బుమ్ లా కనుమ
బుమ్ లా కనుమ | |
---|---|
సముద్ర మట్టం నుండి ఎత్తు | 15,200 అడుగులు (4,600 మీ.) |
ప్రదేశం | తవాంగ్ జిల్లా, అరుణాచల్ ప్రదేశ్, భారతదేశం త్సోనా జిల్లా, టిబెట్, చైనా |
శ్రేణి | హిమాలయాలు |
Coordinates | 27°43′25″N 91°53′30″E / 27.7236979°N 91.8916106°E |
బుమ్ లా కనుమ, అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ జిల్లాకూ, టిబెట్‌లోని త్సోనా కౌంటీకీ మధ్య నున్న సరిహద్దు కనుమ.[1] ఇది తవాంగ్ జిల్లాలోని తవాంగ్ పట్టణం నుండి 37 కి.మీ. దూరం లోను, చైనాలోని త్సోనా కౌంటీలోని త్సోనా జాంగ్ పట్టణం నుండి 43 కి.మీ. దూరం లోనూ ఉంది. ఈ కనుమ ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్, టిబెట్‌ల మధ్య వ్యాపార కేంద్రంగా పనిచేస్తోంది.[2] ఇది చైనా, భారత భద్రతా దళాలు పరస్పరం అధికారికంగా గుర్తించిన బోర్డర్ పర్సనల్ మీటింగ్ పాయింట్ కూడా.
స్థానం
[మార్చు]వ్యాపారులు ఉపయోగించిన పాత రహదారి ఒకటి తవాంగ్ నుండి మిలాకటాంగ్ లా (టిబెటన్ భాషలో "లా" అంటే "పాస్") మీదుగా బమ్ లా పాస్ వరకూ, అక్కడినుండి చివరికి టిబెట్‌లోని త్సోనా జాంగ్‌కూ వెళ్తుంది.
చరిత్ర
[మార్చు]1962 చైనా-భారత యుద్ధం
[మార్చు]బమ్ లాకు వెళ్లే మార్గం ఒక చారిత్రిక మార్గం కూడా. 1962 చైనా-భారత యుద్ధం సమయంలో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ భారతదేశంపై దాడి చేసింది. ఇక్కడ బమ్ లా పాస్‌లో 1962 చైనా-భారత యుద్ధంలో భీకర యుద్ధం ఒకటి జరిగింది.
2006లో వాణిజ్య మార్గాన్ని ప్రారంభించడం
[మార్చు]2006 లో, 44 సంవత్సరాల తరువాత, బుమ్లా కనుమను వ్యాపారులకు తిరిగి తెరిచారు. ఇరు దేశాలకు చెందిన పోస్టల్ ఉద్యోగులతో పాటు, వ్యాపారులను కూడా అటూ ఇటూ వెళ్ళేందుకు అనుమతించారు.[3][2]
వాతావరణం
[మార్చు]ఇది దాదాపు సంవత్సరం పొడవునా భారీ మంచుతో కప్పబడి ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఆఫ్-బీట్ కనుమలలో ఒకటి.[4]
పర్యాటకం
[మార్చు]భారత సైన్యం అనుమతితో భారతదేశంలోని పౌర పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు అనుమతిస్తారు. ఈ ట్రాక్ చాలా ప్రమాదకరమైనది, SUVలు మాత్రమే వెళ్ళగలిగే వీలున్నది. అవి కూడా హిమపాతం లేదా వర్షపాతం లేని స్పష్టమైన వాతావరణం రోజున మాత్రమే వెళ్ళగలవు.
షుంగాట్సర్ త్సో సరస్సు
[మార్చు]భూకంపంలో రాళ్లు, బండరాళ్లు, చెట్లు పడిపోవడంతో ఏర్పడిన సరస్సు షుంగాట్సర్ త్సో సరస్సు (సరస్సును టిబెటన్‌లో త్సో అంటారు). ఇక్కడ మాధురీ దీక్షిత్ నటించిన కోయిలా చిత్రాన్ని చిత్రీకరించారు. అంచేత ఈ సరస్సును కొన్నిసార్లు మాధురీ సరస్సు అని కూడా పిలుస్తారు. సరస్సు తవాంగ్ పట్టణం నుండి సుమారు 20 కి.మీ. దూరంలో, సుమారు బం లా పాస్‌కు వెళ్లే రహదారి విభజన నుండి 7 కి.మీ. దూరంలో ఉంటుంది.
