షెర్ని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
షెర్ని
దర్శకత్వంఅమిత్ వి. మసుర్కర్
స్క్రీన్ ప్లేఆస్థ టికు
కథఆస్థ టికు
నిర్మాతభూషణ్ కుమార్
క్రిషన్ కుమార్
విక్రమ్ మల్హోత్రా
అమిత్ వి. మసుర్కర్
తారాగణంవిద్యాబాలన్
ఛాయాగ్రహణంరాకేష్ హరిదాస్
కూర్పుదీపికా కర్లా
సంగీతంబెనెడిక్ట్ టేలర్
నిర్మాణ
సంస్థలు
టీ-సిరీస్
అబుందాంటియా ఎంటర్‌టైన్‌మెంట్
పంపిణీదార్లుఅమెజాన్ ప్రైమ్ వీడియో
విడుదల తేదీ
2021 జూన్ 18 (2021-06-18)
సినిమా నిడివి
130 నిమిషాలు
దేశంభారతదేశం
భాషహిందీ

షెర్ని 2021లో హిందీలో విడుదలైన థ్రిల్లర్ సినిమా. టి-సిరీస్, అబుందాంటియా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, విక్రమ్ మల్హోత్రా, అమిత్ వి. మసుర్కర్ నిర్మించిన ఈ సినిమాకు అమిత్ వి. మసుర్కర్ దర్శకత్వం వహించాడు. విద్యా బాలన్, శరత్ సక్సేనా, విజయ్ రాజ్, నీరజ్ కబీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జూన్ 2న విడుదల చేసి[1], జూన్ 18న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీలో విడుదల చేశారు.[2]

కథ[మార్చు]

మధ్యప్రదేశ్‌లోని ఓ అటవీ ప్రాంతానికి విద్యా విన్సెంట్‌(విద్యా బాలన్‌) డీఎఫ్‌ఓ(డివిజనల్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌)గా వెళ్తుంది. అదే అడవిలో రెండు పులులు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తిస్తారు. వాటిలో టీ12 అనే ఓ పులి మనుషులపై దాడి చేసి చంపేస్తుంటుంది. విద్య తన సిబ్బందితో కలిసి ఆ పులిని పట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెడుతుంది. మరోవైపు ఆ ప్రాంతంలో ఎన్నికలు జరుగుతుండటంతో పులి దాడిని ఎమ్మెల్యే (అమర్ సింగ్ పరిహార్), మాజీ శాసనసభ్యుడు (సత్యకం ఆనంద్) రాజకీయ లబ్ధి కోసం వాడుకొంటారు. మరి చివరకు పులిని విద్య పట్టుకుందా ? రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఎలాంటి పని చేశారు? ఆ తరువాత ఏమి జరిగింది అనేదే మిగతా సినిమా కథ.[3][4]

నటీనటులు[మార్చు]

  • విద్యాబాలన్ - విద్యా విన్సెంట్ IFS[5]
  • శరత్ సక్సేనా - రంజన్ రాజాన్స్ అకా పింటూ
  • విజయ్ రాజ్ - హసన్ నూరానీ
  • ఇలా అరుణ్ - పవన్ తల్లి
  • బ్రిజేంద్ర కాలా - బన్సాల్‌
  • నీరజ్ కబీ - నాంగియా
  • ముకుల్ చద్దా - పవన్‌
  • అమర్ సింగ్ పరిహార్ - ఎమ్మెల్యే జికె సింగ్‌
  • సత్యకం ఆనంద్ - పీకే సింగ్‌
  • అనూప్ త్రివేది - ప్యారే లాల్‌
  • గోపాల్ దత్ - సాయిప్రసాద్
  • సుమ ముకుందన్ - విద్య తల్లి
  • నడిమ్ హుస్సేన్ - ఫారెస్ట్ గార్డ్/షూటర్‌
  • నిధి దివాన్ - రేష్మ
  • సంప మండలం - జ్యోతి
  • లోకేష్ మిట్టల్ - డీఎఫ్‌ఓ మోహన్‌

