Jump to content

సంత్వానా బోర్డోలోయ్

వికీపీడియా నుండి
సంత్వానా బోర్డోలోయ్
జననం1949/1950 (age 75–76)[1]
ఐబీట్స్ ప్రైవేట్ లిమిటెడ్.

సంత్వానా బోర్డోలోయ్, అస్సాం రాష్ట్రానికి చెందిన దర్శకురాలు, నటి, రేడియో హోస్ట్, శిశువైద్యురాలు. సంత్వానా దర్శకత్వం వహించిన అదజ్య (1996), మజ్ రతి కేతేకి (2017) రెండు సినిమాలు అస్సామీలో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ అవార్డును గెలుచుకున్నాయి.[2] నటిగా తన కెరీర్‌ను ప్రారంభించిన సంత్వానా, "తేజాల్ ఘోరా" అనే టివి సిరీస్ లో నటించింది. ఈ సిరీస్‌కి కులద కుమార్ భట్టాచార్య దర్శకత్వం వహించాడు.

జననం

[మార్చు]

సంత్వానా అస్సాంలోని గౌహతిలో జన్మించింది.

సినిమారంగం

[మార్చు]

వృత్తిరీత్యా శిశువైద్యురాలైన డాక్టర్ సంత్వానా బోర్డోలోయ్ డిస్పూర్ హాస్పిటల్‌లో పనిచేస్తున్నది. 1996లో, అదజ్య (ది ఫ్లైట్) సినిమాతో దర్శకురాలిగా సినిమారంగంలోకి ప్రవేశించింది. ఇందిరా గోస్వామి రాసిన నవల, దొంతల్ హాతిర్ ఉయియే ఖోవా హౌడా (ది మాత్ ఈటెన్ హౌదా ఆఫ్ ఎ టస్కర్) ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది. ఈ సినిమాకు అస్సామీలో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ అవార్డు వచ్చింది, వివిధ అంతర్జాతీయ చలనచిత్రాలలో కూడా ప్రదర్శించబడింది.[1]

సంత్వానా 2017లో తీసిన మజ్ రాతి కేతేకి సినిమాకు 2017 జాతీయ అవార్డులలో ఉత్తమ అస్సామీ ఫీచర్ ఫిల్మ్‌గా అవార్డు వచ్చింది.[3] ఈ చిత్రంలో నటించిన ఆదిల్ హుస్సేన్కు 64వ జాతీయ చలనచిత్ర అవార్డులలో నర్గీస్ దత్తా అవార్డు (ప్రత్యేక ప్రస్తావన) ను గెలుచుకున్నాడు.[4][5][6][7][8]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 February 2, india today digital; February 2, 1998 ISSUE DATE; March 7, 1998UPDATED; Ist, 2013 13:06. "Dr Santwana Bordoloi: A doctor and a movie director". India Today (in ఇంగ్లీష్). Retrieved 2022-02-12. {{cite web}}: |first4= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)
  2. Phukan, Vikram (2018-01-27). "Maj Rati Keteki: A mirror to Assamese society". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2022-02-12.
  3. journalist, Nava Thakuria Nava Thakuria is a Northeast India; Guwahati, based in; NewsBlaze, who contributes to; Assam, various media outlets throughout the world Nava is also secretary of the Journalists' Forum. "Maj Rati Keteki: Director Reveals Author's Insight". NewsBlaze India (in ఇంగ్లీష్). Retrieved 2022-02-12.
  4. "Archived copy". Archived from the original on 21 April 2017. Retrieved 2022-02-12.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  5. "Recognition by National Award Jury Prestigious, Inspiring: Adil Hussain". News18. 2017-04-17. Retrieved 2022-02-12.
  6. Henna Rakheja (2017-04-07). "Adil Hussain on National Award win: It's dangerous to get an award like this | bollywood". Hindustan Times. Retrieved 2022-02-12.
  7. 13:07 2017. "National Film Awards: 'Dikchow Banat Palaax' Wins Best Feature film on National Integration » Northeast Today". Northeasttoday.in. Retrieved 2022-02-12. {{cite web}}: |last= has numeric name (help)
  8. "Back to films after a two-decade hiatus". The Hindu. 2016-12-11. Retrieved 2022-02-12.


బయటి లింకులు

[మార్చు]