Jump to content

సత్యదేవ్ నారాయణ్ ఆర్య

వికీపీడియా నుండి
సత్యదేవ్ నారాయణ్ ఆర్య
19వ త్రిపుర గవర్నర్
In office
2021 జులై 7 – 2023 అక్టోబరు 25
ముఖ్యమంత్రిబిప్లబ్ దేబ్
మాణిక్ సాహా
అంతకు ముందు వారురమేష్ బైస్
తరువాత వారుఇంద్రసేనా రెడ్డి
17వ హర్యానా గవర్నర్
In office
2018 ఆగస్టు 25 – 2021 జులై 6
ముఖ్యమంత్రిమనోహర్ లాల్ ఖట్టర్
అంతకు ముందు వారుకప్తాన్ సింగ్ సోలంకి
తరువాత వారుబండారు దత్తాత్రేయ
గనులు, భూగర్భ శాస్త్ర మంత్రి
(బీహార్ ప్రభుత్వం)
In office
2010 నవంబరు – 2015 నవంబరు
ముఖ్యమంత్రినితీష్ కుమార్
జితన్ రామ్ మాంఝీ
తరువాత వారుమునేశ్వర్ చౌదరి
నియోజకవర్గంరాజ్‌గిర్
బీహార్ శాసనసభ శాసనసభ్యుడు
In office
1995–2015
అంతకు ముందు వారుచందర్ దేవ్ ప్రసాద్ హిమాన్షు
తరువాత వారురవి జ్యోతి కుమార్
నియోజకవర్గంరాజ్‌గిర్
In office
1977–1990
అంతకు ముందు వారుచందర్ దేవ్ ప్రసాద్ హిమాన్షు
తరువాత వారుచందర్ దేవ్ ప్రసాద్ హిమాన్షు
నియోజకవర్గంరాజ్‌గిర్
వ్యక్తిగత వివరాలు
జననం (1939-07-01) 1939 జూలై 1 (వయసు 85)
రాజ్‌గిర్, బీహార్, బ్రిటీష్ ఇండియా
(ప్రస్తుత బీహార్, భారతదేశం)
జాతీయతభారతీయుడు
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామిసరస్వతీ దేవి
సంతానం5
నివాసంత్రిపుర రాజ్‌భవన్ (అగర్తల) త్రిపుర

సత్యదేవ్ నారాయణ్ ఆర్య (జననం 1937 జూలై 1) భారత దేశానికి చెందిన రాజకీయ నాయకుడు. నారాయణ్ ఆర్య త్రిపుర రాష్ట్ర గవర్నరుగా 2021 జులై 14 నుండి 2023 అక్టోబరు 25 వరకు పదవిలో ఉన్నారు. అతను బీహార్ రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు. ఇతను ఇంతకు పూర్వం హర్యానా గవర్నర్‌గా కూడా సేవలు అందించాడు.[1][2][3] బీహార్ శాసనసభకు రాజ్‌గిర్ శాసనసభ నియోజకవర్గం నుండి వరుసగా ఎనిమిది సార్లు ఎన్నికయ్యాడు.[4]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఆర్య బ్రిటీష్ ఇండియాలోని బీహార్ ప్రావిన్స్‌లోని నలంద జిల్లా లోని రాజ్‌గిర్‌ లోని గాంధీ తోలాలో 1939 జూలై 1న శివన్ ప్రసాద్, సుందరి దేవి దంపతులకు జన్మించాడు. అతను పాట్నా విశ్వవిద్యాలయం నుండి తన మాస్టర్స్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ. ఎల్.ఎల్.బి; డిగ్రీలను అందుకున్నాడు. ఆర్య సరస్వతి దేవిని వివాహం చేసుకున్నాడు, అతనికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

రాజకీయ జీవితం

[మార్చు]

ఆర్య 1988-1998 వరకు బీహార్ ఎస్.సి సెల్ బీజేపీ అధ్యక్షుడిగా అలాగే ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ ఫ్రంట్ కోశాధికారిగా ఉన్నారు. రాజ్‌గిర్ నుండి ఎనిమిది సార్లు బీహార్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్నికైన విధానసభ సభ్యుడు, అతను 1979 నుండి 80 వరకు గ్రామీణాభివృద్ధి మంత్రిగా, 2010లో గనులు, భూగర్భ శాస్త్ర మంత్రిగా పనిచేశారు.[5]

మూలాలు

[మార్చు]
  1. "Satyadev Narayan Arya takes oath as new Haryana Governor". Business Standard. Press Trust of India. 25 August 2018.
  2. "सत्यदेव नारायण आर्य होंगे हरियाणा के नए राज्यपाल". Jagran. Retrieved 2018-08-21.
  3. "सत्यदेव नारायण आर्य को टीवी से मिली हरियाणा के राज्यपाल बनाये जाने की सूचना". News18 Hindi. 21 August 2018. Retrieved 2018-08-22.
  4. "JD(U)-BJP formula same as Nitish govt takes oath - Indian Express". archive.indianexpress.com. Retrieved 2021-10-14.
  5. "Shri Satyadeo Narain Arya Hon'ble Governor of Tripura". tripura.gov.in. Retrieved 3 March 2022.