సంజీదా షేక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సంజీదా షేక్, ప్రముఖ భారతీయ టీవీ నటి, వ్యాఖ్యాత, నృత్య కళాకారిణి, మోడల్. హిందీ టీవీ రంగంలో నటి అయిన సంజీదా చాలా తక్కువ సమయంలోనే ప్రఖ్యాత నటిగా గుర్తింపు పొందింది.[1][2][3][4]

కెరీర్[మార్చు]

సంజీదా వివిధ హిందీ సీరియళ్ళలో నటించింది. 2005లో క్యా హోగా నిమ్మూ కా అనే ధారావాహికలో ప్రధాన పాత్ర నిమ్మూగా కెరీర్ ప్రారంభించింది సంజీదా. ఆ తరువాత 2007లో స్టార్ ప్లస్ లో ప్రసారమైన కయామత్ సీరియల్ లో వ్యాంప్ పాత్రలో చేసింది ఆమె. అదే ఏడాది తన భర్త అమీర్ అలీతో కలసి నచ్ బలియే 3 అనే నృత్య ప్రధానమైన షోలో పాల్గొని, విజేతగా నిలిచింది సంజీదా.[5]

మూలాలు[మార్చు]