సంస్కృత భాషా ప్రచార సమితి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లోగో

సంస్కృత భాషా ప్రచార సమితి హైదరాబాదు కేంద్రంగా పనిచేస్తున్న భాషా ప్రచార సంస్థ. ఇది జి.పుల్లారెడ్డి చారిటీస్ ట్రస్ట్ అనుబంధ సంస్థ. ఈ సంస్థ కార్యాలయం అబిడ్స్లోని హరేకృష్ణా దేవాలయాన్ని ఆనుకొని ఉన్న భవంతిలో రెండవ అంతస్తులో కలదు.

కార్య కలాపాలు

[మార్చు]

సంస్కృత భాష ప్రచారంలో భాగంగా సంస్కృత పుస్తకాల ప్రచురణ, సంస్కృత భాషలో ప్రవేశ-ప్రథమ-మొ|| పరీక్షల నిర్వహణ, ఇంకా సంస్కృత భాషా సంబంధిత కార్యక్రమాలకు సహకారం వంటి పనులను సంస్థ నిర్వర్తిస్తుంటూంది.

చిరునామా

[మార్చు]

సంస్కృతభాషా ప్రచార సమితి
6-3-240/6/1, 1వ అంతస్తు,
virinchi Hospital (Banjarahills Road No.1) Back Side, Sarada Street, Prem Nagar,
Khairatabad (PO), హైదరాబాదు-500004 Phone No.040-23305481

సమితి ప్రచురణలు

[మార్చు]

సమితి నిర్వహించే పరీక్షలు

[మార్చు]
  • సంస్కృతభారతీ పరీక్షలు
ఈ పరీక్షలు 9 స్థాయీల్లో నిర్వహిస్తారు. ప్రవేశిక, ప్రథమ, ద్వితీయ, తృతీయ, నిష్ణాత, పారీణ పూర్వార్ధం, పారీణ ఉత్తరార్ధం, చూడామణి పూర్వార్ధం, చూడామణి ఉత్తరార్ధం.

పరీక్ష రుసుము అత్యల్పంగా ₹15 నుండి అత్యధికంగా ₹75 వరకు. ప్రవేశిక, ప్రథమ రాయటానికి ఏ విద్యార్హతలూ, వయస్సూ నియమాలు లేవు, ఎవరైనా రాయవచ్చు. మిగితా స్థాయిలకు నియమాలున్నా, శుల్కంతో కూడిన మినహాయింపులున్నాయి. ఈ పరీక్షలు మార్చి, సెప్టెంబరు మాసాల్లో శని, ఆదివారాల్లో నిర్వహించబడతాయి. పారీక్షా ఫలితాలు వచ్చిన రెండు మాసములలో ఉత్తీర్ణులకు అంకపత్రములు, విజయపత్రములు పంపబడతాయి.