షేర్ మణెమ్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
షేర్ మణెమ్మ
Sher Manemma.jpg
నివాసంబీజేఆర్‌నగర్‌, కాప్రా, హైదరాబాద్, తెలంగాణ
జాతీయతభారతీయురాలు
జాతితెలుగు
వృత్తితెలంగాణ ఉద్యమకారిణి

షేర్ మణెమ్మ తెలంగాణ ఉద్యమకారిణి. ఈవిడ 2017 లో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.[1]

జీవిత విశేషాలు[మార్చు]

షేర్ మణెమ్మ కాప్రాలోని బీజేఆర్‌నగర్‌లో ఉంటూ పలు సామాజిక సేవల్లో పాల్గొంటూ పలువురిచే ప్రశంసలు, అవార్డులు అందుకుంది. శ్రీజ్యోతి మహిళామండలి అధ్యక్షురాలిగా ఉంటూ మహిళలకు అండగా ఉంటూ, పేదప్రజల వివాహాలకు... అనాథలకోసం తనవంతు చేయూత అందించింది.[1]

తెలంగాణ ఉద్యమంలో[మార్చు]

తెలంగాణ ఉద్యమం తొలి రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వరకు పట్టువిడువకుండా పాల్గొని, తెలంగాణ పట్ల జరిగిన అన్యాయాన్ని గురించి చెప్పి ప్రజల్లో చైతన్యం తెచ్చింది. తెలంగాణ ఉద్యమ సమయంలో రైలు రోకో, రాస్తారోకో, తెలంగాణ గర్జన, సకల జనుల సమ్మె, తెలంగాణ ధూం ధాంలలో పాల్గొన్నది. వీటికి సంబంధించి మణెమ్మపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఉద్యమం సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులపై జరిగిన దాడులకు నిరసనగా మణెమ్మ చర్లపల్లి జైలుముందు ఐదురోజులపాటు నిరాహారదీక్ష చేసింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు.[1]

బహుమతులు - పురస్కారాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 నమస్తే తెలంగాణ. "యత్ర నార్యస్తు పూజ్యంతే." Retrieved 7 April 2017.