అవార్డులు & ప్రశంసలు[మార్చు]

అవార్డు వేడుక తేదీ వర్గం గ్రహీతలు ఫలితం Ref.
ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ 20 ఆగస్టు 2021 ఉత్తమ నటి విద్యా బాలన్ గెలిచింది [6]
FOI ఆన్‌లైన్ అవార్డులు 23 జనవరి 2022 ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ షెర్ని నామినేట్ చేయబడింది [7]
ఉత్తమ నటి - ప్రధాన పాత్ర విద్యా బాలన్ నామినేట్ చేయబడింది
బెస్ట్ డైలాగ్స్ యశస్వి మిశ్రా & అమిత్ వి. మసుర్కర్ నామినేట్ చేయబడింది
ఉత్తమ ప్రదర్శన - సమిష్టి తారాగణం షెర్నీ తారాగణం నామినేట్ చేయబడింది
బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ దీపికా కల్రా గెలిచింది
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ దేవికా దవే నామినేట్ చేయబడింది
ఉత్తమ సౌండ్ డిజైన్ & మిక్సింగ్ అనిష్ జాన్, బిబిన్ దేవ్ & రమేష్ బిరాజ్దర్ నామినేట్ చేయబడింది
67వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు 30 ఆగస్టు 2022 ఉత్తమ నటి విద్యా బాలన్ నామినేట్ చేయబడింది
ఉత్తమ చిత్రం (క్రిటిక్స్) అమిత్ వి. మసుర్కర్ నామినేట్ చేయబడింది
ఉత్తమ నటి (క్రిటిక్స్) విద్యా బాలన్ గెలిచింది
ఉత్తమ స్క్రీన్ ప్లే ఆస్తా టికూ నామినేట్ చేయబడింది
బెస్ట్ డైలాగ్ అమిత్ మసుర్కర్ & యశస్వి మిశ్రా నామినేట్ చేయబడింది
ఉత్తమ సినిమాటోగ్రఫీ రాకేష్ హరిదాస్ నామినేట్ చేయబడింది
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ దేవికా దవే నామినేట్ చేయబడింది
ఉత్తమ సౌండ్ డిజైన్ అనిష్ జాన్ నామినేట్ చేయబడింది
బెస్ట్ ఎడిటింగ్ దీపికా కల్రా నామినేట్ చేయబడింది

మూలాలు[మార్చు]

  1. Namaste Telangana (2 June 2021). "ఫారెస్ట్ ఆఫీస‌ర్‌గా విద్యాబాల‌న్‌.. షేర్నీ ట్రైల‌ర్ రిలీజ్‌". Archived from the original on 24 January 2024. Retrieved 24 January 2024.
  2. Eenadu (17 May 2021). "నేరుగా ఓటీటీలోకి 'షేర్నీ'". Archived from the original on 24 January 2024. Retrieved 24 January 2024.
  3. NTV Telugu (20 June 2021). "రివ్యూ: షేర్నీ (హిందీ సినిమా)". Archived from the original on 24 January 2024. Retrieved 24 January 2024.
  4. Sakshi (18 June 2021). "'షేర్నీ' మూవీ రివ్యూ". Archived from the original on 24 January 2024. Retrieved 24 January 2024.
  5. Sakshi (18 May 2021). "OTTలో విద్యాబాలన్‌ మూవీ: అప్పటి నుంచే ప్రసారం". Archived from the original on 24 January 2024. Retrieved 24 January 2024.
  6. "Indian Film Festival of Melbourne 2021: Vidya Balan, Suriya Win Top Honours". The Quint. 20 August 2021. Archived from the original on 27 October 2021. Retrieved 27 October 2021.
  7. "7th FOI Online Awards, 2022". 15 January 2022. Archived from the original on 16 January 2022. Retrieved 17 January 2022.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=షెర్ని&oldid=4092831" నుండి వెలికితీశారు