షెన్నిస్ పలాసియోస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నికరాగువా భామ షెన్నిస్‌ పలాసియోస్‌ ప్రతిష్టాత్మకమైన మిస్‌ యూనివర్స్‌ ( విశ్వసుందరి ) – 2023 కిరీటం దక్కించుకుంది[1]. నికరాగువా నుంచి ఒకరికి ఈ అంతర్జాతీయ గౌరవం దక్కడం ఇదే మొదటిసారి[2]. 72వ ఎడిషన్‌ మిస్‌ యూనివర్స్‌ పోటీలు 2023 నవంబర్ 18వ తేదీన ఎల్‌ సాల్వెడార్‌లోని శాన్‌ సాల్వెడార్‌లో జోస్‌ అడాల్ఫో పినెడా ఎరేనాలో ఘనంగా జరిగాయి. ఫస్ట్‌ రన్నరప్‌గా మిస్‌ థాయ్‌లాండ్‌ ఆంటోనియో పోర్సిల్డ్, సెకండ్‌ రన్నరప్‌గా మిస్‌ ఆస్ట్రేలియా మొరాయా విల్సన్‌ నిలిచారు[3]. విశ్వ సుందరిగా నిలిచిన న షెన్నిస్‌ పలాసియోస్‌కు గతేడాది మిస్‌ యూనివర్స్‌ అమెరికా సుందరి ఆర్‌ బోనీ గాబ్రియెల్‌ కిరీటం అలంకరించి శుభాకాంక్షలు తెలియజేశారు[4]. ప్రతిష్టాత్మక విశ్వసుందరి - 2023 పోటీల్లో 84 దేశాలకు చెందిన అందాల భామలు పోటీ పడ్డారు. ఒక ఏడాది పాటు వేరే మహిళగా జీవించాలనుకుంటే ఎవరిలా ఉండాలనుకుంటారు? ఎందుకు? అనే ప్రశ్నకు షెన్నిస్ పలాసియోస్ చెప్పిన సమాధానం పోటీల న్యాయనిర్ణయాతులను ముగ్ధులను చేసింది. " వేరే మహిళగా జీవించాలనుకుంటే .. స్త్రీల హక్కుల కోసం ఎంతో పోరాటం చేసిన సామాజికవేత్త మేరీ వాట్సన్ బ్రాడ్ ను ఎంచుకుంటా. ఎందుకంటే, సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తొలగించి ఎంతోమంది మహిళలకు ఆమె అవకాశాన్ని కల్పించారు. స్త్రీలు సంకల్పిస్తే ఎక్కడైనా సమర్థంగా విధులు నిర్వహించగలరు. కాబట్టి తాము కోరుకున్న రంగంలో మహిళలు పనిచేసేందుకు సరైన పరిస్థితులు తీసుకురావడానికి నేను కృషి చేయాలనుకుంటున్నా " అని ఆమె బదులిచ్చారు. మూలాలు :

  1. "Miss Universe 2023: విశ్వసుందరి పలాసియోస్‌". Sakshi. 2023-11-20. Retrieved 2023-11-20.
  2. "Miss Universe 2023: చరిత్ర సృష్టించిన షేనిస్.. విశ్వసుందరి కిరీటాన్ని దక్కించుకున్న షెనిస్‌". Prabha News (in అమెరికన్ ఇంగ్లీష్). 2023-11-19. Retrieved 2023-11-20.
  3. telugu, NT News (2023-11-19). "Miss Universe 2023 | విశ్వసుందరి కిరీటాన్ని దక్కించుకున్న నికరాగ్వా భామ షెన్సిస్ పలాసియోస్". www.ntnews.com. Retrieved 2023-11-20.
  4. "Miss Universe 2023 : విశ్వసుందరి అందాల పోటీలు.. విజేతగా షెన్నిస్ పలాసియోస్". EENADU. Retrieved 2023-11-20.