ప్రాచీన సంఖ్యా విధానము
ఇపుడు వాడుకలోనున్న అంకెలను గురించి, వాటి పుట్టుపూర్వోత్తరముల గురించి తెలిసికొనుట మనకు చాలా ఆసక్తి కలిగిస్తుంది. నేటి అంకెలు మన ప్రాచీన భారతీయులు ఉపయోగించిన లిపి నుండి, అరబ్బు అంకెల నుండి రూపొందాయి. ప్రాచీన భారతీయులు సంఖ్యా క్రమ విధానాన్ని దశ గుణాంక క్రమము అంటారు. ప్రతి స్థానము పది రెట్లు చొప్పున పెరుగుతూ ఉంటుంది.[1]
స్థానాల పేర్లు
[మార్చు]స్థానముల పేర్లు | ఘాత రూపం | విస్తరణ రూపం |
ఏకము | 100 | 1 |
దశ | 101 | 10 |
శతం, వంద, నూరు | 102 | 100 |
సహస్రం, వెయ్యి | 103 | 1,000 |
ఆయుతము (దశ సహస్రము) | 104 | 10,000 |
నియుతము (లక్ష) | 105 | 1,00,000 |
ప్రయుతము (దశ లక్ష) | 106 | 10,00,000 |
కోటి | 107 | 1,00,00,000 |
దశ కోటి, పదికోట్లు | 108 | 10,00,00,000 |
శత కోటి, వందకోట్లు, బిలియను | 109 | 1,00,00,00,000 |
వెయ్యి కోట్లు | 1010 | 10,00,00,00,000 |
అర్బుదం, నిఖర్వం | 1011 | 1,00,00,00,00,000 |
మహార్బుదం, న్యర్బుదం | 1012 | 10,00,00,00,00,000 |
ఖర్వం | 1013 | 1,00,00,00,00,00,000 |
మహాఖర్వం | 1014 | 10,00,00,00,00,00,000 |
పద్మం | 1015 | 1,00,00,00,00,00,00,000 |
మహాపద్మం | 1016 | 10,00,00,00,00,00,00,000 |
క్షోణి | 1017 | 1,00,00,00,00,00,00,00,000 |
మహాక్షోణి | 1018 | 10,00,00,00,00,00,00,00,000 |
శంఖం | 1019 | 1,00,00,00,00,00,00,00,00,000 |
మహాశంఖం | 1020 | 10,00,00,00,00,00,00,00,00,000 |
క్షితి | 1021 | 1,00,00,00,00,00,00,00,00,00,000 |
మహాక్షితి | 1022 | 10,00,00,00,00,00,00,00,00,00,000 |
క్షోభం | 1023 | 1,00,,00,00,00,00,00,00,00,00,00,000 |
మహాక్షోభం | 1024 | 10,00,00,00,00,00,00,00,00,00,00,000 |
నిధి | 1025 | 1,00,00,00,00,00,00,00,00,00,00,00,000 |
మహానిధి | 1026 | 10,00,00,00,00,00,00,00,00,00,00,00,000 |
పర్వతం | 1027 | 1,00,00,00,00,00,00,00,00,00,00,00,00,000 |
పదార్థం | 1028 | 10,00,00,00,00,00,00,00,00,00,00,00,00,000 |
అనంతం | 1029 | 1,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,000 |
సాగరం | 1030 | 10,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,000 |
అవ్యయం | 1031 | 1,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,000 |
అచింత్యం | 1032 | 10,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,000 |
అమేయం | 1033 | 1,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,000 |
1034 | 10,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,000 | |
భూరి | 1035 | 1,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,000 |
మహాభూరి | 1036 | 10,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,000 |
వృదం | 1037 | 1,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,000 |
మహావృందం | 1038 | 10,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,000 |
ఈ విధంగా స్థాన భెదాల చేత సంఖ్యలను తెలిపెటప్పుడు కొన్ని స్థానాలలో అంకెలేవీ లేకపోవచ్చును. అంకెలు లేని చోట్ల సున్నలు వ్రాయాలి. క్రీస్తు మరణించిన ఐదేండ్లకు ఈనాటి దాకా వాడుకలో నున్న అంకగణిత విధానాన్ని మన భారతదేశంలో కనుగొన్నారు. ఈ కాలంలో భారతదేశం విజ్ఞాన శాస్త్రాలకు పట్టు గొమ్మగాగణిత శాస్త్రానికి స్వర్ణయుగంగా భాసిల్లింది. దీనికి కారణం ఆర్యభట్టు, వరాహమిహిరుడు వంటి గణిత శాస్త్రవేత్తలు. మన పూర్వులు అధర్వణ వేదం లో అనేక గణిత సమస్యలను చర్చించారు. వాటిని అభ్యాసం చేసినచో అనేక క్లిష్టమైన గణిత సమస్యలనైనా సులభంగా గణించవచ్చు. భారతీయ గణిత విధానాన్ని గణిత శాస్త్రవేత్తలే కాక వ్యాపారస్తులు కూడా అభివృద్ధి చేశారని అంటారు. వారు ప్రతి దశాంశ స్థాయిలోను అంకెలను ఉపయోగించి ఖాళీలలో చుక్కలు పెట్టేవారట. తరువాత ఆ చుక్కలను తొలగించి సున్న ప్రవేశించింది. సా.శ800 ప్రాంతాలలో భారతీయ వర్తకులు బిడారులలో వర్తకం చేస్తూ పోయినపుడు బాగ్దాదు వారికి అరబ్బుల పాలనలో ఉన్న స్పెయిన్ కు చేరింది. యూదు పండితుల రచనల ద్వారా ఈ విధానం ఐరోపా దేశానికి ప్రవేశించింది.
- గణిత శాస్త్రము విజ్ఞానమునకు తోడు వినోదాన్ని అందించుననుతకు సందేహం లేదు. గణిత సమస్యలు సాధించుటలో మెదదుకు మేత కలిగించి పిల్లల మనోవికాసమును పెంపొందుంచును.
మూలాలు
[మార్చు]- ↑ Vemuri, V. Rao (Oct 2003). Telugu English Dictionary (in ఇంగ్లీష్). Asian Educational Services. ISBN 978-81-206-1637-0.