minar complex, Mehrauli.jpg
అల్తమష్ సమాధి (మక్బరా)
పాలనాకాలం 1210–1236
పూర్తి పేరు షంసుద్దీన్ అల్తమష్
బిరుదములు నాసిర్ అమీరుల్ మూమినీన్
మరణం May 1, 1236
మరణ స్థలం Delhi
సమాధి స్థలం కుతుబ్ కాంప్లెక్స్, మెహ్రోలీ, ఢిల్లీ
ముందు వారు అక్రం షాహ్
తర్వాత వారు రుకునుద్దీన్ ఫిరోజ్
Issue నాసిరుద్దీన్ మహమూద్, రుకునుద్దీన్ ఫిరోజ్, రజియా సుల్తానా, మొయిజుద్దీన్ బహ్రామ్
రాజ్యం మమ్లూక్
మత విశ్వాసాలు ఇస్లాం

షంసుద్దీన్ అల్తమష్ (Shams-ud-din Iltutmish) (Hindi: अलतामश/AlTaMash/Iltutmish)(Persian شمس الدین التتمش) (r. 1211–1236)బానిస వంశానికి చెందిన ఒక రాజు. టర్కిక్ మూలాలు గలవాడు.[1] ఇతను కుతుబుద్దీన్ ఐబక్ యొక్క బానిస. తరువాత ఐబక్ ఇతడిని తన అల్లుడిగా చేసుకున్నాడు. బదాయూన్ గవర్నర్ గా నియమింపబడ్డాదు. ఐబక్ సంతానమైన అరం షాహ్ కు బదులుగాఅ 1211 లో ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించాడు. ఇతడు రాజధానిని లాహోరు నుండి ఢిల్లీ కి మార్చాడు. మే నెల 1, 1236 వరకు సుల్తానుగా మరణించేతవరకు వున్నాడు. అల్తమష్, ఢిల్లీ సల్తనత్ కాలంలో వెండి "టంకా" నాణేలను, రాగి "జీతాల్" నాణేలను మూల నాణేలుగా ప్రవేశపెట్టాడు. తన సామ్రాజ్యాన్ని "ఇక్తా"లుగా విభజించి "ఇక్తాదారీ" విధానాన్ని ప్రవేశపెట్టాడు, వీటికి అమీరులుగా అధికారులను జీతాలపై నియమించాడు.

ఇతను మెహ్రౌలీ లో 1230 లో హౌజ్ ఎ షంసీ అనే జలాశయాన్ని నిర్మించాడు, అలాగే దీనినానుకును "జహాజ్ మహల్" నిర్మించాడు. 1231లో ఇతడు ఢిల్లీలో తన కుమారుడైన నసీరుద్దీన్ మహ్మూద్ యొక్క "సుల్తాన్ ఘరీ" సమాధిని (ఢిల్లీ లో ఇస్లామీయ శైలిలో గల తొలి సమాధి), తన స్వీయ సమాధిని (కుతుబ్ కాంప్లెక్స్ లో కలదు) నిర్మించాడు.

అంతర్గత కలహాలను అణచివేశాడు, ఢిల్లీ సల్తనత్ ను స్థిరపరచాడు. కుతుబ్ మీనార్ నిర్మాణాన్ని పూర్తిగావించాడు.

మంగోలుల నుండి రక్షణ[మార్చు]

అల్తమష్ కాలంలో ఢిల్లీ సల్తనత్ విస్తరణ.

1221 లో మంగోలుల నాయకుడైన చెంఘీజ్ ఖాన్ దురాక్రమణ నుండి అల్తమష్ తన రాజకీయ చతురత వలన, భారత్ వైపు దండయాత్ర జరుగకుండా చూసుకున్నాడు.[2]

మరణము మరియు వారసులు[మార్చు]

1236 లో మరణించాడు. ఇతడి సమాధి ఢిల్లీ మెహ్రౌలీ లోని "కుతుబ్ కాంప్లెక్స్" లో గలదు.[3] తన వారసురాలిగా రజియా సుల్తానా ను ప్రకటించాడు.

నాణెములు[మార్చు]

తొలి ఘోరీ పాలకులు, రాజపుత్ర నాణెముల విధానాన్నే పాటించారు, దీని ప్రకారం "హిందూషాహీ" విధానంలో ఎద్దు-గుర్రపురౌతు బొమ్మ నాణేలపై వుండేది.[4] వెండి "టంకా" నాణేలు ప్రవేశపెట్టాడు. ఆతరువాత టంకా రూపాయి గా మార్పు చెందినది.[5][6]

ఇవీ చూడండి[మార్చు]

పాదపీఠికలు[మార్చు]

  1. Faith & philosophy of Hinduism, Rajeev Verma, 2009, page 27
  2. Chandra 2004, p. 40
  3. Ikram 1966, p. 52
  4. Blanchard 2005, p. 1263-64
  5. Blanchard 2005, p. 1264-65
  6. Wink 1997, p. 155

మూలాలు[మార్చు]

అంతకు ముందువారు
Aram Shah
Sultan of the Mamluk Dynasty
1211–1236
తరువాత వారు
Rukn ud din Firuz
అంతకు ముందువారు
Aram Shah
Sultan of Delhi
1211–1236
తరువాత వారు
Rukn ud din Firuz