సత్యనారాయణ పురం (బయ్యారం)
స్వరూపం
ఈ గ్రామం - "సత్యనారాయణ పురం (బయ్యారం)" - పేరు సంబంధిత మండలం పేజీలో లేదు. ఈ పేజీలో ఉన్న సమాచారం సరైనదో కాదో నిర్ధారించుకోవాలి. లేదా మండలం పేజీలో ఈ గ్రామం వేరే పేరుతో ఉందేమో చూసి, ఉంటే... ఈ రెండు పేజీలను విలీనం చెయ్యాలి |
సత్యనారాయణపురం ఖమ్మం జిల్లా, బయ్యారం మండలంలోని గ్రామం.[1]. సా.శ 13 వ శతాబ్దంలో ఈ గ్రామం నిర్మించబడినది అనేందుకు కొన్ని ఆధారాలు ఈవూరి పొలిమేరల్లో ఉన్నాయి. కాకతీయ చక్రవర్తి అయిన గణపతిదేవుడు పరిపాలనాకాలంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన సామంతరాజు భార్య ఐన మైలమాంబ కు, కట్న కానుకలుగా ఈ ప్రాంతాన్ని ఇచ్చినట్లు శాసనాలు చెబుతున్నాయి.
సత్యనారాయణ పురం | |
— రెవిన్యూ గ్రామం — | |
Lua error in మాడ్యూల్:Location_map at line 391: A hemisphere was provided for longitude without degrees also being provided. |
|
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | ఖమ్మం |
మండలం | బయ్యారం |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
ప్రస్తుత బయ్యారం చెరువు (మైలసముద్రము అనీ అంటారు) అలుగుల వృథానీరు అలిగేరు అనే చిన్న నది ద్వారా క్రిష్ణలో కలుస్తుంది. ఈ నది పరీవాహకప్రాంతములో ఉన్న ఈ గ్రామం, ముక్కారు పంటలతో సస్యశ్యామలంగా విరాజిల్లుతుంది. ఖమ్మం జిల్లాలో ఉత్తమ గ్రామంగా దీనిని తీర్చిదిద్దారు.
- ఈ గ్రామములో శ్రీమతి నాదెళ్ళ కమలమ్మ అను ఒక స్వాతంత్ర్య సమరయోధురాలు ఉన్నారు. ఈమె తెలంగాణా విముక్తిపోరాటంలో, చురుకైన పోరాటంచేశారు. స్వాతంత్ర్య సమరయోధురాలిగా ప్రజల మన్ననలను పొందారు. ఈమె తన 93 వ ఏట, జనవరి-2/2014 న కాలధర్మం చెందినారు. [1]
[1] ఈనాడు ఖమ్మం; జనవరి-3,2014;7వ పేజీ.
మూలాలు
[మార్చు]- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-09-20. Retrieved 2015-08-08.