Jump to content

షకీల్ బదాయూనీ

వికీపీడియా నుండి
షకీల్ బదాయూనీ
Shakeel Badayuni
పుట్టిన తేదీ, స్థలం(1916-08-03)1916 ఆగస్టు 3
బదాయున్, ఉత్తర ప్రదేశ్,
India
మరణంఏప్రిల్ 20, 1970 (aged 53)
వృత్తికవి
జాతీయతIndian
రచనా రంగంగజల్
విషయంప్రేమ

పాత హిందీ పాటలలో గజల్ శైలిని అనుసరిస్తూ, కొద్దిగా సినిమాలకు అనుగుణంగా మార్చుకుంటూ, ఉర్దూ సొగసులను అద్దుతూ పాటలు రాసినవారు చాలా మంది ఉన్నారు. అందుకే పాత హిందీ పాటల మాధుర్యం ఎన్నిసార్లు విన్నా తనివితీరదు. పదే పదే వినాలనిపిస్తుంది. గజల్ ప్రక్రియను సినిమాపాటకు ప్రతిభావంతంగా వాడుకున్న కవుల్లో షకీల్ బదాయూని పేరు ముందుగా చెప్పుకోవాలి.

జీవిత సంగ్రహం

[మార్చు]

ఆగస్టు 3, 1916లో పుట్టిన షకీల్ ఉర్దూ సాహిత్యంలోను, హిందీ సినిమారంగంపైన కూడా తనదైన ముద్రవేసిన కవి. షకీల్ విద్యాభ్యాసం ఇంటివద్దనే జరిగింది. అరబిక్, పర్షియన్, ఉర్దూ, హిందీ భాషలు ఇంటివద్దకు వచ్చి టీచర్లు బోధించారు. ఆయన తండ్రి జమాల్ అహమద్ ఖాదర్ సోక్తా ఖాద్రీ తన కుమారుడు కవి కావాలని ఎన్నడూ అనుకోలేదు. నిజం చెప్పాలంటే ఆ వంశంలో కవులెవ్వరు లేరు. కవిత్వాన్ని సంప్రదాయిక ముస్లిమ్ కుటుంబాల్లో ఎలా ఆదరిస్తారో అంతకు మించి కవిత్వం వారికి సంబంధమూ లేదు. షకీల్ దూరపు బంధువు జియావుల్ ఖాద్రీ బదయూని ధార్మికమైన కవితలు కొన్ని రాశారు. ఆయన ప్రభావం కొంతవరకు షకీల్ పై ఉండవచ్చు. యాభై, అరవై దశకాల్లో షకీల్ రాసిన పాటలు, ఉర్దూలో ఆయన కవిత్వం దేశాన్ని ఒక్క ఊపు ఊపాయి. ముఖ్యంగా సంగీత దర్శకుడు నౌషాద్ తో కలిసి షకీల్ పనిచేసేవారు. 1961 నుంచి 1963 వరకు షకీల్ వరుసగా మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులు గెలుచుకున్నాడు. ఆ పాటలు వింటే ఇప్పటికి కూడా మనం చెవికోసుకు వింటాం. బీస్ సాల్ బాద్ సినిమాలో – కహీం దీప్ జలే కహీం దిల్, ఘరానా సినిమాలో – హుస్న్ వాలే తేరా జవాబ్ నహీం, చౌదివీం కా చాంద్ సినిమాలో – చౌదివీం కా చాంద్ హో పాటలు అప్పుడే కాదు ఇప్పుడు, ఎప్పుడూ కూడా హాట్ ఫేవరేట్స్.

షకీల్ 1936లో అలీగఢ్ ముస్లిమ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు. అప్పటి నుంచే కవిసమ్మేళనాల్లో (ముషాయిరా) పాల్గొనడం, అవార్డులు గెలుచుకోవడం మొదలయ్యింది. 1940లో సల్మాను పెళ్ళి చేసుకున్నాడు. షకీల్ పుట్టింది ఉత్తరప్రదేశ్ లోని బదాయూన్ గ్రామంలో. అందుకే తన పేరు చివర బదయూని అని పెట్టకున్నాడు. 1942లో అలీగఢ్ నుంచి బి.ఏ పట్టా పొందగానే సప్లయి ఆఫీసర్ గా ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం కోసం ఢిల్లీకి మకాం మారాడు. ఢిల్లీలో కూడా ముషాయిరాల్లో పాల్గొనడం కొనసాగింది. అప్పటికే ఆయన కవితలు ప్రాచుర్యం పొందాయి. నిజానికి అప్పట్లో ప్రేమకవిత్వం రాసినవాళ్ళు తక్కువ. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం రాయడమే ఎక్కువగా ఉన్న రోజులవి. కాని షకీల్ దారి వేరు. షకీల్ రాసింది ఎక్కువగా ప్రేమకవిత్వమే.. ఆయన కేవలం సినిమా పాటలు మాత్రమే రాయలేదు. ఆయన రాసిన గజళ్ళు ఉర్దూ కవితాభిమానుల నాలుకలపై నాట్యం చేస్తున్నాయి.

చిక్కనైన ప్రేమ కవిత్వం. భగ్న ప్రేమను షకీల్ అత్యంత అద్భుతంగా వ్యక్తం చేశాడు. ముఖ్యంగా చివరి ద్విపద … నూరేళ్ళు బతకాలని దీవించడం మామూలే కదా.. దువా అంటే ప్రార్థన.. ఆనందంగా బతకాలన్న ప్రార్థనలు షకీల్ కూడా చాలా విన్నాడు. కాని విషాదాలు ఎదురైన తర్వాత.. అంటే ప్రేమ భగ్నమైన తర్వాత ఈ ఆశీర్వాదాల ప్రభావం చూసి ఏడుస్తున్నానంటున్నాడు. మనసు పారేసుకున్నా ప్రేమ దొరకలేదు, విధిరాతనే పోగొట్టుకున్నాను అని బాధపడుతున్నాడు. ప్రేమ ఒక గొప్ప కలను చూపించింది. కాని మెలకువ వచ్చిన తర్వాత కలకు అర్ధం తెలిసి ఏడుపు వచ్చిందని చెబుతున్నాడు. భగ్న ప్రేమను షకీల్ వ్యక్తం చేసిన తీరులో ఎంత భావుకత ఉంది.

బారహా ఆప్కీ హర్ బాత్ పే రోనా ఆయా… అన్న పాత హిందీ పాట చాలా మంది వినే ఉంటారు. సాహిర్ లూధియాన్వి రాసిన ఈ పాట కూడా భావంలో దీనికి దగ్గరగానే ఉంటుంది.

పురస్కారాలు

[మార్చు]

ప్రభుత్వ గుర్తింపు

[మార్చు]

భారత ప్రభుత్వం షకీల్ బదాయూనీ గౌరవార్ధం 2013 మే 3 తేదీన ఒక తపాలాబిళ్ళను విడుదల చేసింది.[1]

మూలాలు

[మార్చు]
  1. "India Post honours 50 iconic film personalities". May 4, 2013. Fundoofun.com. Archived from the original on 2013-12-12. Retrieved December 7, 2013.

ఇతర లింకులు

[మార్చు]