సదల్ పూర్ జాతర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సదల్ పూర్ జాతర తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సదల్ పూర్ లో శ్రీమహాదేవ్ ,భైరాన్ దేవ్ జాతర జరుగుతుంది.గోండు తెగలోని కోరెంగ గోత్రం వంశీయులు పూజారులుగా ఉంటారు. పుష్యమాసం మొదటి వారంలో ఆదివాసీలు జాతర ఇచ్చికు పూజలు చేసి ప్రారంభిస్తారు[1] [2].

సదల్ పూర్ జాతర
శ్రీమహదేవ్,బైరాన్ దేవ్ ఆలయాలు
శ్రీమహదేవ్,బైరాన్ దేవ్ ఆలయాలు
పేరు
ఇతర పేర్లు:జంగి జాతర
ప్రధాన పేరు :కాలభైరవ ఆలయం
ప్రదేశం
దేశం:భారతదేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:ఆదిలాబాద్
ప్రదేశం:బేల సదల్ పూర్
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:శ్రీమహదేవ్,బైరాన్ దేవ్
నిర్మాణ శైలి, సంస్కృతి
దేవాలయాలు మొత్తం సంఖ్య:2
ఇతిహాసం
నిర్మాణ తేదీ:16 వ శతాబ్ధంలో
సృష్టికర్త:శాతవాహనులు

చరిత్ర

[మార్చు]

శ్రీమహదేవ్,భైరాన్ దేవ్ రెండు ఆలయాలు అత్యంత పురాతనమైనవి. నల్లని రాతితో నిర్మించిన ఈ ఆలయ నిర్మాణ శైలిని బట్టి 800 సంవత్సరాల చరిత్ర ఉంది.ఈ ఆలయాన్ని శాతవాహనులు క్రీ,శ 16 వ శతాబ్ధంలో నిర్మించి ఉంటారని తెలుస్తుంది. పరమశీవుడే మహాదేవుడి అవతారమని భావిస్తారు.

ప్రత్యేకత

[మార్చు]

ఈ భైరాన్ దేవ్ ఆలయంలో లింగాన్ని పైకెత్తి తే కోరిక తీరేదైతే లింగం సులువుగా పైకి లేస్తుంది[3].లేకుంటే లింగం అస్సలు కదలదని భక్తులు విశ్వాసం. దేవుడి మూర్తికి భక్తులు ప్రతి ఏడాది జాతర సంద్భంగా చందనం పూత పూస్తారు. అలా శతాబ్దాల తరబడి చందనం రాయడంతో దేవుడి రూపం సింధూరమయవగా విగ్రహం తల భాగం మీటరు ఎత్తు వరకు పెరిగి అదే రోజు సాయింత్రం ఒక్క సారిగా కిందపడిపోయింది దినితో దేవుని నిజస్వరూపం బయటపడిందని పెద్దలు చెపుతుంటారు[4].

జాతర

[మార్చు]

బేల మండలం సదల్ పూర్ గ్రామంలో యాభై రెండు ఏళ్ల నుంచి ఈ శ్రీ మహదేవ్, భైరాన్ దేవ్ ఆలయాల్లో జాతర పుష్యమాసంలో వారం రోజులు పాటు జాతర జరుగుతుంది. గోండు గిరిజనుల అటవీ ప్రాంతంలో జాతర నిర్వహించడంతో ఈ జాతర ను జంగి జాతర అని అంటారు. గిరిజన తెగల్లో కోరెంగా గోత్రం వంశీయులు పూజలు నిర్వహించడంతో జాతర ప్రారంభమవుతుంది[5]. వారం రోజుల పాటు జరిగే జాతర అమావాస్య రోజున కాలదహి హండి కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. మట్టి కుండలో పెరుగు వేసి ఆలయం పైన జెండా ఎగురవేస్తారు.అనంతరం పేరుగు కుండను పగలగొట్టి అందులో కుడుకలు,పాలు,అటుకులు,పేలాలు అన్ని కలిపి ఆలయం పైనుండి భక్తులకు చేరెవిధంగా విసురుతారు. ఈ జాతరను ప్రారంభించి గోండు గిరిజనులు నార్నూర్ మండలంలోని ఖందేవుని పూజకు పయానమౌతారు.

మూలాలు

[మార్చు]
  1. Velugu, V6 (2023-01-05). "ఆదిలాబాద్ జిల్లాలో జాతర్లే.. జాతర్లే..." V6 Velugu. Retrieved 2024-06-30.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  2. "Dailymotion". www.dailymotion.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-06-30.
  3. "ఈ జాతర లో శివలింగాన్ని ఎత్తితే.. కోరికలు తీరుతాయట". News18 తెలుగు. 2024-02-06. Retrieved 2024-06-30.
  4. "Bhairamdev Temple: భైరందేవుడి ఆలయంలో అద్భుతం.. శతాబ్దాల తర్వాత మహాదేవుడు నిజ స్వరూపం.. దర్శనం కోసం పోటెత్తిన భక్తులు". TV9 Telugu. 2023-09-28. Retrieved 2024-06-30.
  5. News, Sira (2024-02-01). "Mahadeva Bairamdev Jambi: 3న మహదేవ బైరందేవ్ జంబి జాతర ప్రారంభం". SIRA NEWS. Retrieved 2024-06-30. {{cite web}}: |last= has generic name (help)