సంగేస్టర్ త్సో
సంగేస్టర్ త్సో | |
---|---|
మాధురి లేక్, గతంలో షోంగా-ట్సర్ లేక్ | |
ప్రదేశం | తవాంగ్ జిల్లా, అరుణాచల్ ప్రదేశ్ |
అక్షాంశ,రేఖాంశాలు | 27°43′N 91°49′E / 27.72°N 91.82°E |
ప్రవహించే దేశాలు | IN |
ఉపరితల ఎత్తు | 3,708 మీటర్లు (12,165 అ.) |
సంగేస్టర్ త్సో, అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ జిల్లాలో తవాంగ్ నుండి బుమ్ లా పాస్‌కు వెళ్లే మార్గంలో సముద్ర మట్టం నుండి 3,708 మీటర్లు (12,165 అ.) ఎత్తున ఉన్న సహజసిద్ధమైన సరస్సు. ఇండో-చైనా సరిహద్దుకు సమీపంలో ఉంది.[1][2][3][4] గతంలో దీన్ని షోంగా-త్సెర్ సరస్సు అనేవాఅరు. దీనిని సినిమా నటి మాధురీ దీక్షిత్ పేరిట దీన్ని మాధురి సరస్సు అని కూడా అంటారు.
భౌగోళికం
[మార్చు]సంగెస్టర్ త్సో తవాంగ్‌కు ఉత్తరాన 35 కి.మీ. బమ్ లా పాస్‌కు పశ్చిమాన 64. కి.మీ. దూరంలో ఉంది. ఇది భారత, చైనాల మధ్య సరిహద్దు వ్యాపార కేంద్రం.
ఉత్తరాన తక్పో షిరి హిమానీనదం క్రింద ఉద్భవించే తక్త్సంగ్ చు నది ఈ ప్రాంతం గుండా ప్రవహిస్తుంది. ఇది పశ్చిమాన ప్రవహించి, ఆ తరువాత నైరుతి దిశగా వెళ్ళి, దిగువన 13 కి.మీ. దూరంలో ఉన్న న్యామ్‌జాంగ్ చు నదిలో కలుస్తుంది. తక్త్సంగ్ గొంపా ఈ ప్రాంతం లోనే పశ్చిమాన 2.4 కి.మీ. దూరంలో ఉంది.
గతంలో భూకంపం వచ్చినపుడు రాళ్లు, బండరాళ్లు, చెట్లు కూలి, సాంగెస్టార్ త్సో సరస్సు ఏర్పడింది.
పర్యాటకం
[మార్చు]ఈ ప్రదేశం, అడవులను, నిర్జన ప్రాంతాలనూ ప్రేమించేవారు ఇష్టప్డేలా ఉంటుంది. తవాంగ్ నుండి వెళ్లి, ఒక రోజులో చేసే విహారయాత్రకు అనువుగా ఉంటుంది.
భారతదేశంలోని పౌర పర్యాటకులు భారత సైన్యం అనుమతితో ఈ సరస్సును సందర్శించవచ్చు. ఇక్కడికి చేరుకునే దారి ప్రమాదభూయిష్టంగా ఉండి, SUVలకు మాత్రమే అనువుగా ఉంటుంది. అది కూడా హిమపాతం లేదా వర్షపాతం లేని స్పష్టమైన వాతావరణం రోజున మాత్రమే.
అనుమతి
[మార్చు]బమ్ లా పాస్‌ను సందర్శించడానికి ప్రత్యేక అనుమతి అవసరం.[3] తవాంగ్ జిల్లాలోని డిప్యూటీ కమీషనర్ కార్యాలయంలో అనుమతులు ఇస్తారు. ఆర్మీ స్టాంప్ లేకపోతే, దారిలో ఉన్న అనేక చెక్ పోస్ట్‌ల ద్వారా సందర్శకులను అనుమతించరు.[5]
ప్రఖ్యాతి గాంచిన సంస్కృతి
[మార్చు]ఈ సరస్సు కోయిలా చిత్రంలో మాధురీ దీక్షిత్ నటించిన సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించారు. దాని ఫలితంగా దీనిని మాధురీ సరస్సు అని అంటారు.
ఇవి కూడా చూడండి
[మార్చు]- తవాంగ్ టౌన్
- తవాంగ్ మొనాస్టరీ
- తవాంగ్ జిల్లా
మూలాలు
[మార్చు]- ↑ Sangetsar Lake, a beautiful paradise near Tawang, named after Madhuri Dixit, The Times of India, 29 January 2019.
- ↑ Sangestar Tso, Government of Arunachal Pradesh, retrieved 10 July 2020.
- ↑ 3.0 3.1 "Bumla Pass, Tawang". mustseeindia.com. Roam Space Travel Solutions Pvt Ltd. Archived from the original on 4 July 2012. Retrieved 2013-04-19.
- ↑ Lake created by an earthquake: Sangestar Tso, Tawang, thelandofwanderlustcom, retrieved 14 November 2021.
- ↑ "BUMLA PASS". sevendiary.com. sevendiary.com. 8 November 2012. Archived from the original on 2018-10-25. Retrieved 2013-04-19.