షి టీమ్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
షి టీమ్స్
She Teams Logo.jpg
నినాదంఎల్లప్పుడూ... మీ కొరకు... మీతో...
ఏజెన్సీ అవలోకనం
ఏర్పడిన తేదీఅక్టోబరు 24, 2014 (2014-10-24) (4 years ago)
అధికార పరిధి నిర్మాణం
అధికార పరిధి వ్యవహారాలుహైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
చట్టబద్దమైన అధికార పరిధితెలంగాణ రాష్ట్రం
ప్రధాన కార్యాలయంహైదరాబాద్

ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్
  • స్వాతి లక్రా ఐ.పి.ఎస్., డిప్యూటి కమీషనర్ ఆఫ్ పోలీస్
వెబ్‌సైటు
Official website

షి టీమ్స్ ను తెలంగాణ రాష్ట్రంలోని మహిళల రక్షణ మరియు భద్రతకోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసింది.[1] విద్యార్థినులపై వేధింపులు, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే పోకిరీలను అరెస్టు చేసి చట్ట ప్రకారం శిక్షించడం, ఈవ్‌టీజర్ల తల్లిదండ్రులను పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి వారి సమక్షంలో కౌన్సిలింగ్‌ ఇవ్వడం, మళ్లీ పట్టుబడితే నిర్భయ కేసును నమోదు చేయడం షీ టీమ్స్ ముఖ్య నిర్వహణ.[2]

ప్రారంభం[మార్చు]

ఈ షి టీమ్స్ భద్రత, ఆరోగ్యం మరియు పర్యావరణ రక్షణకు తోడు నిలుస్తాయి. దీనిని 2014, అక్టోబరు 24న 2014 ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రారంభించారు. హైదరాబాదు నగర అదనపు కమిషనర్ స్వాతి లక్రా దీనికి నేతృత్వం వహిస్తున్నారు.[3]

షి టీం[మార్చు]

నగరంలో 100 షి బృందాలను, ఒక్కో బృందంలో ఐదుగురు మహిళా పోలీసులను నియమించారు. సాధారణ డ్రెస్‌లోనే ఉండే షి టీమ్స్ సభ్యులు నగరంలోని పలుచోట్ల ఉంటూ, మహిళలను వేధింపులకు గురి చేసిన వారిని తక్షణమే అదుపులోకి తీసుకుంటారు.[2]

ఫలితాలు - విస్తరణ[మార్చు]

షీ టీమ్స్ వచ్చిన తరువాత హైదరాబాద్ నగరంలో మహిళలపై జరిగే దాడులు 20శాతం తగ్గాయి.[4] దాంతో షి టీమ్స్ విభాగాన్ని ప్రతి జిల్లాకు విస్తరించారు.[5] తెలంగాణ మొత్తంగా 200 షి టీమ్స్ పనిచేస్తున్నాయి.[6] మహిళల కోసం 24 గంటల హెల్ప్‌డెస్క్, 181 టోల్‌ఫ్రీ నంబర్ అందుబాటులో ఉంది.[7]

మూలాలు[మార్చు]

  1. ఆంధ్రజ్యోతి (8 March 2018). "ఆడబిడ్డకు అండగా రాష్ట్ర ప్రభుత్వం". Retrieved 17 May 2018.
  2. 2.0 2.1 ఆంధ్రజ్యోతి (25 October 2014). "మహిళా రక్షణకు 'షి' టీమ్స్‌". Retrieved 17 May 2018.
  3. ఆంధ్రభూమి, హైదరాబాద్ (24 January 2017). "షి టీమ్స్‌తో భద్రత.. ఎవరూ భయపడవద్దు". Retrieved 17 May 2018.
  4. ఇండియన్ ఎక్స్ ప్రెస్ (29 October 2017). "'SHE Teams' help reduce crimes against women by 20% in Hyderabad". PTI. Retrieved 17 May 2018.
  5. ది హిందూ (3 March 2018). "SHE teams to be introduced in every district". Retrieved 17 May 2018.
  6. ది హన్స్ ఇండియా, తెలంగాణ (16 November 2017). "200 SHE teams working to ensure the safety of women in Telangana". Retrieved 17 May 2018.
  7. నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక) (2 June 2019). "మన తెలంగాణ ఘన తెలంగాణ". Archived from the original on 2 June 2019. Retrieved 15 June 2019.

బయటి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=షి_టీమ్స్&oldid=2677392" నుండి వెలికితీశారు