Jump to content

సతీశ్ చంద్ర శర్మ

వికీపీడియా నుండి
సతీష్ చంద్ర శర్మ
సతీశ్ చంద్ర శర్మ


తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
పదవీ కాలం
13 అక్టోబర్ 2021 – 2022 జూన్ 27
నియమించిన వారు రామ్‌నాథ్‌ కోవింద్‌
తరువాత ఉజ్జల్ భుయాన్

కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి
పదవీ కాలం
28 ఆగష్టు 2021 – 12 అక్టోబర్ 2021
నియమించిన వారు రామ్‌నాథ్‌ కోవింద్‌

కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి
పదవీ కాలం
4 జనవరి 2021 – 23 ఆగష్టు 2021
సూచించిన వారు శరద్ అరవింద్ బొబ్దే
నియమించిన వారు రామ్‌నాథ్‌ కోవింద్‌

మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి
పదవీ కాలం
18 జనవరి 2008 – 3 జనవరి 2021
సూచించిన వారు కే. జి. బాలకృష్ణన్
నియమించిన వారు ప్రతిభా పాటిల్

వ్యక్తిగత వివరాలు

జననం (1961-11-30) 1961 నవంబరు 30 (వయసు 63)
భోపాల్, మధ్యప్రదేశ్, భారతదేశం
వెబ్‌సైటు Official website

సతీశ్‌ చంద్ర శర్మ భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆయన 17 సెప్టెంబర్ 2021న తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.[1]సతీష్‌ చంద్ర శర్మ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అక్టోబర్ 13న ప్రమాణం చేశాడు.[2]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

సతీష్ శర్మ మధ్యప్రదేశ్‌ రాష్ట్రం, భోపాల్‌లో 30 నవంబర్‌ 1961లో బీఎన్‌ శర్మ, శాంతిశర్మ దంపతులకు జన్మించాడు. ఆయన హరిసింగ్‌గౌర్‌ విశ్వవిద్యాలయంలో 1984లో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి ఎల్‌ఎల్‌బీలో 3 గోల్డ్‌మెడల్స్‌ సాధించాడు.

వృత్తి జీవితం

[మార్చు]

సతీశ్‌ శర్మ 1 సెప్టెంబర్ 1984న న్యాయవాదిగా ఎన్రోల్ చేసుకున్నాడు. ఆయన 2003లో కేంద్ర ప్రభుత్వ అదనపు కౌన్సెల్‌గా, 28 జూన్‌ 2004న కేంద్ర ప్రభుత్వ సీనియర్‌ ప్యానల్‌ కౌన్సెల్‌గా నియమితులయ్యాడు. సతీశ్‌ శర్మ 18 జనవరి 2008న మధ్యప్రదేశ్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితుడై, 15 జనవరి 2010న శాశ్వత న్యాయమూర్తి అయ్యాడు. ఆయన 4 జనవరి 2021న నియమితుడై ఆగస్టు 31న కర్ణాటక హైకోర్టు తాతాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టాడు.[3] కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న ఆయన పదోన్నతిపై తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అక్టోబర్ 9న నియమితులయ్యాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (17 September 2021). "హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా సతీశ్‌చంద్రశర్మ!". Archived from the original on 18 September 2021. Retrieved 18 September 2021.
  2. Sakshi (11 October 2021). "తెలంగాణ హైకోర్టు సీజేగా సతీష్‌ చంద్ర శర్మ ప్రమాణం". Archived from the original on 11 October 2021. Retrieved 11 October 2021.
  3. The Hindu (28 August 2021). "Satish Chandra Sharma to be acting Chief Justice" (in Indian English). Archived from the original on 18 September 2021. Retrieved 18 September 2021.
  4. Andrajyothy (10 October 2021). "తెలంగాణ హైకోర్టు సీజేగా సతీశ్‌ చంద్ర శర్మ". Archived from the original on 10 October 2021. Retrieved 10 October 2021.