రాళ్ల కుప్ప స్మారక చిహ్నం
[మార్చు]ఇక్కడ ఒక రాళ్ల కుప్ప ఉంది, మహోన్నత హిమాలయాలు ఉత్తర సరిహద్దులను సంరక్షిస్తున్నందుకు కృతజ్ఞతా సూచనగా సందర్శకులు ఇక్కడ గులకరాళ్ళను ఉంచుతారు. ఇక్కడ చైనా-భారత స్నేహ చిహ్నం కూడా ఉంది.[5][6][7]
ఇండో-చైనా బోర్డర్ పర్సనల్ మీటింగ్ (BPM) పాయింట్
[మార్చు]భారత సైన్యం, చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ల మధ్య సంబంధాలను మెరుగుపరచడానికి రెండు సైన్యాల మధ్య పరస్పర సంప్రదింపుల కోసం అధికారికంగా అంగీకరించబడిన ఐదు సరిహద్దు సిబ్బంది సమావేశ పాయింట్లలో ఇది ఒకటి.[8]
ఇక్కడ, భారతదేశం వైపున ఒక గుడిసె ఉంది. ఇక్కడే ఇరు సైన్యాలు సరిహద్దు సమావేశాలను నిర్వహిస్తాయి.
అనుమతి
[మార్చు]బమ్ లా పాస్‌ని సందర్శించడానికి ప్రత్యేక అనుమతి అవసరం. దీని కోసం డిప్యూటీ కమీషనర్ కార్యాలయంలో అభ్యర్థించాలి. తవాంగ్‌లోని భారత సైన్యం కంటోన్మెంట్‌లో దానిపై స్టాంపు వేయించుకోవాలి. ఆర్మీ స్టాంపు లేనిదే, దారిలో ఉన్న చెక్ పోస్ట్‌ల వద్ద సందర్శకులను అనుమతించరు.[9]
ఇవి కూడా చూడండి
[మార్చు]- తవాంగ్ మొనాస్టరీ
- తవాంగ్ జిల్లా
- 2022 యాంగ్ట్సే ఘర్షణ
మూలాలు
[మార్చు]- ↑ "This Arunachal waterfall near LAC is being developed for tourism. But China 'keeping an eye'".
- ↑ 2.0 2.1 Indo-China Border Trade Archived 2018-03-14 at the Wayback Machine, Department of Trade & Commerce, Government of Arunachal Pradesh, retrieved 13 July 2020.
- ↑ "BUMLA PASS". sevendiary.com. sevendiary.com. 8 November 2012. Archived from the original on 2018-10-25. Retrieved 2013-04-19.
- ↑ "Bum La Pass mountain pass". travelomy.com. Archived from the original on 13 August 2012.
- ↑ "Heap of stones: A testimony to peace on Sino-India border". Zee News (in ఇంగ్లీష్). 2006-11-01. Retrieved 2022-01-17.
- ↑ Krishnan M, Anantha (6 February 2018). "Major Sandeep Unnikrishnan inspires soldiers guarding Bumla Pass on China border". The New Indian Express. Archived from the original on 9 February 2018. Retrieved 2022-01-17.
- ↑ "Bum La Pass At The India-China Border". The Day Traveller (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2022-01-17. Retrieved 2022-01-17.
- ↑ "Indian soldiers prevent Chinese troops from constructing road in Arunachal". The Times of India. 28 October 2014. Retrieved 11 November 2017.
- ↑ "BUMLA PASS". sevendiary.com. sevendiary.com. 8 November 2012. Archived from the original on 2018-10-25. Retrieved 2013-04-19.